sp balu
-
ఎస్పీ చరణ్‌తో వివాదం.. స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్!
గతంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ 'కీడా కోలా' చిత్రయూనిట్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రీక్రియేట్ చేసినందుకుగానూ సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌తో పాటు సినిమా యూనిట్‌కు జనవరి 18న నోటీసులు పంపినట్లు తెలిపారు. ఆయన గొంతును అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాలని.. నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వివాదంపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'మాకు.. ఎస్పీ చరణ్ సార్‌కు మధ్య కొంచెం కమ్యూనికేషన్ సమస్య వచ్చింది. ఏదేమైనా మాకు ఏదైనా కొత్తగా చేయాలని ఉంటుంది. అంతే కాకుండా మన సినీ దిగ్గజాలను గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. అంతకు మించి ఏం లేదు. ఎవరినీ డిస్ రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. మేం చేసే చిన్న సినిమాలు మీరు కూడా చూస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్లతో కలిసి కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. అలా చేయాలనే కోరిక కూడా లేదు. కానీ మా వరకు ఏదో ఒకటి చేయాలనే పట్టుదలతో ఉన్నాం. ఏఐ వచ్చినా కూడా దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవాళ, రేపు మన జాబ్ ప్రమాదంలో ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒక ప్రయోగం చేయాల్సిందే. మేం చేసినా.. చేయకపోయినా మార్పు అయితే జరుగుతది. మా మధ్య కొన్ని విషయాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిండొచ్చు. కానీ ఇప్పుడంతా ఓకే. ఆ సమస్య ముగిసిపోయింది' అని అన్నారు. అసలేం జరిగిందంటే.. కాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడాకోలా మూవీ గతేడాది రిలీజైంది. ఇందులో ఓ సన్నివేశంలో స్వాతిలో ముత్యమంత అనే పాట బ్యాగ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏఐ సాయంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును రీక్రియేట్ చేశారు. దీనిపై ఎస్పీ చరణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. -
చంద్రమోహన్, కె విశ్వనాథ్‌కు రిలేషన్.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
తెలుగు సినిమారంగంలో కళాతపస్విగా గుర్తింపు తెచ్చుకున్న కె.విశ్వనాథ్ చేసిన సేవలు ఎనలేనివి. ఆయన చివరి శ్వాస వరకు కళామతల్లికి సేవలందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన కన్నుమూశారు. తాజాగా మరో సినీ దిగ్గజాన్ని టాలీవుడ్ కోల్పోయింది. దాదాపు 932 సినిమాల్లో నటించిన మరో కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో ఓకే ఏడాదిలో రెండు సినీ దిగ్గజాలను కోల్పోవడాన్ని తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కె. విశ్వనాథ్, చంద్రమోహన్ మధ్య రిలేషన్ ఏంటి? అసలు వీరిద్దరికీ ఉన్న బంధుత్వమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం. అదే విధంగా ఎస్పీబాలుకు, వీరిద్దరికి బంధుత్వం ఎలా వచ్చిందో చూద్దాం. (ఇది చదవండి: Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత) కె విశ్వనాథ్‌కి, సీనియర్ నటుడు చంద్రమోహన్‌తోనూ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. శంకరాభరణం చిత్రానికి విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించగా.. చంద్రమోహన్ కీలపాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే సూపర్ హిట్‌గా నిలిచి..జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఎస్పీ బాల సుబ్రమణ్యం పాటలు పాడారు. అయితే కె విశ్వనాథ్ 1966లో ఆత్మ గౌరవం అనే చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయం కాగా.. అదే ఏడాది రంగులరాట్నం చిత్రంతో నటుడిగా చంద్రమోహన్ టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) పెదనాన్న కుమారుడే విశ్వనాథ్! ఇదిలా ఉండగా మా పెదనాన్న కుమారుడే కె.విశ్వనాథ్ అని చంద్రమోహన్ చెప్పారు. తన అన్నయ్య విశ్వనాథ్ చనిపోయినప్పుడు పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. చంద్రమోహన్ పెదనాన్న రెండో భార్య కొడుకు కె.విశ్వనాథ్ కాగా.. చంద్రమోహన్ తల్లి, కె.విశ్వనాథ్ తండ్రి మొదటి భార్య అక్కా చెల్లెల్లు కావడంతో వీరద్దరు అన్నదమ్ములు అవుతారు. వీరిద్దరి కాంబినేషన్లో సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, సీతకథ చిత్రాలు వచ్చాయి. నాలో ఉన్న ప్రతిభను బయటికి తీసి అద్భుతమైన నటుడిగా తీర్చిదిద్దింది ఆయనేనని చంద్రమోహన్ గతంలో వెల్లడించారు. గతంలో కె. విశ్వనాథ్ గురించి చంద్రమోహన్ మాట్లాడుతూ..'సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ బాంధవ్యమే ఎక్కువ. అందరికంటే నేను ఆయనకు చాలా దగ్గరివాడిని. మద్రాసులో ఉన్నప్పుడు ఒకేచోట స్థలం కొనుకున్నాం. పక్క పక్కనే ఇళ్లు కూడా కట్టుకుని 25 ఏళ్ల ఉన్నాం. అంతటి అనుబంధం మాది' అని అన్నారు. ఎస్పీ బాలుతోనూ బంధుత్వం సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యంతోనూ వీరిద్దరి బంధుత్వం ఉంది. చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అలా వీరి మధ్య కూడా అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా అనుకోకుండా ముగ్గురికి కుటుంబాల పరంగా మంచి అనుబంధం ఉంది. చివరికీ వరుసకు ముగ్గురు అన్నదమ్ములు కావడం మరో విశేషం. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన శంకరాభరణం సినిమా ఇండస్ట్రీలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ పాట నేను పాడింది కానీ… ఎస్పీ బాలు గారు నన్ను..!
-
మహోజ్వల భారతి: పుణ్యభూమి నా దేశం నమో నమామి
ఆజాదీ ఉద్వేగస్వరం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. బాలూ ఆలపించిన దేశభక్తి గీతాల్లో.. ‘పుణ్యభూమి నాదేశం నమో నమామి’, ‘జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరియసి..’.. ప్రతి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల నాడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మార్మోగిపోతుంటాయి. బాలూ జీవించి ఉంటే ఇప్పుడీ ఆజాదీ ఉత్సవాలకు ఆయన గళం అమృతోత్సవ స్వర వర్ణాలను అద్ది ఉండేది. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆ రెండు పాటల పల్లవులు, చరణాల్లోని కొన్ని భాగాలు. పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహా మహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం.. నా దేశం ..! ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రం (1993) లోని ఈ పాటకు సాహిత్యం జాలాది. సంగీతం ఎం.ఎం. కీరవాణి. సాహిత్యంలోని దేశభక్తి భావోద్వేగాలన్నిటినీ సంగీతానికి తగ్గట్లుగా ఒడలు పులకించేలా ఎప్సీ తన గళంలో పలికించారు. అదుగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి / అడుగొ అరి భయంకరుడు కట్ట బ్రహ్మన / అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన / వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి / అజాదు హిందు ఫౌజు దళపతీ నేతాజీ / అఖండ భరత జాతి కన్న మరో శివాజీ.. అని ఎస్పీ పాడుతున్నప్పుడు ఆనాటి సమరయోధులంతా కనుల ముందు సాక్షాత్కరించినట్లే ఉంటుంది. జనని జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరియసి / ఏ తల్లి నిను కన్నదో / ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా నీ తల్లి మోసేది నవమాసలేరా / ఈ తల్లి మోయాలి కడవరకురా.. కట్టే కాలేవరకురా ఆ రుణం తలకొరివితో తీరెనురా / ఈ రుణం ఏ రుపానా తీరేదిరా / ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా.. అనే ఈ దేశభక్తి గీతం ‘బొబ్బిలిపులి’ చిత్రం (1982) లోనిది. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం జె.వి.రాఘవులు. పాడింది ఎస్పీబీ. ఈ గీతంలో ఆయన ధీర గంభీర స్వరం.. శతఘ్నిలా ప్రతిధ్వనించి ప్రతి జవాను హృదయం ఉప్పెంగేలా చేస్తుంది. ఎస్పీబీ వ్యక్తిగతంగా కూడా బాధ్యత గల దేశ పౌరుడిగా ఉండేవారు. కరోనా సమయంలో ప్రజల్లో భయాందోళనలు పోగొట్టి వారికి ధైర్యం చెప్పడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశమంతటా ఒక ఐక్యతా కార్యక్రమంగా దీపాలు వెలిగించి, పళ్లేలు మోగించాలని చెప్పినప్పుడు ఎస్పీబీ తు.చ. తప్పకుండా ఆ సూచనను పాటించారు. అంతేకాదు, యువతరాన్ని అందుకు మోటివేట్ చేశారు కూడా! -
ఎస్పీ బాలు గాత్రమందించిన 'కర్మయోగి' చిత్రం పాటలు విడుదల
Karmayogi Movie Songs Sung By Late Sp Balu: తల్లిదండ్రుల గొప్పతనాన్ని చాటి చెప్పిన శ్రీ ధర్మవ్యాధుడు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కర్మ యోగి శ్రీ ధర్మవ్యాధుడి చరిత్ర’. జీజే రాజా దర్శకత్వంలో విజయ్ భాస్కర్, అనుషా, అశోక్ కుమార్, ఆనంద్ భారతి, వి. మురళీధర్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ఇది. భోగికార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో ఉల్కందే కార్ మురళీధర్ నిర్మించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలను ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ సినిమా పాటలను హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జేసీ చంద్రయ్య, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణమోహన్, దైవజ్ఞ శర్మ ఆవిష్కరించారు. ‘‘తల్లిదండ్రులకు సేవ చేయడంలోనే మానవ సేవ దాగి ఉంది. మానవ సమాజం గురించి మనలోని అజ్ఞానాన్ని తెలియజేసే ఈ సినిమా తీసిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని కృష్ణమోహన్, జేసీ చంద్రయ్య అన్నారు. ‘‘ధర్మవ్యాధుడి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలని తీసిన చిత్రం ఇది’’ అన్నారు జీజే రాజా. ‘‘ఈ సినిమాను రామానాయుడుగారు తీయాల్సింది. కానీ ఆయన పరమపదించారు. కథ నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాను పూర్తి చేయడానికి మూడేళ్లు పట్టింది’’ అన్నారు మురళీధర్. ఈ చిత్రానికి లక్ష్మణ సాయి సంగీతమందించారు. -
లతాజీ పక్కన ఆ ఫీట్ ఒక్క బాలు వల్లే సాధ్యమైంది
‘మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై..’(గాత్రమే నా గుర్తింపు) లతా మంగేష్కర్ ఓ గొప్ప గాయని. ఆ గొప్పను ఆమె అస్సలు ఒప్పుకోరు. కానీ, ఆమె ఒక పర్ఫెక్షనిస్ట్. ఈ విషయం మాత్రం ఆమె కూడా ఒప్పుకుని తీరతారు. ఎందుకంటే.. ఒక పాట బాగా రావడానికి ఆమె ఎన్నిసార్లైనా సాధన చేస్తారట. వయసులో ఉన్నప్పుడు పాత తరం ఆర్టిస్టుల గొంతుకు తగ్గట్లే కాదు.. 60వ వడిలో మాధురి, కాజోల్ లాంటి యంగ్ ఆర్టిస్టులకూ ఆమె గాత్రం సూటయ్యేలా సాధన చేసేవారామే. రంగ్ దే బసంతిలో ‘లుకా చుప్పి’ పాట కోసం.. నాలుగు రోజులు సాధన చేశారంటే ఆమె డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి పర్ఫెక్షనిస్ట్ నుంచి మెప్పు పొందడం అంటే.. మాటలా? దిలీప్ కుమార్ ఒకసారి ఆమె పాడే విధానం మీద కామెంట్ చేశారు. దీంతో కొత్తల్లో ఆమె ఉర్దూ టీచర్‌ను పెట్టుకొని మరీ హిందీ పాటలు పాడింది. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా.. తనకు తానే హిందీ నేర్చుకుని తర్వాతెప్పుడో ఆమెతో గొంతు కలిపాడు. ఇద్దరూ ఉచ్ఛారణ విషయంలో తిరుగులేని నిబద్ధులు. మొండివాళ్లే. దక్షిణాది గాయకుల్లో ఎంతో మంది ఆమె పక్కన పాడినా.. సక్సెస్‌తోపాటు ఆమెతో ‘వాహ్.. శెభాష్’ అనిపించుకున్న ఏకైక సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే. లతా, బాలూల మధ్య ఒక పోలిక ఉంది. లతా భాషలో మరాఠీ స్వభావం ఉందని సంగీత దర్శకుడు నౌషాద్ ప్రోత్సహాంతో ఆమె ఉర్దూ నేర్చుకున్నారు. అలాగే తమిళం బాగా నేర్చుకుంటేనే పాడే అవకాశం ఇస్తానని బాలూను సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఆదేశించారు. ఇద్దరూ ఆ భాషలను నేర్చుకున్నారు. పాటలో ఉచ్ఛారణకు పట్టం కట్టారు. ఒకరు గానగాంధర్వుడు.. మరొకరు గాన కోకిల.. వీళ్ల కాంబినేషన్ సూపర్‌హిట్. దేశమంతా పాడుకునే పాటలను వారు కలిసి పాడారు. లతా మంగేష్కర్ పక్కన గోల్డెన్ పిరియడ్‌లో రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నా డే వంటి ఉద్దండులు ఆలపించారు. కానీ, బాలు పక్కన పాడేప్పుడు మాత్రం ఆమె ఫుల్ ఎనర్జీ, జోష్‌తో పాడడం గమనించొచ్చు. తెలుగులో హిట్ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్ హిందీలో ‘ఏక్ దూజే కే లియే’ (1981)గా రీమేక్ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా పీక్‌లో ఉన్న లక్ష్మీకాంత్–ప్యారేలాల్‌లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్ కోరారు. దీనికి లతా మంగేష్కర్ అభ్యంతరం చెప్పలేదు కానీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కొంత నసిగారట. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్. ఇక లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌లకు తప్పలేదు. ఎప్పుడైతే బాలు పాట విన్నారో.. ‘ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి’ అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు లక్ష్మీకాంత్ ప్యారేలాల్. గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు.. అది గాత్రానికే ప్రమాదం అని తెలిసి లతాజీ చాలా కంగారు పడటం, ‘వద్దు నాన్నా..’ అంటూ ఆమె వారించడం గురించి స్వయంగా బాలూనే పలు సందర్భాల్లో చెప్పడం చూశాం. అంతేకాదు.. హైదరాబాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలూ ఆహ్వానం మీద లతా హైదరాబాద్ వచ్చారు. ‘ఏక్ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్ మే’ పాట డ్యూయెట్గా, బాలూ వెర్షన్‌గా వినపడని చోటు లేదు. ‘హమ్ బనే తుమ్ బనే’, ‘హమ్ తుమ్ దోనో జబ్ మిల్ జాయేంగే’... ఈ పాటలన్నీ పెద్ద హిట్. ఈ సినిమాకు బాలూకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత రమేష్ సిప్పీ తీసిన ‘సాగర్’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్ ‘మైనే ప్యార్ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్‌కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్‌లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్‌గా నిలిచింది. యూత్ మెచ్చిన పాటలు.. కాలేజీ కుర్రకారు వీటి కోసం ఫిదా అయిపోయారు. ‘దిల్ దీవానా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’, ‘కబూతర్ జాజాజా’ లక్షలాది కేసెట్లు అమ్ముడుపోయాయి. ‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ఆజా షామ్ హోనే ఆయీ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్ దివానా’ పాట షామియానాలు, పెళ్లి మంటపాల్లో ఇష్టపాటగా మారింది. అందులోని ‘మౌసమ్ కా జాదు హై మిత్వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’... ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్‌గా నిలిపాయి. ‘హమ్ ఆప్ కే హై కౌన్’ రికార్డింగ్ సమయంలో వీళ్ల అల్లరి మామూలుగా ఉండేది కాదట. హమ్ ఆప్ కే హై కౌన్ అని లతా నోటి నుంచి రాగానే.. తర్వాతి లైన్ పాడకుండా ‘మై ఆప్ కా బేటా హూ’ అని బాలు అల్లరి చేసేవాడట. ఆమె పాడటం ఆపేసి– ‘‘చూడండి.. బాలూ నన్ను పాడనివ్వడం లేదు’’ అని ముద్దుగా కోప్పడేవారట. ఆ చనువుతోతో ఏమో ఆమె.. ఆ ముద్దుల కొడుకుని బాలాజీ అని పిలుచుకునేవారు. ఆ మధ్య లతా చనిపోయారనే పుకార్లు వచ్చినప్పుడు.. వాటిని ఖండిస్తూ బాలూ స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ఆమె త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆశించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన మరణవార్తను ముందుగా లతా వినాల్సి వచ్చింది. ‘ఆయన ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హఠాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా అనే కుతూహలం ఉంటుంది. ఒక విరుపో, నవ్వో, గమకమో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్‌లలో లైవ్ కన్సర్ట్లలో పాల్గొన్నాను. స్టేజ్ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఈ పుకారు నిజమని తేలింది’.. బాలూ మరణవార్త విని లతాజీ స్పందన. ఆమె తెలుగులో మొదట ‘నిదురపోరా తమ్ముడా’ (సంతానం) పాడినా.. అందులో రెండవ చరణం ఘంటసాల అందుకున్నా అవి విడి విడి రికార్డింగులే తప్ప కలిసి పాడిన పాట కాదు. దక్షిణాది నుంచి ఏసుదాస్‌తో లతా కొన్ని పాటలు పాడినా అవి ప్రత్యేక గుర్తింపు పొందలేదు. కానీ బాలూ అదృష్టం వేరు. తెలుగులో ‘ఆఖరి పోరాటం’ కోసం లతా ‘తెల్లచీరకు తకథిమి’ పాట పాడినప్పుడు బాలూయే ఆమెకు భాష నేర్పించారు. తమిళంలో కూడా వీరు కమలహాసన్ ‘సత్య’ (1988) సినిమాకు ‘వలయోసై’ అనే హిట్ డ్యూయెట్ పాడారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ల అభిమానులకు మిగిలిన మధుర జ్ఞాపకాలు. – సాక్షి ఫ్యామిలీ, వెబ్ డెస్క్ -
వైరల్: అభిమానిని సర్ప్రైజ్ చేసిన బాలు
సాక్షి, చెన్నై: నాలుగు దశాబ్దాలకు పైగా సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం దివికేగారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలు కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. దేశంలోని ప్రతి ఇంటికి ఆయన పేరు సుపరిచితం. విదేశాల్లో ఉన్న అభిమానుల కోసం ఆయన ఎన్నో కచేరీలు చేసి అలరించారు. ప్రాంతమేదైనా తన వద్దకు వచ్చే అభిమానులను ప్రేమతో పలకరించడం ఆయన ప్రత్యేకత. అనుకోని అతిథిగా వెళ్లి కొన్నిసార్లు వారిని సంభ్రమాశ్చర్యంలోనూ ముంచెత్తుతారు. రేవతి అనే ట్విటర్ యూజర్ తాజాగా షేర్ చేసిన ఓ వీడియో బాలు స్వచ్ఛమైన మనసుని కళ్లకు కడుతోంది. ఆ వీడియోప్రకారం.. శ్రీలంకలో జరిగిన ఓ పేలుడు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన వ్యక్తి కంటి చూపు కోల్పోయారు. దాదాపు ఆరు మాసాలు ఆస్పత్రికే పరిమితమైన సమయంలో ఎస్పీబీ పాటలే తనకు సాంత్వన నిచ్చాయని, బాలుకు తాను వీరాభిమానిని అని అతను ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. బాలు దైవంతో సమానమని, ఆయన్ని ఒక్కసారి కలుసుకుంటే జన్మ ధన్యమవుతుందని ఆకాక్షించారు. ఈ నేపథ్యంలో అతని ఫ్రెండ్స్ కొందరు బాలుకి విషయం చెప్పడంతో.. ఆయన కలిసేందుకు సరేనన్నారు. బాలు పాడిన తమిళపాటను ఆ అభిమాని హమ్ చేస్తున్న సమయంలో ఆయన వెళ్లి గొంతు కలిపారు. నా గొంతు కూడా బాలు గొంతులాగే ఉంటుందని బాలు కాసేపు ఆట పట్టించారు. తర్వాత.. ‘నా పేరు బాలు. ఎస్పీ బాలు. నేను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం’ అని చెప్పడంతో.. ఆ అభిమాని ఒకింత ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోయారు. ఊహించని ఘటనతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ‘నిన్ను కలుసుకునేందుకే వచ్చాను’అని బాలు చెప్పారు. (చదవండి: బాలు మృతికి సంతాపంగా నయన్ భావోద్వేగం) -
ఆ వార్త ఎంతగానో కుంగదీసింది: అలీ
సాక్షి, హైదరాబాద్: దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై సినీనటుడు అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అలీ కన్నీటిపర్యంతమయ్యారు. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. ఎస్పీబీ మరణం నన్ను ఎంతగానో కుంగదీసింది. కుటుంబ పెద్దను కోల్పోయా. ఆయన లేని లోటు పూడ్చలేనిది. బాలు ఎందరికో స్పూర్తిగా నిలిచారు. ఎన్నో భాషల్లో వేలకొద్ది పాటలు పడే అవకాశం ఎస్పీబీకే దక్కింది. నేను బాబాయ్ అని పిలిచేవాడిని. నన్ను కన్నకొడుకులా ఆదరించారు. చరణ్‌తో సమానంగా నన్ను చూసుకునేవారు. బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని పేర్కొన్నారు. కాగా, అనారోగ్యానికి గురైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ప్రాణాలు విడిచారు. చెన్నైలోని తమరాయిపక్కంలోని బాలు ఫామ్‌హౌజ్‌లో ఆయన అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. బాలు అంత్యక్రియలను తమిళనాడు సర్కార్ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనుంది. (చదవండి: బాలు నటించిన సినిమాలు) -
ఈ ఏడాది మరీ ఇంత దారుణమా: అశ్విన్
చెన్నై: భారతదేశం గర్వించదగ్గ అతికొద్ది మంది గాయకుల్లో ఒకరైన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడంపై పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అటు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు పలువురు క్రికెటర్లు కూడా సంతాపం తెలుపుతున్నారు. తన సుమధుర గాత్రంతో ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్న ఎస్పీ బాలు ఇక లేరనే వార్తపై క్రికెటర్ రైనా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు.‘ ఒక దిగ్గజ గాయకుడ్ని కోల్పోవడం బాధాకరం. ఈ వార్త విని తీవ్రంగా కలత చెందా. మీ గాత్రం రాబోవు తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ఇదే నా సంతాపం. ఓం శాంతి’ అని రైనా ట్వీట్ ద్వారా సంతాపం తెలిపాడు. ఇక మరో భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన ట్వీట్లో ఎస్పీ బాలుకి సంతాపం తెలుపుతూ.. ‘ ఈ ఏడాది మరీ ఇంత దారుణంగా ఉంది. రోజు రోజుకీ ఇంతలా దిగజారిపోతోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు చేకూరాలని ప్రార్థిద్దాం’ అని ట్వీట్ చేశాడు. నిన్న గురువారం ఆసీస్ దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత డీన్ జోన్స్ గుండె పోటుకు గురై కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ కామెంటరీ వ్యవహారాల్లో భాగంగా ముంబైలో ఉన్న డీన్‌జోన్స్ హఠాన్మరణం పొందారు. ఈ రోజు ఎస్పీ బాలు కన్నుమూయడంతో ఈ ఏడాది చోటుచేసుకున్న పరిస్థితులపై కలత చెందుతూ ట్వీట్ చేశాడు.(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత) చాలా బాధాకరం: వాషింగ్టన్ సుందర్ బాలు సార్ లేరనే వార్త వినడం చాలా బాధాకరం. మీ గాత్రం, మీ పాటలు మాతో ఎప్పుడూ ఉంటాయి. వచ్చే తరానికి కూడా మీ పాటలు స్ఫూర్తిగా నిలుస్తాయి. మేము మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం మీ పాటలతో మీరు మాతోనే: ధావన్ మీ పాటలు ఎప్పుడూ మాతోనే ఉంటాయి. పాటల రూపంలో మీరు మాతోనే ఉంటారు. ఆయనకు నా ప్రగాఢ సానుభూతి. మీరు లేని లోటు పూడ్చలేనిది: ప్రజ్ఞాన్ ఓజా బాలు గారు లేరనే వార్త నన్ను షాక్ గురి చేసింది. మీరు లేని లోటు పూడ్చలేనిది. మీరు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోవడం పెద్ద లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. పీడకల వెంటాడుతోంది: రవిశాస్త్రి పీడకల వెంటాడుతూనే ఉంది. ఈరోజు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం లేరన వార్తను వినడం బాధనిపించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయను సంగీతాన్ని ప్రేమిస్తే.. సంగీతం అతన్ని ప్రేమించింది. ఓం శాంతి. Omg!! This year just gets worse by the day! #SPBalasubramaniam #RIP — Ashwin 🇮🇳 (@ashwinravi99) September 25, 2020 Saddened to hear the demise of such a legendary singer #SPBalasubramanyam. Your voice will be an inspiration for the generations to come. Condolences to friends & family. Om Shanti🙏 #RIPSPBalasubramanyam pic.twitter.com/weNqCthlZe — Suresh Raina🇮🇳 (@ImRaina) September 25, 2020 -
‘ఏ వార్త వినకూడదు అనుకున్నామో.. ’
సాక్షి, హైదరాబాద్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాల మృతిపై మెగస్టార్ చిరంజీవి స్పందించారు. బాలు మరణవార్త కలిచివేసిందని చెప్పారు. సాక్షి టీవితో చిరంజీవి మాట్లాడుతూ.. ‘ప్రపంచ సంగీత చరిత్రలో ఇదొక చీకటి రోజు. బాలు మృతితో ఒక శకం ముగిసిపోయింది. ఎస్పీ బాలు నాకు అన్నయ్య లాంటి వారు. నా విజయాల్లో బాలు పాత్ర ఎంతో ఉంది. సొంత కుటుంబసభ్యుడ్ని కోల్పోయినంత బాధగా ఉంది’అని చిరంజీవి పేర్కొన్నారు. బాలు కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. (చదవండి: బాలు మృతిపై ప్రధాని దిగ్భ్రాంతి) ‘బాలుగారి విషయంలో ఏ వార్త వినకూడదనుకున్నామో ఆ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆయన్ని కోల్పోవడం చాలా దురదృష్ణకరం. ఎంతో బాధగా ఉంది. గుండె తరుక్కుపోతోంది. ఇలాంటి లెజెండరీ పర్సర్‌ని మళ్లీ చూడగలమా. ఘంటసాల గారి తర్వాత అంతటి గాయకుడు మళ్లీ బాలునే. బాలు స్థాయిని భర్తీ చేయాలంటూ ఆయనే పునర్జన్మ ఎత్తాలి. నాకెరీర్‌లో నా విజయంలో ఆయనకు సింహభాగం ఇవ్వాలి. నా సాంగ్స్ అంత పాపులర్ కావడానికి కారణం అవి పాడిన బాలునే. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. బాలు తను పాడిన పాటల ద్వారా ప్రతిరోజు మన గుండెల్లో ఉంటారు. మన హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిఉంటారు. అమర్ రహే.. బాలు అమర్ రహే..’ అంటూ చిరు ట్విటర్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్పీ బాలు మృతిపట్ల సీనియర్ నటుడు మోహన్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలు మృతి చాలా బాధాకరమైన విషయమని అన్నారు. సాక్షి టీవీతో మోహన్‌బాబు మాట్లాడారు. బాలు మరణవార్త చీకటి కమ్మినట్టు అయిపోయిందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం ప్రకటించారు. పాటల దిగ్గజం ఎస్పీ బాలు మరణంపై ఆయన స్నేహితులు నాగదేవి ప్రసాద్ స్పందించారు. ఎస్పీ బాలు లేక పోవడం బాధాకరమని అన్నారు. బాలు మరణం ప్రపంచానికే తీరని లోటు అని వ్యాఖ్యానించారు. (చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత) ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వివిధ భాషల్లో ఆయన 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారని గుర్తు చేశారు. ‘బాలు గారి మరణం యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’అని బాలయ్య పేర్కొన్నారు. -
బాలు మృతిపై ప్రధాని దిగ్భ్రాంతి
సాక్షి, చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అకాల మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలు కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు అస్తమయం దేశ సంగీత రంగానికి తీరని లోటు. గొప్ప సుమధుర గాయకున్ని దేశం కోల్పోయింది’ అని రాష్ట్రపతి ట్విటర్లో పేర్కొన్నారు. బాలుని పాటల జాబిల్లిగా అభిమానులు కీర్తిస్తారని గుర్తు చేశారు. పాటల ప్రపంచానికి బాలు సేవలకుగాను పద్మ భూషణ్, జాతీయ అవార్డులు, మరెన్నో పురస్కారాలు వరించాయని తెలిపారు. (చదవండి: ఒక శకం ముగిసింది!) దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు మృతి దురదృష్టకర సంఘటన అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. బాలు మరణంతో దేశ సాంస్కృతిక రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని అన్నారు. బాలు సుమధుర గొంతుక యావత్ భారతంలోని ప్రతి ఇంటికి సుపరిచితమని ప్రధాని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా పాటల ప్రపంచానికి సేవ చేసిన బాలు కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని గుర్తు చేశారు. ‘ఈ విషాద సమయంలో బాలు కుటుంబ సభ్యులకు, శేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అని మోదీ ట్వీట్ చేశారు. బాలు మరణం దేశ సంగీత రంగానికి తీరని లోటు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా, అనారోగ్యానికి గురైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ప్రాణాలు విడిచారు. (చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత) -
‘అప్పదాసు’గా ఎప్పటికి జీవించి ఉంటావు..
(వెబ్‌స్పెషల్): గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణించారు. ఎన్నో ఆపాత మధురాలను గానం చేసిన ఆ మృదుమధుర స్వరం మూగబోయింది. తన అమృత గానంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన గాత్రం ఇక ఎన్నటికి వినపడదు అనే విషయం అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. దేశంలో అత్యధిక భాషల్లో పాటలు పాడి బాల సుబ్రహ్మణ్యం కాదు భారత సుబ్రహ్మణ్యంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన కేవలం గాయకుడిగానే కాక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 1969లో వచ్చిన ‘పెళ్ళంటే నూరేళ్ళ పంట’ అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు బాలు.ఈ నేపథ్యంలో ఆయన నటించిన చిత్రాల్లో కొన్నింటిని ఓ సారి చూడండి.. ఓ పాప లాలీ 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడిగా నటించాడు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ అనే పేరుతో అనువాదం అయింది. భార్యను కోల్పోయి.. చేతిలో ఓ బిడ్డతో మిగిలిన తండ్రి పాత్ర పోషించారు బాలు ఈ చిత్రంలో. అనంతరం రాధికతో ప్రేమలో పడటం.. కుమార్తె వారి బంధాన్ని అంగీకరించకపోవడం.. తను పడే సంఘర్షణ చాలా బాగా నటించారు బాలు. ఇక ఈ సినిమాలో మాటే రాని చిన్నదాని పాట ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. (చదవండి: ఒక శకం ముగిసింది!) ప్రేమ 1989లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్, రేవతి ప్రధాన పాత్రధారులు కాగా ఈ చిత్రంలో బాలు సత్యారావుగా కీలక పాత్రలో నటించారు. ప్రేమికుడు ప్రేమికుడు 1994 లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఒక తమిళ అనువాద చిత్రం. కాదలన్ దీనికి మూలం. ఇందులో ప్రభుదేవా, నగ్మా ప్రధాన పాత్రధారులు. ఇక ఈ చిత్రంలో బాలు హీరో తండ్రి పాత్రలో నటించారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో బాలు అందమైన ప్రేమ రాణి పాటలో ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. పవిత్రబంధం 1996లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్, సౌందర్య హీరోయిన్లు కాగా.. హీరో తండ్రి పాత్రలో బాలు నటించారు. విదేశాల్లో చదివి.. అదే అలవాట్లను స్వదేశంలో పాటించే కొడుకును మార్చడానికి తాపత్రయపడే తండ్రి పాత్రలో జీవించారు బాలు. ఆరో ప్రాణం 1997లో విడుదలైన ఈ చిత్రంలో వినీత్, సౌందర్య, బాలసుబ్రమణ్యం ప్రధాన పాత్రలు పోషించారు. తనకంటే ఏడాది పెద్దదయిన యువతిని ప్రేమించిన అబ్బాయి తండ్రిగా కీలక పాత్ర పోషించారు బాలు. (చదవండి: బాలు మామ కన్నీరాగడం లేదు) రక్షకుడు 1997 వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున, సుస్మితా సేన్ ఇందులో ప్రధాన పాత్రధారులు. దీనిలో బాలు, నాగార్జున తండ్రి పాత్ర పోషించారు. నిరుద్యోగి, కోపిష్టి అయిన కుమారుడి తండ్రి పాత్రలో నటించారు బాలు. దీర్ఘసుమంగళీ భవ 1998లో వచ్చిన ఈ చిత్రంలో దాసరి, రాజశేఖర్, రమ్యకృష్ణ, ప్రేమ, బాలు ప్రధాన పాత్రలు పోషించారు. గ్లామర్ ఫీల్డు మీద మోజుతో ఇంటి నుంచి వెళ్లిన యువతి.. చివరికి తప్పు తెలుసుకుని వస్తే ఆదరించరు. ఆ సమయంలో ఆమెకు సాయం చేసే పాత్రలో బాలు కనిపిస్తారు. నిడివి తక్కువే కానీ.. ప్రాధాన్యం ఉన్న పాత్ర. మిథునం మిథునం 2012 లో విడుదలైన తెలుగు చిత్రం. సుప్రసిద్ద తెలుగు రచయిత శ్రీ రమణ దాదాపు పాతిక సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల మిథునం కథకు తనికెళ్ళ భరణి అందించిన చిత్రరూపమే ఈ చిత్రం. ఉత్తమ విదేశీ భాషా చిత్రంలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన చిత్రం. కేవలం రెండే పాత్రలతో సినిమా మొత్తం నడుస్తుంది. అప్పదాసు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) విశ్రాంత ఉపాధ్యాయుడు. అర్ధాంగి బుచ్చి (లక్ష్మి) తో కలిసి స్వగ్రామంలో నివసిస్తుంటాడు. పిల్లలందరూ విదేశాలలో స్థిరపడటం వలన దంపతులిద్దరూ మాత్రమే శేషజీవితాన్ని గడపాల్సి వస్తుంది. అయితే వారు తమ శేషజీవితాన్ని విచారంగా గాక ఎంత రమణీయంగా...రసమయంగా మలుచుకుని ఓ మధురానుభూతిగా మిగిల్చారన్నదే స్థూలంగా కథ. ఇక అప్పరాజు పాత్రలో బాలు జీవించారు. ఆ పాత్రలో ఆయనను తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేం. ఇవే కాక ఇంకా పక్కింటి అమ్మాయి, వివాహ భోజనంబు, మైనా, కళ్లు, చెన్నపట్నం చిన్నోడు, ఊయల, పెళ్లాడి చూపిస్తా, మెరుపు కలలు, గొప్పింటి అల్లుడు, మనసు పడ్డాను కానీ, చిరంజీవులు, ఇంద్ర, మాయా బజార్, దేవస్థానం లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. చివరిసారిగా దేవదాస్ చిత్రంలో నటించారు బాలు. -
‘అది అదృష్టంగా భావిస్తున్నా’
సాక్షి, అమరావతి: గానగంధర్వులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం (ఎస్పీ బాలు) అకాల మరణంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ప్రపంచం గర్వించే అరుదైన గాయకులు ఇలా దూరమవడం తనను తీవ్రంగా కలచివేసిందని భావోద్వేగానికి గురయ్యారు. ‘పాటే తపమని..పాటే జపమని.. పాటే వరమని.. పాటకోసమే పుట్టిన మహానుభావులు ఎస్పీ బాలుగారి లోటు మరే గాయకులు పూడ్చలేనిది’ అని మంత్రి గద్గద స్వరంతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలచందర్ గారి దర్శకత్వంలో కోకిలమ్మ చిత్రంలోని బాలు పాడిన ‘నేనున్నది మీలోనే.. ఆ నేను మీరేలే.. నాదన్నది ఏమున్నది నాలో’ పాటను మంత్రి గుర్తు చేసుకున్నారు. ‘ఊహ తెలిసినప్పుడు.. ఊహల్లో తేలినపుడు.. ఊయలూగినపుడు.. ఊగిసలాడినపుడు బాలుగారి పాటలే వినిపించేంతటి అమరగాయకులు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పుట్టడం ఆ జిల్లాకు చెందినవాడిగా అదృష్టంగా భావిస్తున్నట్టు మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. 'సింహపురి'లో జన్మించిన గాయకులు..ప్రపంచం గర్వించదగ్గ గాన గంధర్వులు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. (చదవండి: ఎస్పీ బాలు కన్నుమూత) చివరి శ్వాస వరకూ తను పాటిన ప్రతిపాటకు ప్రాణం పోశారని మంత్రి పేర్కొన్నారు. ఏడ్చినా..నవ్వినా..నీరసపడినా..ఉత్సాహం నిండినా..స్ఫూర్తి పొందినా..ప్రశ్నించినా ప్రతి ఒక్క సందర్భానికీ ఆయన పాట ఒకటుంటుందన్నారు. ప్రతీ నాయకుడికి, ప్రతినాయకుడికి, కథానాయకుడికి ఆయన వినూత్నరీతిలో..సరికొత్త ప్రయోగాలతో స్వరాన్ని అందించడం..నటించినవారే పాడినట్లుగా పాడడం మరెవరికీ సాధ్యం కాదని మంత్రి గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మాటాడినా.. పాటాడినా తెలుగు భాషే సంతోషపడేలా తెలుగుజాతి సగర్వంగా చెప్పుకునేలా చేసిన, 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడిన బాలసుబ్రమణ్యంగారు భౌతికంగా దూరమైనా 'పాట'లో మనతో మనలోనే శాశ్వతంగా ఉంటారని మంత్రి మేకపాటి తెలిపారు. -
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
సాక్షి, చెన్నై : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కన్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేటర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తాడనుకున్న అభిమానులను శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు బాలు వెళ్లిపోయారు. బాలు 1.04 నిమిషాలకు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్ మీడియా ముందు స్వయంగా ధృవీకరించారు. ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందడం పట్ల దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు ఆయనకు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు. ఇంజనీర్ కాబోయి సింగర్ అయ్యారు ఎస్పీ బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మ పేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతుల రెండో సంతానం. ఇంజనీర్ కావాలని కలలు కని గాయకుడయ్యారు. సావిత్రిని వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు పిల్లలు చరణ్, పల్లవి ఉన్నారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1966) చిత్రంలోతొలిసారి పాట పాడారు. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా 'ఏక్ దుజే కేలియే' లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. నాలుగు దశాబ్దాలకు పైగా సాగినసినీ ప్రస్థానంలో నలభై వేల పైచిలుకు పాటలు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు. తమ్ముడి మీద ప్రేమతో నిర్మాతగా మారిన బాలు తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలోనూ ఆయన పాడిన పాటకు ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి. తమ్ముడు కమల్ హాసన్‌కు చేతిలో సినిమాలు లేని సమయంలో ఆయన మీదున్న ప్రేమతో బాలు నిర్మాతగా మారారు. అలా తీసిని 'శుభ సంకల్పం' ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, జెమిని గణేషన్ వంటి పలువురు హీరోలకు గాత్రదానం కూడా చేశారు. గాన మాధుర్యంతోనే కాదు, నటనతోనూ బాలు ప్రేక్షకులను కట్టిపడేశారు. 1969లో పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారి నటుడిగా కనిపించారు. తమిళ 'కేలడి కన్మణి'లో కథానాయకుడి పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ పేరుతో అనువాదం అయింది. తర్వాత పవిత్ర బంధం, దేవుళ్లు, దేవదాస్, మిథునం వంటి పలు సినిమాల్లోనూ నటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అత్యంత విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్యం
-
బాలు ఆరోగ్యం విషమం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లిపోయారని, ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారిందనే వార్త సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం బాలు ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో బాలు గత నెల 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చేరారు. ‘నా ఆరోగ్యం బాగానే ఉంది. ఎవరూ కంగారుపడాల్సిన అవసరంలేదు. పరామర్శించడానికి ఫోన్లు చేయొద్దని విన్నవించుకుంటున్నాను’అని ఫేస్బుక్ ద్వారా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అప్పటినుంచి ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. గత నెల 23న బాలు ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ ద్వారా ఎక్మో చికిత్స అందిస్తున్నారు. అనంతరం కరోనా నుంచి కోలుకున్నారు. ఆస్పత్రిలో ఉంటూ బాలు పాటలు వింటున్నారని, కొంచెం హుషారుగానే ఉన్నారని చరణ్ పేర్కొనడంతో త్వరలో డిశ్చార్జ్ అవుతారని అందరూ ఆశించారు. అయితే గురువారం అనుకోని విధంగా ఆయన ఆరోగ్యం విషమించిందని వైద్యబృందం పేర్కొనడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్ గురువారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లారు. బాలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోనే కరోనా సోకిందా? వాస్తవానికి స్వల్ప జ్వరం, చిన్న చిన్న అసౌకర్యాలతో బాలు ఆస్పత్రికి వెళ్లారు. అప్పుడు కరోనా అని నిర్ధారణ అయింది. లాక్డౌన్ సమయంలో చెన్నైలో ఇంటిపట్టునే ఉంటున్న బాలూకి కరోనా సోకింది మాత్రం హైదరాబాద్‌లోనే అని తెలుస్తోంది. ఓ ప్రముఖ ప్రైవేట్ చానల్ ఆహ్వానం మేరకు ఆయన ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొడానికి హైదరాబాద్ వచ్చారు. అప్పుడే ఆయన కరోనా బారిన పడ్డారని సమాచారం. అదే కార్యక్రమంలో పాల్గొన్న పలువురు గాయనీగాయకులకు కూడా కరోనా సోకినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు లాక్డౌన్లో కరోనాపై అవగాహన కలిగించేందుకు తమిళ రచయిత వైరముత్తు రాసిన పాటను బాలు స్వరపరచి స్వయంగా పాడారు. ఇది బాగా వైరల్ అయింది. -
పెళ్లిరోజును జరుపుకున్న ఎస్పీ బాలు దంపతులు
సాక్షి, చెన్నై : కోవిడ్-19తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన 51వ వార్షికోత్సవాన్ని ఆసుపత్రిలో జరుపుకున్నట్లు సమాచారం. వైద్యుల సమక్షంలో, అన్ని జాగ్రత్తల నడుమ బాలు దంపతులు శనివారం సాయంత్రం పెళ్లిరోజును జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్పీ బాలు సతీమణి సావిత్రి ఆసుపత్రికి వెళ్లారని, ఐసీయూలోనే దంపతులు కేక్ కట్ చేసినట్లు అక్కడి తమిళ మీడియా కొన్ని ప్రకటనలు విడుదల చేసింది. దీంతో ఈ పోస్టులు వైరల్‌గా మారాయి. డాక్టర్లు, ఐసీయూ సిబ్బంది నడుమ బాలు 51వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్లు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిని ఆసుపత్రి వర్గాలు కానీ, బాలు కుమారుడు ఎస్పీ చరణ్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. (వైద్యం, ఫిజియోథెరపీకి స్పందిస్తున్నారు: ఎంజీఎం) కరోనా సోకడంతో ఎస్పీ బాలు ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తొలుత ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ మధ్యలో కాస్త విషమించింది. దాంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. బాలు ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేస్తూ వచ్చాయి. అలాగే, ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సైతం వీడియో సందేశాల ద్వారా సమాచారం అందిస్తున్నారు. గత వీడియోలో దేవుని ఆశీర్వాదంతో సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని చరణ్ ప్రకటించాడు. దీంతో ఎస్పీ బాలు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని, సోమవారం డిశ్చార్జి కాబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. (వచ్చే సోమవారం శుభవార్త వింటాం: ఎస్పీ చరణ్) -
ఎస్పీ బాలు ఆరోగ్యం మరింత మెరుగు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తన తండ్రి ఆరోగ్యం మరింత మెరుగుపడిందని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ శనివారం తన వీడియో సందేశంలో తెలిపారు. కరోనా వైరస్‌కు గురైన ఎస్పీ బాలు ఈనెల 5వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఊపిరితిత్తులు కూడా మెరుగుపడినట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా చేస్తున్న ఫిజియోథెరపీకి కూడా ఆయన శరీరం సహకరిస్తున్నట్లు సమాచారం. కాగా, ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు శనివారం బులెటిన్ విడుదల చేయలేదు. -
బాలు పాట హైలైట్
అమిత్, ఇందు, సుమన్, హరిత ముఖ్య తారలుగా శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చీమ–ప్రేమ.. మధ్యలో భామ’. చీమ ప్రధాన పాత్రలో కనిపించే ఈ చిత్రాన్ని మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్‌పై లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘ఈగ’ సినిమా మాకు స్ఫూర్తి. చీమ పాత్రని అపురూపంగా మలచిన తీరుకు అద్దం పట్టేలా ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు టైటిల్ సాంగ్‌ని అద్భుతంగా ఆలపించారు. రవివర్మగారి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాట పదికాలాలు అందర్నీ అలరిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘నా పేరు నరసింహ.. ఇంటి పేరు నరసింహ...’, ‘నేనాటో వాణ్ని ఆటోవాణ్ని..’, ‘దేవుడ దేవుడ తిరుమల దేవుడా..’... ఇవి రజనీకాంత్ సినిమాల్లో ఇంట్రడక్షన్ సాంగ్స్ అని మనందరికీ తెలుసు. ఈ పాటలన్నీ పాడింది ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. రజనీ–బాలు కాంబినేషన్ సూపర్ హిట్. అయితే ఇటీవల రిలీజ్ అయిన రజనీకాంత్ సినిమాల్లో ఎస్పీబీ టైటిల్ ట్రాక్ ఏదీ పాడలేదు. రజనీ సినిమాలు కూడా ఇదివరకటి స్థాయిలో ఆడలేదు. ఆ సంగతలా ఉంచితే రజనీ–బాలుల హిట్ కాంబినేషన్‌ని రిపీట్ చేయనున్నారట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ ఓ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. అందులోని టైటిల్ సాంగ్‌ను ఎస్పీబీతో పాడించారట చిత్రసంగీత దర్శకుడు అనిరు«ద్. సూపర్ హిట్ సెంటిమెంట్ రిపీట్ చేశారు. సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని రజనీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సన్ నెట్వర్క్ నిర్మిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
కేణిలో ఆ ఇద్దరి పాట.. నిజంగా విశేషమే!
సాక్షి, చెన్నై: గానగంధర్వులు కేజే.ఏసుదాస్, ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడితే అది నిజంగా విశేషమే అవుతుంది. అలా 25 ఏళ్ల ముందు ఈ గాన తపస్విలు కలిసి ఆలపించారు. ఆ తరువాత సంగీత కచేరిలో ఒకే వేదికపై పాడి ఉండవచ్చుగానీ, సినిమా కోసం కలిసి పాడిన సందర్భం లేదు. అలాంటి అరుదైన సంఘటన కేణి చిత్రం కోసం జరిగింది. తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒకే పాటను కేజే.ఏసుదాస్, ఎస్పీ.బాలు కలిసి పాడారు. మలయాళ దర్శకుడు నిషాద్ తొలిసారిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఇందులో సీనియర్ నటి జయప్రద, సుహాసిని, రేవతి, నటుడు పార్థిబన్, నాజర్, నటి అనుహాసన్, రేఖ ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్రగ్రాంట్ నేచర్ ఫిలిం క్రియేషన్స్ పతాకంపై ఆన్ సజీవ్, సజీవ్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్రహోటల్‌లో జరిగింది. నటి సుహాసిని చిత్ర ఆడియోను ఆవిష్కరించగా నటి జయప్రద, పార్థిబన్ తొలి ప్రతిని అందుకున్నారు. జయప్రద మాట్లాడుతూ.. తమిళంలో వరసగా నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకు ముందు నినైత్తాలే ఇనిక్కుమ్, సలంగై ఒళి, ఏళైజాతి, దశావతారం వంటి చిత్రాల వరుసలో ఇప్పుడు కేణి వంటి మంచి చిత్రాల్లో నటించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో తాను ఇందిర అనే సామాజిక బాధ్యత కలిగిని పాత్రలో నటించానని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందాలని అందరం చెబుతుంటామన్నారు. అయితే అలాంటి సమాజాన్ని స్త్రీలే సాధించుకోవాలని చెప్పే చిత్రంగా కేణి చిత్రం ఉంటుందని తెలిపారు. అదే విధంగా మంచి నీళ్లు అన్నవి తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు సంబంధించిన విషయం కాదన్నారు. నీరు అన్నది ప్రపంచ సమస్య అని, అలాంటి సమస్యను కథలో చేర్చిన దర్శకుడిని అభినందిస్తున్నానన్నారు. తాను ఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నా, తమిళంలోనూ నటించాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. దర్శకుడు నిషాద్ మాట్లాడుతూ.. మలయాళంలో కిణరు తనకు ఏడవ చిత్రం అయినా, తమిళంలో కేణి తొలి చిత్రం అని తెలిపారు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం సామాజిక ఇతివృత్తంతో కూడి ఉంటుందన్నారు. నీళ్లు ఈ భూమిపై జీవించే ప్రాణులందరికి చెందుతాయన్నారు. అలాంటిది మానవులు మాత్రమే సొంతం చేసుకోవాలనుకుంటున్నారని అన్నారు. ఎండ, వాన లాంటివి ప్రకృతి ప్రసాదించినవని కరువుకు మాత్రం మనిషే కారణం అవుతున్నాడని అన్నారు. ఈ విషయాలను ఆవిష్కరించే చిత్రంగా కేణి ఉంటుందని దర్శకుడు తెలిపారు. -
ఎస్పీ బాలుకు సెంటినరీ అవార్డు
న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరో పురస్కారం అందుకోనున్నారు. చలన చిత్ర రంగంలో విశేష కృషి చేసినందుకు జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. గోవాలో జరుగనున్న 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్(ఐఎఫ్ఎఫ్ఐ-2016)లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సెంటినరీ అవార్డు ప్రదానం చేయనున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మంగళవారమిక్కడ తెలిపారు. గత అయిదు దశాబ్దాలుగా తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ, మలయాళం చలన చిత్ర పరిశ్రమలకు ఎస్పీ బాలు తన గాత్ర మాధుర్యంతో ఎనలేని సేవలు అందించారని ఆయన ప్రశంసించారు. ఎస్పీ బాలు వివిధ భాషల్లో సుమారు 40వేలకుపైగా పాటలు పడి సంగీతాభిమానులను అలరించారన్నారు. కాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరుసార్లు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన సేవలకుగాను పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు వరించాయి. 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్..ఈ నెల 20 నుంచి 28 వరకూ గోవాలో జరుగనున్నాయి. -
సంగీతానికి భావమే ప్రధానం
విశాఖ–కల్చరల్ : సంగీతంపై మధురమైన అనుభూతిని పొందగలిగే కోణంలో తొంగి చూస్తే అన్నీ ప్రక్రియల్లోను రసరమ్యమైన రాగాలతో కూడిన సంగీతమాధుర్యాన్ని పొందవచ్చని సంగీత గానగాంధర్వ పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొనియాడారు. శాంతా–వంతా ట్రస్ట్(హైదరాబాద్ నేతత్వంలో విశాఖ పౌరగ్రంథాలయంలో శుక్రవారం ప్రముఖ వ్యాఖ్యాత, రాంభట్ల నసింహశర్మ రచించిన‘కావ్య గాంధర్వం’అనే సాహిత్య సంగీత గ్రంథాన్ని శాంతా బయోటెక్స్ అధినేత పద్మభూషణ్ కేఈ వరప్రసాద్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ గ్రంథాన్ని బాలసుబ్రహ్మణ్యంకు అంకితం చేస్తూ తొలిప్రతిని ఆయనకు అందజేశారు. సాహితీ రత్నాకర డాక్టర్ డి.వి.సూర్యారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ఆవిష్కరణ సభకు బాలు ముఖ్యఅతిథిగా హాజరై మధురమైన సంగీత సరిగమలను గురించి వివరించారు. ప్రతి అక్షరంలోనూ భావాన్ని వ్యక్తపరిచే సంగీతాన్ని అందించాలని, అదికూడా సాహిత్యంతో కూడిన రాగయుక్తమైనదిగా ఉండాలని ఆకాంక్షించారు. సంగీతమంటే ఇష్టపడని ప్రాణి లేదన్నారు. శతసంగీతావధాని డాక్టర్ మీగడ రామలింగస్వామి కావ్య గ్రంథాన్ని తనదైన శైలిలో సవివరంగా సమీక్షించారు. సప్తస్వరాలను మీటే సంగీత సామ్రాజ్యాన్ని ఈ గ్రంథంలో రాయడం బాగుందని ప్రశంసించారు. సంగీతం, సాహిత్యమే కాకుండా, పద్యాలు, సంగీత ఉపనిషత్తులు, రాగాల పంక్తులు, తెలుగు భాష సంస్కతి వంటి ఉపశీర్షిలతో పరిశోధన గ్రంథంగా రాయడం అభిందననీయమన్నారు. వీటితోపాటు సంగీత విద్వాంసులైన మంగళంపల్లి బాలమురళీకష్ణ సంగీత విశిష్టతను ఈ గ్రంథంలో విశ్లేషించడం అభినందనీయమన్నారు. తొలుత రాంభట్ల బాలసుబ్రహ్మణ్య భారతీచరణ్ సభా నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టారు. బాలు జన్మదిన వేడుకలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినవేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంభట్ల పౌరగ్రంథాలయానికి 70 గ్రంథాలను ఉచితంగా అందజేశారు. రాంభట్ల స్వరకల్పనలో జన్మదిన గీతాన్ని గాయనీమణులు విన్పించారు. తర్వాత సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ఎ. ప్రసన్నకుమార్ బాలుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జ్ఞాపికను అందజేశారు. తర్వాత నసింహశర్మ, రామలింగస్వామి, వరప్రసాద్‌రెడ్డిలు ఎస్పీ బాలును ఘనంగా సత్కరించారు. నగరంలోని అన్నీ కళలలో రాణిస్తూ విద్య, వైద్య, కళాత్మక రంగాల్లో మేధావులైన కొందరి ప్రముఖులకు కావ్య గాంధర్యం గ్రంథాన్ని ఎస్పీ బాలు ప్రజాస్పందన అధ్యక్షుడు సి.ఎస్.రావు, నాగార్జున యూనివర్శిటీ విశ్రాంతి ఉపకులపతి ఆచార్య. వి. బాలమోహన్‌దాస్, సినీ నటుడు వంకాయల సత్యనారాయణ తదితర ప్రముఖులకు అందజేశారు. పుస్తక ఆవిష్కరణ సభలో నగరానికి చెందిన సంగీత, సాహితీ ప్రియులు తదితరులు హాజరయ్యారు. -
వండర్ బుక్ రికార్డ్స్‌లో ఎస్పీ బాలుకు చోటు
హిమాయత్‌నగర్ (హైదరాబాద్) : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు లండన్‌కు చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆ సంస్థ దక్షిణ భారత ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇన్చార్జి స్వర్ణశ్రీ తదితరులు మంగళవారం బాలుకు ఆయన కార్యాలయంలో రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎస్పీ బాలు మాట్లాడుతూ... 18 భాషల్లో 35వేల పాటలు పాడిన తనకు అనేక అవార్డులు వచ్చాయన్నారు. లండన్‌కు సంబంధించిన సంస్థ తనను గుర్తించిన విషయం మరిచిపోలేనని చెప్పారు. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : కోరస్ (రమణగోగుల): తరరేరా రరిరా తరారరిరా (2) తరరేరా రరిరా తరరేర రా రా రారా (2) తరరేరరే రారా రారారే తారరారిరా అతడు: మనసే ఎదురు తిరిగి మాట వినదే ఆమె: కలిసే ఆశ కలిగి కునుకు పడదే అ: మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు ఆ: తుది లేని ఊహలకు నీ స్నేహమే అదుపు అ: ప్రణయానికే మన జంటనే పద కొత్త మైమరపు చరణం : 1 అ: కలలో మొదటి పరిచయం గురుతు వుందా ఆ: సరిలే చెలిమి పరిమళ ం చెరుగుతుందా అ: చెలివైన చెంగలువా కలలోనే ఈ కొలువా ఆ: చెలిమైన వెన్నెలవా నిజమైన నా కలవా అ: నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా చరణం : 2 అ: చినుకై కురిసినది కదా చిలిపి సరదా ఆ: అలలై ఎగసినది కదా వలపు వరద అ: మనసే తడిసి తడిసి అలగా కరిగిపోదా ఆ: తలపే మెరిసి మెరిసి తగు దారి కనపడదా అ: వెతికే జతే కలిసి వయసు మరి ఆగనంది కదా చిత్రం : ప్రేమంటే ఇదేరా (1998) రచన : సిరివెన్నెల సంగీతం : రమణగోగుల గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర