'అవును.. మా పెళ్లయింది నిజమే..' | 'Let the Goodenough jokes begin': Preity Zinta confirms her marriage | Sakshi
Sakshi News home page

'అవును.. మా పెళ్లయింది నిజమే..'

Published Sun, Mar 6 2016 3:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'అవును.. మా పెళ్లయింది నిజమే..' - Sakshi

'అవును.. మా పెళ్లయింది నిజమే..'

ముంబయి: ఎట్టకేలకు అందరి సందేహాలకు తెరపడింది. తన పెళ్లయినట్లు బాలీవుడ్ నటి, పలు తెలుగు సినిమాల్లోనూ నటించిన ప్రీతిజింటా స్పష్టం చేసింది. ఆమె తన భర్త ఫొటోను కూడా సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఈ మంగళవారం కబీర్‌బేడీ ట్వీట్‌తో ప్రీతి పెళ్లి అయినట్లు అందరికీ తెలిసింది. కానీ, స్వయంగా ఆమె ఈ విషయం ముందు చెప్పలేదు.

దీంతో అది నిజమా కాదా అని అందరూ సందేహంలో పడ్డారు. కానీ, ఈ సొట్ట బుగ్గల చిన్నది తాజాగా తన భర్త ఫొటోను పోస్ట్ చేసి తెరదించింది. ఆమె బ్యూ జీనే గూడెనఫ్ అనే అమెరికన్ను వివాహం చేసుకుంది. ఈ వివాహం లాస్ ఎంజెల్స్లో జరిగినట్లు తెలిపింది. ప్రీతీకి జీనే స్నేహితుడు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement