కంగారు పెట్టిన ప్రియాంక! | Priyanka Chopra Cried On The Sets Of Jai Gangaajal | Sakshi
Sakshi News home page

కంగారు పెట్టిన ప్రియాంక!

Published Wed, Jan 6 2016 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

కంగారు పెట్టిన ప్రియాంక!

కంగారు పెట్టిన ప్రియాంక!

 ‘జై గంగాజల్’ షూటింగ్ లొకేషన్ అది. యూనిట్ అంతా కంగారుగా, హడావిడిగా ఉన్నారు. షూటింగ్ అంటేనే కంగారూ, హడావిడీ కామన్. కానీ, ఆ రోజు చిత్రబృందం కంగారుపడటానికి కారణం వేరే ఉంది. చిత్రకథానాయిక ప్రియాంకా చోప్రా నాన్‌స్టాప్‌గా ఏడుస్తున్నారు. అందాల తార ఏడుస్తుంటే ఎవరికి మాత్రం కంగారుగా ఉండదు. ఇంతకీ ప్రియాంక ఎందుకు ఏడ్చారో తెలియాలంటే.. ఈ షూటింగ్ లొకేషన్లో ఏం జరిగిందో చెప్పాలి.

ప్రకాశ్ ఝా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ పొరపాటు జరిగింది. విలన్ మానవ్ కౌల్, ప్రియాంకల మధ్య ఫైట్ సీన్ అది. విలన్ ప్రియాంకను కొట్టాక వెంటనే ఆమె తిరిగి కొట్టాలి. ప్రియాంక తన చేతి పవర్ ఏంటో చూపించారు. చెంప మీద కొట్టాల్సిన ప్రియాంక ఆ విలన్ గొంతు మీద కొట్టారు.

 ఆ పంచ్‌కు అతని గొంతు దగ్గర తీవ్రమైన గాయమై, రక్తం కారడం మొదలైంది. బాధతో విలవిలలాడిన అతన్ని చూసి, ప్రియాంక తట్టుకోలేకపోయారు. ఇప్పుడు తెలిసింది కదా? ప్రియాంక ఎందుకు ఏడుస్తున్నారో? ఆమెను ఓదార్చడం యూనిట్ వల్ల కాలేదట. దీని గురించి మానవ్ కౌల్ మాట్లాడుతూ- ‘‘నాకు అలా రక్తం రాగానే ప్రియాంక  భరించలేక ఏడ్వడం స్టార్ట్ చేసింది. నేను ఇట్స్ ఓకే... పర్లేదు అని చెప్పినా ఆమె ఊరుకోలేదు’’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement