గోడలపై తంజోర్ పెయింటింగ్ సేకరణ, మోఘల్ జర్దోసీ కుషన్స్,
ఇత్తడి బల్లలు, వెండి విగ్రహాలు... ప్రాచీన కళతో ఉట్టిపడతాయి.
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇల్లుభారతీయ హస్తకళ, రాచరికపు వారసత్వ కళతో ఆకట్టుకుంటుంది. ముంబైలో ఉన్న ఆమె ఇల్లు తంజోర్ పెయింటింగ్స్, నాగా ప్యానెల్స్, రాజస్థానీ జాలీస్, జర్దోజీ ఎంబ్రాయిడరీలతో.. రాజ సౌధాలకు మించిన అద్భుతంతో అలరారుతుంటుంది. సోనమ్ ఆంటీ ఎడి 100 ఇంటీరియర్ డిజైనర్ కవితా సింగ్ సోనమ్ ఇంటి డిజైనింగ్‌లో పాలుపంచుకుంది.
మనం అత్యంత ఇష్టపడే తారల్లో సోనమ్ కపూర్ ఒకరు. ఆమెకు ఇష్టమైనది మాత్రం భారతీయ వారసత్వ కళ అని ఆమె ఇంటిని చూసిన వారికి ఇట్టే అర్ధం అవుతుంది. ఇంటీరియర్ డిజైనర్ కవితా సింగ్ ఈ హంగులను ప్రస్తావిస్తూ –
‘‘సోనమ్ ఆసక్తిని లోతుగా పరిశోధించడానికి ఆమెతో కలిసి కొంత కాలం ప్రయాణించాను. సెప్టెంబర్ 2021లో ఆమె నాటింగ్ హిల్ పైడ్ – ఎ – టెర్రే, కెన్సింగ్‌టన్ స్టూడియోలు రెండింటినీ చూశాను. వాటి పునరుద్ధరణలో ఆమె ప్రతిభ, కళల పట్ల ఉన్న అవగాహనను చూసి ఆశ్చర్యపోయాను. ఆమె నాతో మాట్లాడుతూ ‘నేను నా భర్త ఆనంద్, కొడుకు వాయుతో పంచుకునే ఈ ఇంటిని ఒక మహిళగా, నిర్వాహకురాలిగా, తల్లిగా నాకు ఓ కొత్త అనుభూతిని అందించాలి‘ అని తెలిపింది. ఈ సందర్భంగా సోనమ్ చెప్పిన విషయాలు కూడా ప్రస్తావించాలి.
ప్రాచీన వస్తువుల సేకరణ
‘సినిమా చిత్రీకరణలో భాగంగా చాలా చోట్లకు వెళుతుంటాం. ఆ విధంగా సంవత్సరాలుగా నేను సేకరించిన అన్ని వస్తువులను అలంకరించడానికి ఒక స్థావరం కోసం ఎంతో కాలంగా ఎదురుచూశాను. భారతదేశం అంతటా మురికి హవేలీలు, పురాతన వస్తువుల దుకాణాలు గుండా తిరిగాను. నేను దేనినైనా ప్రేమిస్తే, అది నా ఇంటికి చేరకుండా ఉండదు. లక్ష్మీ నివాస్ ప్యాలెస్‌లో చిత్రీకరణ సమయంలో దొరికిన విశాలమైన బికనీర్ డ్యూరీని మోసుకొచ్చేశాను’ అని ఆనందంతో వివరిస్తుంది. ఓ వైపు ప్రాచీన చైనీస్ గ్లాస్ పెయింటింగ్‌లు, మరో ప్రపంచంలా అనిపించే పియరీ ప్యారీ వాల్‌పేపర్‌తో రూపొందించిన గదులు, పాదాల క్రింద హృదయాన్ని మెత్తగా హత్తుకుపోయే ఎరుపు, నారింజల రంగుల తివాచీలు మనల్ని అబ్బురపరుస్తాయి.
అమ్మమ్మ ప్రభావం
కపూర్ సౌందర్య అభిరుచులను ్ర΄ోత్సహించింది ఆమె అమ్మమ్మ. ‘మా ఆమ్మమ్మ ఒక సామాన్యమైన మహిళ, కానీ చాలా చురుకుదనంతో ఉంటుంది’ అని గుర్తు చేస్తుకుంటుంది కపూర్. ‘అమ్మమ్మ తన మారుతి సుజుకీలో దాదర్ పూల మార్కెట్‌కు ఉదయం 5 గంటలకు తన ఇంటిని సువాసనలతో నింపడానికి స్పీడ్‌గా వెళ్లేది. శాస్త్రీయ సంగీతం, కళలు, తివాచీలను ఆరాధించేది. కరాచీలో విభజనకు ముందు సింధీ కుటుంబం నుండి వచ్చినందున, మా అమ్మమ్మకి తన అభిరుచులపై మంచి ఆసక్తి ఉంది. నాపై ఆమె ప్రభావాన్ని తగ్గించడం కష్టం’ అంటుంది. ఇలా సోనమ్ ఇష్టాయిష్టాలను కనుక్కుంటూ ఒక్కో వస్తువును అలంకరణలో భాగం చేసుకుంటూ ఆమె ఇంటిని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాం.
Comments
Please login to add a commentAdd a comment