ఈ పాటకు ట్యూన్ తెలుసా? | a song from premante idera | Sakshi
Sakshi News home page

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

Published Tue, Feb 18 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

 పల్లవి :  
 కోరస్ (రమణగోగుల):
 తరరేరా రరిరా తరారరిరా     (2)
 తరరేరా రరిరా తరరేర రా రా రారా (2)
 తరరేరరే రారా రారారే తారరారిరా
 అతడు: మనసే ఎదురు తిరిగి మాట వినదే
 ఆమె: కలిసే ఆశ కలిగి కునుకు పడదే
 అ: మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు
 ఆ: తుది లేని ఊహలకు
   నీ స్నేహమే అదుపు
 అ: ప్రణయానికే మన జంటనే పద
   కొత్త మైమరపు
 చరణం : 1
 అ: కలలో మొదటి పరిచయం
   గురుతు వుందా
 ఆ: సరిలే చెలిమి పరిమళ ం చెరుగుతుందా
 అ: చెలివైన చెంగలువా
   కలలోనే ఈ కొలువా
 ఆ: చెలిమైన వెన్నెలవా నిజమైన నా కలవా
 అ: నిను వీణగా కొనగోట మీటితే
   నిదురపోగలవా
 చరణం : 2
 అ: చినుకై కురిసినది కదా చిలిపి సరదా
 ఆ: అలలై ఎగసినది కదా వలపు వరద
 అ: మనసే తడిసి తడిసి అలగా కరిగిపోదా
 ఆ: తలపే మెరిసి మెరిసి
   తగు దారి కనపడదా
 అ: వెతికే జతే కలిసి
   వయసు మరి ఆగనంది కదా
 
 చిత్రం : ప్రేమంటే ఇదేరా (1998)
 రచన : సిరివెన్నెల
 సంగీతం : రమణగోగుల
 గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement