Karmayogi Movie Songs Sung By Late Sp Balu: తల్లిదండ్రుల గొప్పతనాన్ని చాటి చెప్పిన శ్రీ ధర్మవ్యాధుడు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కర్మ యోగి శ్రీ ధర్మవ్యాధుడి చరిత్ర’. జీజే రాజా దర్శకత్వంలో విజయ్ భాస్కర్, అనుషా, అశోక్ కుమార్, ఆనంద్ భారతి, వి. మురళీధర్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ఇది. భోగికార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో ఉల్కందే కార్ మురళీధర్ నిర్మించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలను ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ సినిమా పాటలను హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జేసీ చంద్రయ్య, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణమోహన్, దైవజ్ఞ శర్మ ఆవిష్కరించారు.
‘‘తల్లిదండ్రులకు సేవ చేయడంలోనే మానవ సేవ దాగి ఉంది. మానవ సమాజం గురించి మనలోని అజ్ఞానాన్ని తెలియజేసే ఈ సినిమా తీసిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని కృష్ణమోహన్, జేసీ చంద్రయ్య అన్నారు. ‘‘ధర్మవ్యాధుడి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలని తీసిన చిత్రం ఇది’’ అన్నారు జీజే రాజా. ‘‘ఈ సినిమాను రామానాయుడుగారు తీయాల్సింది. కానీ ఆయన పరమపదించారు. కథ నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాను పూర్తి చేయడానికి మూడేళ్లు పట్టింది’’ అన్నారు మురళీధర్. ఈ చిత్రానికి లక్ష్మణ సాయి సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment