ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ బాలీవుడ్‌లో 90లలో ఒక సెన్సేషన్. అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రసిద్ధ గాయకులలో ఒకరిగా మెలోడీ క్వీన్‌గా సత్తా చాటుకున్నారు. మెలోడీ, పాప్ ఇలా వివిధ రకాల పాటల్లో రాణించి అభిమానుల మనసు దోచుకున్న సీనియర్-మోస్ట్ గాయని.
అల్కా యాగ్నిక్ 14 ఏళ్ల వయస్సులో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. 90ల నాటి ఆ మెలోడీ క్వీన్ 16కు పైగా భాషల్లో వేల పాటలను రికార్డ్ పాడింది.ఏడు సార్లు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. చోళీ కే పీచే, ఏక్ దో తీన్, మేరీ మెహబూబా, తాల్ సే తాల్, దిల్ నే యే కహా హై దిల్ సే, ఓ రే చోరీ, హమ్ తుమ్, ఘూంగట్ కి ఆద్ సే, కుచ్ కుచ్ లాంటి సూపర్ డూపర్ సాంగ్స ఆమె ఖాతలో ఉన్నాయి. హోతా హై, కహో నా... ప్యార్ హై, సాన్ సాన్ సనా, కభీ అల్విదా నా కెహనా, అగర్ తుమ్ సాథ్ హో ఇలా చెప్పుకుంటూ పోతే...ఈ లిస్ట్ చాలా పెద్దది. ఇంకా టెలివిజన్ రియాలిటీ షోలు, స రే గ మ పా లిటిల్ చాంప్స్, ఇండియన్ ఐడల్, సూపర్ స్టార్ సింగర్, అనేక ఇతర వాటితో పాటు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు.
బాల్యం, ప్రేమ పెళ్లి
1966 మార్చి 20, న కోల్‌కతాలో గుజరాతీ కుటుంబంలో ధర్మేంద్ర శంకర్ శుభ దంపతులకు జన్మించింది అల్కా యాగ్నిక్. తల్లి, భారతీయ శాస్త్రీయ గాయకురాలు శుభా నుంచే అల్కాకు సంగీతం అబ్బింది. ఆల్కాఆరేళ్ల వయసునుంచే ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)లో భక్తి పాటలు, భజనలు పాడటం ప్రారంభించింది. కేవలం 14 సంవత్సరాల వయస్సులో, అల్కా యాగ్నిక్ ‘పాయల్ కి ఝంకార్’ చిత్రంలో తిర్కత్ అంగ్ పాటతో ప్రొఫెషనల్ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.
రైలు ప్రయాణంలో షిల్లాంగ్‌కు చెందిన నీరజ్ కపూర్‌ని 1986లో తొలిసారి కలిసింది. ఢిల్లీలోని అల్కాను, ఆమెతల్లిని స్టేషన్‌లో వారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. (నీరజ్ అల్కా తల్లి స్నేహితురాలి మేనల్లుడు) తొలిచూపులోనే ఇద్దరిలోనూ ప్రేమ పుట్టేసింది. ఆరేళ్లకు మాట కలిసింది. మొదట వీరి పెళ్లికి అల్కా ఇంట్లో ఒప్పుకోకపోయినప్పటికీ, రెండేళ్ల డేటింగ్ చేసిన తర్వాత 1989లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె సాయేషా కపూర్. ఈమె అమిత్ దేశాయ్‌ని వివాహం చేసుకుంది.
అటు బాధ్యతల రీత్యా ఈ జంట ఒకరికొరు దూరంగా ఉండాల్సింది వచ్చింది.. కలిసి ఉండేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. నీరజ్ నిర్ణీత వ్యవధిలో ముంబైకి వెళ్లేవాడు, అల్కా కుటుంబంతో ప్రతీ ఏడాది షిల్లాంగ్‌లో ఒక నెల గడిపేది. అయితే, దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. అల్కా యాగ్నిక్ కెరీర్ కారణంగా, ఆమె ముంబైలోనే ఉండిపోవాల్సి వచ్చేది. నీరజ్ షిల్లాంగ్‌లో వ్యాపారంలో రాణిస్తాడని అల్కా ఆశపడింది. కానీ దురదృష్టవశాత్తూ అతను వ్యాపారంలో మోసపోయాడు. నష్టాలెదుర్కొన్నాడు. మరోవైపు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కూతురి బాధ్యతలనుఒంటరిగానే స్వీకరించింది. దాదాపు అయిదారేళ్లు అస్సలు మాటలు కూడా లేవు. వీరు విడిపోతారని కూడా అందరూ అనుకున్నారు. కానీ మూడు దశాబ్దాలుగా వీరి ప్రేమ ప్రయాణం అసామాన్యంగా కొనసాగుతోంది.
ఇద్దరి మధ్య దూరం ఎంతున్నా, ఒకరికొకరు లేకుండా జీవించలేరని ఇద్దరి మధ్య వచ్చిన ఎడబాటు ద్వారా గ్రహించారు. ఒకరి పట్ల ఒకరికి స్వచ్ఛమైన ప్రేమ, గౌరవం అలాగే ఉన్నాయని అర్థమైంది. తమది అంత ఈజీగా ఓడిపోయే ప్రేమ కాదని నిర్ధారించేసుకున్నారు. అల్కా ముంబైలో, నీరజ్ షిల్లాంగ్‌లో నివసిస్తూనే ఒకరి కలల్ని ఒకరు గౌరవించుకుంటూ, కష్టాలు, కన్నీళ్లలో ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ గత 28 ఏళ్లుగా తమ జీవితాన్ని కొనసాగించారు. ఈ దంపతులే స్వయంగా చెప్పినట్టు, వీళ్లది విచిత్రమైన దాంపత్యం ‘కలిసి ఉండలేరు.. ఒకరికొకరు తోడు లేకుండా బతకలేరు’
Comments
Please login to add a commentAdd a comment