ఆ భామకు అంత తీరికలేదట! | Priyanka busy her hectic Hollywood schedule | Sakshi
Sakshi News home page

ఆ భామకు అంత తీరికలేదట!

Published Sun, Feb 14 2016 7:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆ భామకు అంత తీరికలేదట! - Sakshi

ఆ భామకు అంత తీరికలేదట!

ముంబై: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వైపు అడుగులు అడుగులు వేసి సక్సెస్ అయిన తార ప్రియాంక చోప్రా. క్వింటాకో సిరీస్ తో ఆమె గత కొన్ని నెలలుగా హాలీవుడ్ లో బిజీబిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో క్వింటాకో టీవీ షో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో 'జై గంగాజల్' మూవీలో నటిస్తోంది. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియాంక ఇందులో పోలీసు అధికారిణిగా, కీలక పాత్రలో కనిపించనుంది. దర్శకుడు ప్రకాశ్ ఝా 15 నిమిషాలు మాత్రమే కథ చెప్పగానే మాజీ ప్రపంచ సుందరి ఈ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.

ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్ లో బిజీ షెడ్యూల్ కారణంగా 'జై గంగాజల్' మూవీ ప్రమోషన్లలో పాల్గోనే అవకాశం ఉన్నట్లు కనపించడం లేదు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేందుకు ఆమె సిద్ధమైంది. అపహరణ్, రాజ్నీతి, అరక్షణ్, సత్యాగ్రహ లాంటి ఎన్నో సమాజ అంశాలు సమస్యలపై మూవీలు తీసిన ప్రకాశ్ ఝా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తొలిసారిగా ఈ మూవీలో కనిపించనున్నారు. నటుడు మనవ్ కౌల్ తో కలిసి ప్రకాశ్ ఝా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ముంబై నగరంలో ప్రచారం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement