ప్రీతి రిసెప్షన్లో బాలీవుడ్ తారా లోకం | Preity Zinta, Gene Goodenough Wedding Reception | Sakshi
Sakshi News home page

ప్రీతి రిసెప్షన్లో బాలీవుడ్ తారా లోకం

Published Sat, May 14 2016 10:35 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

ప్రీతి రిసెప్షన్లో బాలీవుడ్ తారా లోకం

ప్రీతి రిసెప్షన్లో బాలీవుడ్ తారా లోకం

రెండు నెలల క్రితం లాస్ ఏంజిల్స్లో తన బాయ్ ఫ్రెండ్ జెనీ గుడ్ఎనఫ్ను పెళ్లాడిన సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా, బాలీవుడ్ సెలబ్రిటీల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన పెళ్లి వేడుక తరువాత తన భర్తతో కలిసి ఇటీవలే ముంబై చేరుకుంది ప్రీతి. ఈ సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్ని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫారూక్ ఖాన్, షాహిద్ కపూర్, యువరాజ్ సింగ్, లారాదత్త, డినో మోరియా, అభిషేక్ బచ్చన్, మాధురి దీక్షిత్, జూహీచావ్లా, ఫరాఖాన్, మహేష్ భూపతి, మాధవన్, కరణ్ జోహర్ లాంటి ప్రముఖుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కొద్ది రోజులుగా పెళ్లి వార్తలతో సందడి చేస్తున్న బాలీవుడ్ లాంగ్ టైం బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ తన గర్ల్ ఫ్రెండ్ లులియా తో కలిసి రావటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement