ప్రీతీ జింటాకి పెళ్లయింది!
తెలుగులో ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజకుమారుడు’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నాయిక ప్రీతీ జింటా తన స్నేహితుడు జీన్ గుడ్‌ఇనఫ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. లాస్ ఏంజెల్స్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్ళి జరిగింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రముఖులు కబీర్ బేడీ, సుస్మితా సేన్, ఫరాఖాన్ ట్విటర్‌లో ప్రకటించారు. పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలు మీడియాలో వచ్చినా ఇటీవలి దాకా ప్రీతి ఖండించారు. కాగా మంగళవారం కబీర్‌బేడీ ట్వీట్‌తో ప్రీతి పెళ్లి సంగతి అందరికీ తెలిసింది.