Prakash Jha
-
‘ఆ దర్శకుడు తప్పుగా మాట్లాడాడు’
ముంబై : మీటూ ఉద్యమంలో భాగంగా మూవీ సెట్స్‌పై ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న బాలీవుడ్ నటీమణులు తమ అనుభవాలను ధైర్యంగా వెల్లడిస్తున్న క్రమంలో తాజాగా మరో నటి తనకు ఎదురైన అసౌకర్య పరిస్థితిని బహిర్గతం చేశారు. 2016లో లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సెట్లో జరిగిన ఘటనను నటి అహనా కుమ్రా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఈ సినిమా సెట్లో ఓ శృంగార సన్నివేశం తెరకెక్కిస్తుండగా దర్శక, నిర్మాత ప్రకాష్ ఝా సెట్లోకి వచ్చి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు తనకు చాలా అసౌకర్యంగా అనిపించాయని తెలిపారు. దీంతో తాను దర్శకులు అలంక్రిత శ్రీవాస్తవ వద్దకు వెళ్లి ఆయన తనకు దర్శకుడు కాదని, సెట్లో ఎందుకు ఉన్నారని అడిగానని చెప్పారు. ఆయన నుంచి తాను అలాంటి వ్యాఖ్యలు ఎందుకు వినాలని, ఆయన కేవలం నిర్మాతేనని అలంక్రితకు చెప్పినట్టు వెల్లడించారు. ఇక తాను చెప్పిన వెంటనే నిర్మాత ప్రకాష్ ఝాను సెట్ నుంచి వెళ్లాల్సిందిగా అలంక్రిత కోరగా, అప్పుడాయన వెళ్లిపోయాడని తెలిపారు. ఆయన సెట్లో ఉంటే తమకు ఇబ్బందికరమని అర్ధం చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. కాగా, అలంక్రిత శ్రీవాస్తవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2016లో విడుదలైంది. -
పోస్టర్లో మిడిల్ ఫింగర్.. ఎవరికంటే ?
ముంబై : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)తో తమకు ఎలాంటి ఘర్షణలేదని, ఈ సమాజంతోనే అసలు సమస్య అని ఏక్తా కపూర్ అన్నారు. 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా' చిత్ర పోస్టర్లో కనిపించే మిడిల్ ఫింగర్ సీబీఎఫ్‌సీకి కాదని, మహిళలని పైకి ఎదగకుండా అణగదొక్కుతున్న పితృస్వామ్య సమాజానికని తెలిపారు. తమ వాణి వినకుండా గొంతునొక్కే ప్రయత్నం చేస్తూ, మహిళల అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడే భావజాలం ఉన్న వారికే పోస్టర్‌లోని మిడిల్ ఫింగర్ అని కుండబద్దలు కొట్టినట్టు ఏక్తా చెప్పారు. ఈ చిత్రానికి సమర్పకురాలు, డిస్ట్రిబ్యూటర్‌గా ఏక్తా కపూర్ వ్యవహరిస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత ప్రకాష్ ఝా నిర్మించిన లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్ర ట్రైలర్‌ని మంగళవారం ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏక్తా కపూర్‌తో పాటూ దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవ, నటులు కొంకనా సేన్ శర్మ, రత్న పాతక్ షా, అహ్నా కుమ్రా, ప్లబితా బోర్తాకుర్లు పాల్గొన్నారు. లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డ్ నిరాకరించిన విషయం తెలిసిందే. చివరకు 6 నెలల తర్వాత సీబీఎఫ్సీ ఈ చిత్ర ట్రైలర్‌ను ఏ సర్టిఫికెట్తో విడుదలకు అనుమతించింది. స్త్రీల స్వేచ్ఛ ప్రధానాంశంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఓ సామాజిక వర్గాన్ని, వారి వస్త్రధారణను కించపరిచే సీన్లతో పాటు అభ్యంతరకర డైలాగులు కూడా ఉన్నాయన్న కారణంతో సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. సెన్సార్ బోర్డ్ తీరుపై నిర్మాత ప్రకాష్ ఝా, దర్శకురాలు శ్రీవాస్తవలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడిన లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా ను ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ వివాదం పై చిత్రయూనిట్ సెన్సార్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. యూనిట్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన ట్రిబ్యునల్ లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమాకు ఎ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. -
'ఎ' సర్టిఫికేట్‌తో రిలీజ్‌కు అనుమతించండి
ఇటీవల సెన్సార్ బోర్డ్ తీరు తీవ్రంగా వివాదస్పదమవుతోంది. తమ పరిథి దాటి పలు చిత్రాలకు కట్స్ చెప్పటం, కొన్ని సినిమాలకు అసలు సర్టిఫికేట్ జారీ చేయకుండా నిరాకరించడం లాంటి అంశాలతో సెన్సార్ బోర్డ్ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాలు సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొగా మరో సినిమా విషయంలో కూడా ఇదే వివాదం మొదలైంది. ప్రముఖ దర్శక నిర్మాత ప్రకాష్ ఝా నిర్మించిన లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చేందుకు కేంద్ర సెన్సార్ బోర్డ్ నిరాకరించింది. స్త్రీల స్వేచ్ఛ ప్రధానాంశంగా మహిళా దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవ తెరకెక్కించిన ఈ సినిమాలో ఓ సామాజిక వర్గాన్ని, వారి వస్త్రధారణను కించపరిచే సీన్లతో పాటు అభ్యంతరకర డైలాగులు కూడా ఉన్నాయన్న కారణంతో సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. సెన్సార్ బోర్డ్ తీరుపై నిర్మాత ప్రకాష్ ఝా, దర్శకురాలు శ్రీవాస్తవలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడిన లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా ను ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ వివాదం పై చిత్రయూనిట్ సెన్సార్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. యూనిట్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన ట్రిబ్యునల్ లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమాకు ఎ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. -
మరో సినిమాకు సెన్సార్ బోర్డ్ షాక్
ఇటీవల సెన్సార్ బోర్డ్ తీరు తీవ్రంగా వివాదస్పదమవుతోంది. తమ పరిథి దాటి పలు చిత్రాలకు కట్స్ చెప్పటం, కొన్ని సినిమాలకు అసలు సర్టిఫికేట్ జారీ చేయకుండా నిరాకరించడం లాంటి అంశాలతో సెన్సార్ బోర్డ్ వార్తల్లో నిలుస్తోంది. టాలీవుడ్ లో శరణం గచ్ఛామి సినిమా సెన్సార్ సమస్య ఇంకా పరిష్కారం కాకముందే ఓ బాలీవుడ్ సినిమా విషయంలో కూడా ఇదే వివాదం మొదలైంది. ప్రముఖ దర్శక నిర్మాత ప్రకాష్ ఝా నిర్మించిన లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చేందుకు కేంద్ర సెన్సార్ బోర్డ్ నిరాకరించింది. స్త్రీల స్వేచ్ఛ ప్రధానాంశంగా మహిళా దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవ తెరకెక్కించిన ఈ సినిమాలో ఓ సామాజిక వర్గాన్ని, వారి వస్త్రధారణను కించపరిచే సీన్లతో పాటు అభ్యంతరకర డైలాగులు కూడా ఉన్నాయన్న కారణంతో సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. సెన్సార్ బోర్డ్ తీరుపై నిర్మాత ప్రకాష్ ఝా, దర్శకురాలు శ్రీవాస్తవలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడిన లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా ను ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. -
ఆ భామకు అంత తీరికలేదట!
ముంబై: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వైపు అడుగులు అడుగులు వేసి సక్సెస్ అయిన తార ప్రియాంక చోప్రా. క్వింటాకో సిరీస్ తో ఆమె గత కొన్ని నెలలుగా హాలీవుడ్ లో బిజీబిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో క్వింటాకో టీవీ షో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో 'జై గంగాజల్' మూవీలో నటిస్తోంది. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియాంక ఇందులో పోలీసు అధికారిణిగా, కీలక పాత్రలో కనిపించనుంది. దర్శకుడు ప్రకాశ్ ఝా 15 నిమిషాలు మాత్రమే కథ చెప్పగానే మాజీ ప్రపంచ సుందరి ఈ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్ లో బిజీ షెడ్యూల్ కారణంగా 'జై గంగాజల్' మూవీ ప్రమోషన్లలో పాల్గోనే అవకాశం ఉన్నట్లు కనపించడం లేదు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేందుకు ఆమె సిద్ధమైంది. అపహరణ్, రాజ్‌నీతి, అరక్షణ్, సత్యాగ్రహ లాంటి ఎన్నో సమాజ అంశాలు సమస్యలపై మూవీలు తీసిన ప్రకాశ్ ఝా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తొలిసారిగా ఈ మూవీలో కనిపించనున్నారు. నటుడు మనవ్ కౌల్ తో కలిసి ప్రకాశ్ ఝా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ముంబై నగరంలో ప్రచారం చేస్తున్నారు. -
కంగారు పెట్టిన ప్రియాంక!
‘జై గంగాజల్’ షూటింగ్ లొకేషన్ అది. యూనిట్ అంతా కంగారుగా, హడావిడిగా ఉన్నారు. షూటింగ్ అంటేనే కంగారూ, హడావిడీ కామన్. కానీ, ఆ రోజు చిత్రబృందం కంగారుపడటానికి కారణం వేరే ఉంది. చిత్రకథానాయిక ప్రియాంకా చోప్రా నాన్‌స్టాప్‌గా ఏడుస్తున్నారు. అందాల తార ఏడుస్తుంటే ఎవరికి మాత్రం కంగారుగా ఉండదు. ఇంతకీ ప్రియాంక ఎందుకు ఏడ్చారో తెలియాలంటే.. ఈ షూటింగ్ లొకేషన్లో ఏం జరిగిందో చెప్పాలి. ప్రకాశ్ ఝా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ పొరపాటు జరిగింది. విలన్ మానవ్ కౌల్, ప్రియాంకల మధ్య ఫైట్ సీన్ అది. విలన్ ప్రియాంకను కొట్టాక వెంటనే ఆమె తిరిగి కొట్టాలి. ప్రియాంక తన చేతి పవర్ ఏంటో చూపించారు. చెంప మీద కొట్టాల్సిన ప్రియాంక ఆ విలన్ గొంతు మీద కొట్టారు. ఆ పంచ్‌కు అతని గొంతు దగ్గర తీవ్రమైన గాయమై, రక్తం కారడం మొదలైంది. బాధతో విలవిలలాడిన అతన్ని చూసి, ప్రియాంక తట్టుకోలేకపోయారు. ఇప్పుడు తెలిసింది కదా? ప్రియాంక ఎందుకు ఏడుస్తున్నారో? ఆమెను ఓదార్చడం యూనిట్ వల్ల కాలేదట. దీని గురించి మానవ్ కౌల్ మాట్లాడుతూ- ‘‘నాకు అలా రక్తం రాగానే ప్రియాంక భరించలేక ఏడ్వడం స్టార్ట్ చేసింది. నేను ఇట్స్ ఓకే... పర్లేదు అని చెప్పినా ఆమె ఊరుకోలేదు’’ అని పేర్కొన్నారు. -
సినిమాల్లోకి రాకపోయివుంటే..
ముంబై: తాను సినిమాల్లోకి రాకపోయివుంటే కలెక్టర్ కావాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసేవారని బాలీవుడ్ దర్శకుడు ప్రకాశ్ ఝా వెల్లడించారు. గ్రాడ్యుయేట్ కాకూడదన్న ఉద్దేశంతో చదువు మధ్యలో మానేశానని చెప్పారు. 'నిజం చెబుతున్నా. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకూడదన్న ఉద్దేశంతోనే కాలేజీ మానేశా. ఒకవేళ డిగ్రీ పూర్తి చేసివుంటే నాతో సివిల్స్ పరీక్షలు రాయించి కచ్చితంగా నన్ను కలెక్టర్ చేసే వార'ని ప్రకాశ్ ఝా అన్నారు. సినీగీత రచయిత అనంద్ బక్షి కుమారుడు రాకేశ్ రాసిన 'డైరెక్టర్ డైరీస్: ది రోడ్ టూ ఫస్ట్ ఫిలిమ్' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బాలీవుడ్ లోకి తాను ఎలా అడుగుపెట్టిందీ వివరించారు. బిహార్ బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన తాను ఐఏఎస్ కావాలన్న ఉద్దేశంతోనే ఢిల్లీలోని రామజాస్ కాలేజీలో చేరానని చెప్పారు. ఏడాది గడిచాక తన లక్ష్యం మారిందని, దాంతో ముంబైకు వచ్చానని వెల్లడించారు. సినిమాల్లోకి రావడం రిస్క్ తో కూడుకున్నదైనప్పటికీ ఉత్తేజకరంగానూ, ఉత్సాహంగానూ ఉంటుందని చెప్పారు. అపహరణ్, రాజనీతి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా ప్రియంకా చోప్రాతో 'గంగాజల్ 2' తెరకెక్కిస్తున్నారు. -
ఆధునిక గాంధీ కావాలి : ప్రకాశ్ఝా
ముంబై: సమాజంలోని ప్రతి వర్గం అవినీతిమయమైందంటూ విచారం వ్యక్తం చేశాడు బాలీవుడ్ దర్శకుడు ప్రకాశ్ఝా. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఆధునిక గాంధీ అవసరమన్నాడు. అవినీతి, అన్యాయాలపై మధ్యతరగతి పోరాటమే ఇతివృత్తంగా ప్రకాశ్ఝా తాజా చిత్రం ‘సత్యాగ్రహ’ రూపొందింది. గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే వ్యక్తి కథే ఈ సినిమా. ‘మహాత్మా గాంధీనో లేక అన్నాహజారేనో స్ఫూర్తిగా తీసుకుని సత్యాగ్రహ సినిమా తీయలేదు. గాంధీ మహామనీషి. గొప్ప నాయకుడు. దేశానికంతటికీ స్ఫూర్తిప్రదాత. మనదేశానికి ఆధునిక గాంధీ చాలా అవసరం’ అని ఈ సందర్భంగా ప్రకాశ్ ఝా ఓ ఇంటర్య్యూలో పేర్కొన్నాడు. ‘దేశం అవినీతిమయమవడాన్ని చూసి సామాన్యుడు ఆగ్రహించడం లేదు. అవినీతిబాధితుల్లో తాను కూడా ఒకడినైనందుకే బాధపడుతున్నాడు. అలక్ష్యం వల్ల మరణం, పింఛన్ కోసం పోరాటం దేశంలో ప్రస్తుతం సర్వసాధారణమైపోయాయి. వీటిని ప్రేక్షకుల దృష్టికి తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించా. సమాజంలో మార్పు తీసుకురావాలనేది నా కోరిక’ అని చెప్పాడు.గత నెల 30వ తేదీన విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 44.19 కోట్లు వసూలు చేయడంపై ఝా సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణ నన్ను బాగా సంతోషానికి లోనుచేసింది. మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారనే విషయం దీంతో స్పష్టమైంది. గొప్ప గొప్ప సినిమాలు తీస్తానని నేనేనాడూ ప్రకటించలేదు. నా భావాలను అందరికీ తెలియజెప్పేందుకు సినిమాను ఓ మాధ్యమంగా ఎంచుకున్నాను’ అని చెప్పాడు.