ఎన్.ఆర్..ఐ.తో డేటింగ్?
సినీ తారలు ప్రేమలో పడటం, విడిపోవడం చాలా కామన్. పాతతరం నుంచి కొత్త తరం వరకూ చాలా మంది ప్రేమ మత్తులో తేలిన వాళ్లే. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా మోడలింగ్‌లో అడుగుపెట్టిన తొలి రోజుల్లో అసీమ్ మర్చంట్ అనే వ్యక్తితో, ఆ తర్వాత హీరో అక్షయ్‌కుమార్‌తో ప్రేమ వ్యవహారాలు సాగించారనే వార్తలు వచ్చాయి కూడా. ప్రియాంకా చోప్రా కూడా వీటికి ఫుల్‌స్టాప్ పెట్టి తన కెరీర్ మీద దృష్టి పెట్టడంతో ఆమెకు వరుసగా విజయాలు సాధించారు.
ఇప్పటివరకూ నటించిన 51 చిత్రాలతో ఎంత పేరు సంపాదించుకున్నారో, అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’తో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. తాజాగా ఓ టీవీ షోకి హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం ఆమెకు దక్కింది కూడా. ఒక పక్క ‘బాజీరావ్ మస్తానీ’ షూటింగ్, ఇంకో పక్క ‘క్వాంటికో’ చిత్రీకరణలో బిజీ బిజీగా ఉంటున్న ప్రియాంక ఓ ఎన్నారైతో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. లాస్‌ఏంజెల్స్‌లో ‘క్వాంటికో’ షూటింగ్ గ్యాప్‌లో వీళ్లిద్దరూ కలిసి ఊరంతా చక్కర్లు కొడుతున్నారని మీడియా కోడై కూస్తోంది. ఏది నిజమో?