breaking news
Jim Sarbh
-
రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?
ఏ సినిమా అయినా సరే హీరోయిజం పండాలంటే అందుకు ఎదురుగా ఉన్న పాత్ర కూడా అంతే పండాలి. ఇప్పుడు థియేటర్లలోకి వచ్చిన 'కుబేర' విషయంలోనూ ఇదే జరిగినట్లు అనిపిస్తుంది. ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna Akkineni) లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ తనదైన విలనిజంతో నటుడు జిమ్ షర్బ్ ఆకట్టుకున్నాడు. ఇదే ఇతడికి తొలి సినిమా అయినా సరే.. విలనిజంతో అదరగొట్టేశాడని చెప్పొచ్చు. ఇంతకీ ఇతడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?ముంబైకి చెందిన జిమ్ షర్బ్ సీనియర్ నటుడేం కాదు. ఇతడి వయసు జస్ట్ 37 ఏళ్లే. తండ్రి ఉద్యోగం వల్ల చిన్నప్పుడే విదేశాలు తిరిగిన జిమ్.. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ సైకాలజీ చేశాడు. తర్వాత 2014లో హిందీలో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తొలి మూవీ షురురత్ కి ఇంటర్వెల్ ఫ్లాప్. దీంతో రెండేళ్లు వెయిటింగ్ తప్పలేదు. 2016లో వచ్చిన 'నీర్జా' ఇతడి కెరీర్‌ని మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి. అలా కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: 'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?)బాలీవుడ్లో పద్మావత్, సంజు సినిమాల్లో ఇతడు విలనిజంతో ఆకట్టుకున్నాడు. అలా శేఖర్ కమ్ముల దృష్టిలో పడ్డాడు. 'కుబేర'లో అవకాశం దక్కించుకున్నాడు. స్వతహాగా హిందీ నటుడు అయినప్పటికీ.. డబ్బింగ్‌కి సరిపోయేలా యాక్టింగ్ చేయగలిగాడు. సినిమాలో ఇతడి నటనకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. మూవీ చివర్లో ఇతడి పాత్ర కూడా బిచ్చగాడిగా కనిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.అలా తెలుగులో 'కుబేర' సినిమాతో తొలి ప్రయత్నంలో ఆకట్టుకున్న జిమ్.. త్వరలో మరిన్ని తెలుగు చిత్రాల్లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. తెలుగులో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ విలనిజం చూసి చూసి జనాలకు మొనాటనీ వచ్చేసింది. ఇలాంటి టైంలో జిమ్‌కి అవకాశాలు వస్తే టాలీవుడ్లో కొత్త విలన్ పుట్టుకొచ్చినట్లే.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?) -
'టెర్రరిస్టు'తో హీరోయిన్ డేటింగ్!
ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయి కొన్ని నెలలుగా నటి కల్కి కొచ్లిన్ దూరంగా ఉంటోంది. అయితే ఆమె ఇటీవల ఓ కొత్త వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. కల్కి డేటింగ్ గురించి బాలీవుడ్ కోడై కూస్తోంది. అయితే టెర్రిరిస్టుతో డేటింగ్ చేయడమేంటని కంగారు పడకండి. ఆ వివరాలపై ఓ లుక్కేద్దామా మరి. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ కల్కి చాలా ఫాస్ట్. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిండంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ 'నీర్జా'. ఈ సినిమాలో కరడుగట్టిన టెర్రరిస్టుగా జిమ్ సరభ్ కనిపిస్తాడు. పాక్ టెర్రరిస్టుగా నటించిన జిమ్, ఎయిర్ హోస్టెస్ నీరజా బానోతు(సోనమ్ కపూర్)తో పాటు విమాన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తాడు జిమ్. జిమ్, కల్కి గత కొంత కాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. రిలేషన్ పై వారిద్దరూ కాస్త సీరియస్ గా కనిపిస్తున్నారన్న వార్త స్థానిక మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుండటంతో వీరి డేటింగ్ విషయం గుప్పుమంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా 2009లో వచ్చిన 'డేవ్.డి'తో బెస్ట్ సపోర్టింగ్ నటిగా అవార్డు అందుకున్న కల్కి ఆ తరువాత మరిన్ని మూవీల్లో నటనకుగానూ ఎన్నో అవార్డులు సాధించింది. అయితే రియల్ స్టోరీ 'నీర్జా' మూవీతో పేరు తెచ్చుకున్న జిమ్ అప్పుడే మంచి స్టార్ నటితో డేటింగ్ మొదలెట్టడంతో వీరి రిలేషన్ పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.