premante idera
-
సరోగసి ద్వారా ప్రీతి జింటాకు కవలలు
ముంబై: ప్రేమంటే ఇదేరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటి ప్రీతి జింటా అద్దె గర్భం (సరోగసి) ద్వారా తల్లయింది. ఆమెకు కవల పిల్లలు.. ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. ఈ శుభవార్తని ప్రీతి జింటా గురువారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణుడు జెనె గుడెనఫ్‌ను 2016లో పెళ్లిచేసుకున్న ప్రీతి జింటా అప్పట్నుంచి వెండితెరకి దూరమయ్యారు. అమెరికాలో లాస్ఏంజెల్స్లో ఉంటున్న 46 ఏళ్ల వయసున్న ప్రీతి ఇప్పుడు తల్లయిన సంబరంలో ఉన్నారు. సరోగసి ద్వారా తల్లినయ్యే అపురూపమైన ఈ ప్రయాణంలో తమకు తోడ్పాటునందించిన డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, అద్దె గర్భాన్ని మోసిన మహిళకి ప్రీతి ధన్యవాదాలు తెలిపారు. తన పిల్లలకి జై, జియా అని పేర్లు పెట్టినట్టు ఆ ట్వీట్లో వెల్లడించారు. ‘‘నేను, నా భర్త ఆనందంలో తలమునకలై ఉన్నాము. ఇద్దరు పిల్లలు ఒడిలోకి వచ్చిన ఈ సంబరంలో మా హృదయాలు ఎంతో ప్రేమతో నిండిపోయి ఉన్నాయి. వైద్య సిబ్బందిపై అపారమైన కృతజ్ఞత ఉంది. పిల్లలతో కొత్త ప్రయాణంపై ఎంతో ఉద్వేగంగా ఉంది’’ అని ప్రీతి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. బాలీవుడ్లో బిడ్డల్ని కనడానికి సరోగసి విధానాన్ని ఎంచుకోవడం కొత్తకాదు. గతంలో కరణ్ జోహార్, షారూక్ ఖాన్, ఏక్తాకపూర్, అమీర్‌ఖాన్ వంటి వారు సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారు. -
కొత్తవాళ్లతో జయంత్ రియలిస్టిక్ సినిమా
‘ప్రేమించుకుందాం రా’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘బావగారు బాగున్నారా’, ‘టక్కరి దొంగ’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘లక్ష్మీ నరసింహ’... ఇలా దర్శకుడు జయంత్ సి. పరాన్జీ తెలుగులో టాప్ హీరోలతో టాప్ సినిమాలు తీశారు. నాలుగేళ్ల క్రితం పవన్‌కల్యాణ్‌తో ‘తీన్మార్’ తీసిన జయంత్ ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆయన మెగాఫోన్ పట్టనున్నారు. అయితే అది ఆయన శైలిలో సాగే రొమాంటిక్ మాస్, ఎంటర్టైనర్ సినిమా మాత్రం కాదు. పాటలు, రొమాన్స్ ఇలాంటివేమి లేకుండా వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే సినిమా తీయాలనుకుంటున్నారాయన. దీని గురించి జయంత్ చె బుతూ - ‘‘ఇప్పటి వరకూ హీరోలను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్‌లు రెడీ చేశాను. కానీ బోర్ కొట్టేసింది. ఇప్పుడు నా శైలికి భిన్నంగా ఉండే సినిమా తీయనున్నా. తాగుడుకు బానిసై సస్పెండ్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే నేరం మీద ఎలా పోరాటం సాగించాడనే కథాంశంతో చాలా రియలిస్టిక్‌గా తీద్దామనుకుంటున్నా. కొత్త వాళ్లతోనే ఈ సినిమా చేయనున్నా. ఎందుకంటే ప్రేక్షకులు కొత్త వాళ్ల నుంచి ఏమీ ఆశించరు’’ అన్నారు. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : కోరస్ (రమణగోగుల): తరరేరా రరిరా తరారరిరా (2) తరరేరా రరిరా తరరేర రా రా రారా (2) తరరేరరే రారా రారారే తారరారిరా అతడు: మనసే ఎదురు తిరిగి మాట వినదే ఆమె: కలిసే ఆశ కలిగి కునుకు పడదే అ: మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు ఆ: తుది లేని ఊహలకు నీ స్నేహమే అదుపు అ: ప్రణయానికే మన జంటనే పద కొత్త మైమరపు చరణం : 1 అ: కలలో మొదటి పరిచయం గురుతు వుందా ఆ: సరిలే చెలిమి పరిమళ ం చెరుగుతుందా అ: చెలివైన చెంగలువా కలలోనే ఈ కొలువా ఆ: చెలిమైన వెన్నెలవా నిజమైన నా కలవా అ: నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా చరణం : 2 అ: చినుకై కురిసినది కదా చిలిపి సరదా ఆ: అలలై ఎగసినది కదా వలపు వరద అ: మనసే తడిసి తడిసి అలగా కరిగిపోదా ఆ: తలపే మెరిసి మెరిసి తగు దారి కనపడదా అ: వెతికే జతే కలిసి వయసు మరి ఆగనంది కదా చిత్రం : ప్రేమంటే ఇదేరా (1998) రచన : సిరివెన్నెల సంగీతం : రమణగోగుల గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర -
గీత స్మరణం
అతడు: ఏమో ఎక్కడుందో కూసే కోయిల... నాతో ఏవిటందో ఊహించేదెలా ఎదలో ఊయల ఊగే సరిగమ ఏదో మాయలా అల్లే మధురిమ ఆమె: లలలా లాలలా లాలాలాలలా (2) పల్లవి : అతడు: నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా ఆమె: ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊ... అంటానుగా అ: మనమే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా చరణం : 1 అ: ఇద్దరికీ ఒద్దిక కుదరగ ఇష్టసఖి వద్దని బెదరక ఆ: సిద్ధపడే పద్ధతి తెలియక తలొంచి తపించు తతంగమడగక ॥ఉన్న॥ చరణం : 2 ఆ: రెప్పలలో నిప్పుల నిగనిగ నిద్దరనే పొమ్మని తరమగ అ: ఇప్పటికో ఆప్తుడు దొరకగ వయ్యారి వయస్సు తయారైందిగా ॥ఉన్న॥ పల్లవి : ఆమె: వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాఠం అతడు: సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలిగీతం ఆ: ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా? అ: ఓ... ఊహకందని భాష నేర్చుకో మనసా ఆ: ఓ... సామిరారా ప్రేమంటే ఇదేరా! అ: నా సితార ప్రేమంటే ఇదేరా..! ॥ చరణం : 1 ఆ: రేయిభారం రెట్టింపయ్యింది లేవయ్యారం నిట్టూరుస్తుంది అ: రాయబారం గుట్టే చెప్పంది హాయి బేరం గిట్టేలాగుంది ఆ: మాయలేని ప్రేమంటే ఇదేరా! అ: సాయమడిగే ప్రేమంటే ఇదేరా..! ॥ చరణం : 2 అ: తేనె మేఘం కాదా నీ దేహం వానరాగం కోరే నా దాహం ఆ: గాలివేగం చూపే నీమోహం తాకగానే పోదా సందేహం అ: ప్రాణముంది ప్రేమంటే ఇదేరా! ఆ: ప్రాయమంది ప్రేమంటే ఇదే... ॥ చిత్రం : ప్రేమంటే ఇదేరా (1998), రచన : సిరివెన్నెల సంగీతం : రమణగోగుల, గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర