'ఆ సీన్ చూస్తూ కళ్ల వెంట నీళ్లొచ్చేశాయి' | 'With Neerja Sonam will establish herself as an actress:Aamir | Sakshi
Sakshi News home page

'ఆ సీన్ చూస్తూ కళ్ల వెంట నీళ్లొచ్చేశాయి'

Feb 16 2016 6:23 PM | Updated on Sep 3 2017 5:46 PM

సోనమ్ కపూర్పై ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె చాలామంచి ప్రతిభ హీరోయిన్ అని, ఆమె నటించిన నీరజా సినిమాతో తానెంటో రుజువుచేసుకుంటుందని చెప్పారు.

ముంబయి: సోనమ్ కపూర్పై బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె చాలా ప్రతిభ గల హీరోయిన్ అని, ఆమె నటించిన నీరజా సినిమాతో తానెంటో రుజువు చేసుకుంటుందని చెప్పారు. మరికొద్ది రోజుల్లో సోనమ్ నటించిన నీరజ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అమీర్ మీడియాకు సోనమ్ గురించి, ఆమె చిత్రం గురించి కొన్ని కబుర్లు చెప్పారు. నీరజా సినిమా ఈ వారంలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సినిమాలో సోనమ్ కపూర్‌కు  షబానా ఆజ్మీ అమ్మగా నటించిందని, ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు.

ముఖ్యంగా సోనమ్ గురించి చెబుతూ ఈ సినిమా చివరి భాగంలో తాను చాలా భావోద్వేగానికి లోనయ్యానని, కళ్ల వెంట నీళ్లు కూడా వచ్చాయని, ఇది గొప్ప సినిమా అవుతుందని అన్నారు. నీరజ సినిమాను పాన్ ఎమ్ 73 విమానాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కరాచీలో హైజాక్ చేసిన సంఘటన ఆధారంగా చిత్రీకరించారు. ఒక మహిళా సిబ్బంది తన ప్రయాణికులను కాపాడుకునేందుకు చూపించిన తెగువ అద్భుతంగా తెరకెక్కించారు.

'ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాం మద్వానీ నాకు మంచి స్నేహితుడు. అతను ఎంతో టాలెంట్ ఉన్న దర్శకుడు. ఈ సినిమా యదార్థంగా జరిగిన సంఘటన. హైజాక్ చేసినప్పుడు ప్రయాణికులను కాపాడిన అమ్మాయి(సోనమ్) నిజంగా చాలా తెలివైనది. ప్రతిఒక్కరికీ ఈ సినిమా స్పూర్తినిస్తుంది' అని అమీర్ అన్నారు. నిజ జీవితంలో తాను కూడా కొన్ని సమయాల్లో  భయానికి లోనవుతుంటానని ఆయన చెప్పారు. ముఖ్యంగా తన కుటుంబం గురించే ఎక్కువ భయంగా ఉంటుందని నా భార్య, పిల్లలు బయటకు వెళ్లినప్పుడు వారు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఆందోళన పడుతుంటానని అమీర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement