Preity Zinta Marriage
-
'అవును.. మా పెళ్లయింది నిజమే..'
ముంబయి: ఎట్టకేలకు అందరి సందేహాలకు తెరపడింది. తన పెళ్లయినట్లు బాలీవుడ్ నటి, పలు తెలుగు సినిమాల్లోనూ నటించిన ప్రీతిజింటా స్పష్టం చేసింది. ఆమె తన భర్త ఫొటోను కూడా సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఈ మంగళవారం కబీర్‌బేడీ ట్వీట్‌తో ప్రీతి పెళ్లి అయినట్లు అందరికీ తెలిసింది. కానీ, స్వయంగా ఆమె ఈ విషయం ముందు చెప్పలేదు. దీంతో అది నిజమా కాదా అని అందరూ సందేహంలో పడ్డారు. కానీ, ఈ సొట్ట బుగ్గల చిన్నది తాజాగా తన భర్త ఫొటోను పోస్ట్ చేసి తెరదించింది. ఆమె బ్యూ జీనే గూడెనఫ్ అనే అమెరికన్‌ను వివాహం చేసుకుంది. ఈ వివాహం లాస్ ఎంజెల్స్‌లో జరిగినట్లు తెలిపింది. ప్రీతీకి జీనే స్నేహితుడు కూడా. -
ప్రీతీ జింటాకి పెళ్లయింది!
తెలుగులో ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజకుమారుడు’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నాయిక ప్రీతీ జింటా తన స్నేహితుడు జీన్ గుడ్ఇనఫ్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. లాస్ ఏంజెల్స్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్ళి జరిగింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రముఖులు కబీర్ బేడీ, సుస్మితా సేన్, ఫరాఖాన్ ట్విటర్లో ప్రకటించారు. పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలు మీడియాలో వచ్చినా ఇటీవలి దాకా ప్రీతి ఖండించారు. కాగా మంగళవారం కబీర్‌బేడీ ట్వీట్‌తో ప్రీతి పెళ్లి సంగతి అందరికీ తెలిసింది. -
జనవరి 31 ప్రీతి పెళ్లి?
నలభై ఏళ్ల బాలివుడ్ నటి, మోడల్ ప్రీతీజింతా పెళ్లి చేసుకోబోతున్నారా? ఆమె చేసుకోబోతున్నది అమెరికాలోని ఆమె బాయ్‌ఫ్రెండ్ జీన్ గుడెనఫ్ నేనా? ఇటీవల ప్రీతి తరచు అమెరికా వెళ్లొస్తున్నది అతడి కోసమేనా?... ఇవన్నీ పాత ప్రశ్నలు. మరి కొత్త ప్రశ్నలు ఏమిటి? ఏమీ లేవు. కొత్త విషయం మాత్రం ఉంది. ప్రీతి వచ్చే జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నారట. అదీ జనవరి 31న. ఆ డేట్‌కి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉంది. అది ప్రీతి బర్త్ డే. ప్రీతి పెళ్లి సంగతి దాదాపుగా కన్ఫామ్ అయింది కానీ... ఆమె చేసుకోబోతున్నది సేమ్ ఓల్డ్ అమెరికన్ బాయ్ ఫ్రెండ్ నేనా అన్నది ఇంకా నిర్థారణ కాలేదు. అయితే ప్రీతి ఈ పెళ్లి డేట్లు, మంత్లపై ట్విట్టర్లో నెత్తీ నోరు మొత్తుకున్నారు. ‘నేనేం జనవరిలో పెళ్లి చేసుకోవడం లేదు. మీకు ప్రామిస్ చేసి చెబుతున్నా... చేసుకునే ముందు మీకు చెప్పే చేసుకుంటా’ అని అసహనంగా ట్వీట్ చేశారు. ‘జనవరిలో కాదా... అయితే ఈ డిసెంబరులో చేసుకుంటున్నారన్నమాట... థ్యాంక్స్’ అని వెంటనే ఓ ట్వీట్ వచ్చింది. దానిపై ట్విట్టర్లోనే ప్రీతి ‘గుర్రరర్..’ మన్నారు.