పాక్‌లో ‘నీర్జా’పై నిషేధం | Ban on 'Neerja' in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో ‘నీర్జా’పై నిషేధం

Published Thu, Feb 11 2016 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

Ban on 'Neerja' in Pakistan

కరాచి: కరాచి విమానాశ్రయంలో 1986లో పాన్ ఆమ్ ఫ్లైట్ 73 విమానాన్ని హైజాక్ చేసిన ఘటనను ఆధారంగా చేసుకుని నిర్మించిన బాలీవుడ్ సినిమా ‘నీర్జా’ను పాకిస్తాన్ తమ దేశంలో నిషేధించింది. సోనమ్‌కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో పాక్‌ను చెడుగా చూపించారన్న ఆరోపణతో ఈ సినిమా ప్రదర్శనపై నిషేధం విధిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది.  రామ్ మాధ్వాని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాక్‌లో ఈ నెల 19న విడుదల చేయటానికి ఆ దేశం తొలుత అంగీకరించింది. అయితే పాక్ వ్యతిరేకమైన, ముస్లింల వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయంటూ ఆ దేశ వాణిజ్య, సమాచార మంత్రిత్వశాఖ అనుమతిని ఉపసంహరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement