సాక్షి, అనంతపురం : మతి స్థిమితం కోల్పోయిన తండ్రి రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను హతమార్చిన విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామానికి చెకందిన రవి.. ఇద్దరు చిన్నారులు సుదీప్,(5) సుధీర్ (5)ను హతమార్చాడు. బుధవారం రాత్రి పొద్దుపోయిన అనంతరం తన ఇద్దరు కొడుకులను గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకు వెళ్లి గొంతు నులిమి చంపి అక్కడే పూడ్చి పెట్టాడు. అయితే పిల్లలు కనిపించకపోవడంతో స్థానికులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూడ్చి పెట్టిన ఇద్దరు చిన్నారులను గ్రామస్తులు వెలికితీసి, పోలీసులకు సమాచారం అందించారు. కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు రవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment