Alka Yagnik
-
‘కలిసి ఉండలేరు..తోడులేక బతకలేరు’ : సింగర్ అల్కా ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ
ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ బాలీవుడ్లో 90లలో ఒక సెన్సేషన్. అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రసిద్ధ గాయకులలో ఒకరిగా మెలోడీ క్వీన్‌గా సత్తా చాటుకున్నారు. మెలోడీ, పాప్ ఇలా వివిధ రకాల పాటల్లో రాణించి అభిమానుల మనసు దోచుకున్న సీనియర్-మోస్ట్ గాయని. అల్కా యాగ్నిక్ 14 ఏళ్ల వయస్సులో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. 90ల నాటి ఆ మెలోడీ క్వీన్ 16కు పైగా భాషల్లో వేల పాటలను రికార్డ్ పాడింది.ఏడు సార్లు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. చోళీ కే పీచే, ఏక్ దో తీన్, మేరీ మెహబూబా, తాల్ సే తాల్, దిల్ నే యే కహా హై దిల్ సే, ఓ రే చోరీ, హమ్ తుమ్, ఘూంగట్ కి ఆద్ సే, కుచ్ కుచ్ లాంటి సూపర్ డూపర్ సాంగ్స ఆమె ఖాతలో ఉన్నాయి. హోతా హై, కహో నా... ప్యార్ హై, సాన్ సాన్ సనా, కభీ అల్విదా నా కెహనా, అగర్ తుమ్ సాథ్ హో ఇలా చెప్పుకుంటూ పోతే...ఈ లిస్ట్ చాలా పెద్దది. ఇంకా టెలివిజన్ రియాలిటీ షోలు, స రే గ మ పా లిటిల్ చాంప్స్, ఇండియన్ ఐడల్, సూపర్ స్టార్ సింగర్, అనేక ఇతర వాటితో పాటు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. బాల్యం, ప్రేమ పెళ్లి1966 మార్చి 20, న కోల్‌కతాలో గుజరాతీ కుటుంబంలో ధర్మేంద్ర శంకర్ శుభ దంపతులకు జన్మించింది అల్కా యాగ్నిక్. తల్లి, భారతీయ శాస్త్రీయ గాయకురాలు శుభా నుంచే అల్కాకు సంగీతం అబ్బింది. ఆల్కాఆరేళ్ల వయసునుంచే ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)లో భక్తి పాటలు, భజనలు పాడటం ప్రారంభించింది. కేవలం 14 సంవత్సరాల వయస్సులో, అల్కా యాగ్నిక్ ‘పాయల్ కి ఝంకార్’ చిత్రంలో తిర్కత్ అంగ్ పాటతో ప్రొఫెషనల్ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.రైలు ప్రయాణంలో షిల్లాంగ్‌కు చెందిన నీరజ్ కపూర్‌ని 1986లో తొలిసారి కలిసింది. ఢిల్లీలోని అల్కాను, ఆమెతల్లిని స్టేషన్లో వారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. (నీరజ్ అల్కా తల్లి స్నేహితురాలి మేనల్లుడు) తొలిచూపులోనే ఇద్దరిలోనూ ప్రేమ పుట్టేసింది. ఆరేళ్లకు మాట కలిసింది. మొదట వీరి పెళ్లికి అల్కా ఇంట్లో ఒప్పుకోకపోయినప్పటికీ, రెండేళ్ల డేటింగ్ చేసిన తర్వాత 1989లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె సాయేషా కపూర్. ఈమె అమిత్ దేశాయ్‌ని వివాహం చేసుకుంది.అటు బాధ్యతల రీత్యా ఈ జంట ఒకరికొరు దూరంగా ఉండాల్సింది వచ్చింది.. కలిసి ఉండేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. నీరజ్ నిర్ణీత వ్యవధిలో ముంబైకి వెళ్లేవాడు, అల్కా కుటుంబంతో ప్రతీ ఏడాది షిల్లాంగ్‌లో ఒక నెల గడిపేది. అయితే, దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. అల్కా యాగ్నిక్ కెరీర్ కారణంగా, ఆమె ముంబైలోనే ఉండిపోవాల్సి వచ్చేది. నీరజ్ షిల్లాంగ్‌లో వ్యాపారంలో రాణిస్తాడని అల్కా ఆశపడింది. కానీ దురదృష్టవశాత్తూ అతను వ్యాపారంలో మోసపోయాడు. నష్టాలెదుర్కొన్నాడు. మరోవైపు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కూతురి బాధ్యతలనుఒంటరిగానే స్వీకరించింది. దాదాపు అయిదారేళ్లు అస్సలు మాటలు కూడా లేవు. వీరు విడిపోతారని కూడా అందరూ అనుకున్నారు. కానీ మూడు దశాబ్దాలుగా వీరి ప్రేమ ప్రయాణం అసామాన్యంగా కొనసాగుతోంది.ఇద్దరి మధ్య దూరం ఎంతున్నా, ఒకరికొకరు లేకుండా జీవించలేరని ఇద్దరి మధ్య వచ్చిన ఎడబాటు ద్వారా గ్రహించారు. ఒకరి పట్ల ఒకరికి స్వచ్ఛమైన ప్రేమ, గౌరవం అలాగే ఉన్నాయని అర్థమైంది. తమది అంత ఈజీగా ఓడిపోయే ప్రేమ కాదని నిర్ధారించేసుకున్నారు. అల్కా ముంబైలో, నీరజ్ షిల్లాంగ్‌లో నివసిస్తూనే ఒకరి కలల్ని ఒకరు గౌరవించుకుంటూ, కష్టాలు, కన్నీళ్లలో ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ గత 28 ఏళ్లుగా తమ జీవితాన్ని కొనసాగించారు. ఈ దంపతులే స్వయంగా చెప్పినట్టు, వీళ్లది విచిత్రమైన దాంపత్యం ‘కలిసి ఉండలేరు.. ఒకరికొకరు తోడు లేకుండా బతకలేరు’ -
ఆమెకు పాట వినపడదు
వేల కొలది పాటలు పాడిన గాయనికి హటాత్తుగా పాట వినపడకపోతే? వాయిద్య ధ్వని వినపడకపోతే? సంగీతమే చెవులకు సోకకపోతే? అసలు ఏమీ వినిపించకపోతే? అంతకు మించిన వేదన ఉంటుందా? గాయని అల్కా యాగ్నిక్ తనకు అరుదైన ‘సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’ వచ్చిందని ప్రకటించింది. ‘మిత్రులారా... పెద్ద పెద్ద శబ్దాలకు, హెడ్ఫోన్ల అతి వాడకానికి దూరంగా ఉండండి’ అని హెచ్చరించింది.ఆమె అవస్థ నుంచి మనం నేర్చుకోవాల్సిందేమిటి?‘ఏక్ దో తీన్ చార్ పాంచ్ ఛే సాత్’ (తేజాబ్), ‘చోలీ కే పీఛే క్యా హై’ (ఖల్ నాయక్), ‘తాళ్ సే తాళ్ మిలా’ (తాళ్) వంటి వందలాది హిట్ పాటలు పాడిన అల్కా యాగ్నిక్ (56) ఏ సంగీతాన్ని విని, పాడాలో ఆ సంగీతాన్ని వినలేని హఠాత్ స్థితికి వచ్చి పడింది. ఆమె ‘సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’తో బాధ పడుతున్నట్టు డాక్టర్లు నిర్థారించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా అకౌంట్ ‘ది రియల్ అల్కా యాగ్నిక్’ ద్వారా లోకానికి వెల్లడి చేసింది.ఆమె చెప్పింది ఏమిటి?‘కొన్ని వారాల క్రితం నేను విమానం దిగగానే అసలు ఏమీ వినపడని స్థితికి చేరుకున్నాను. ఆ దెబ్బ నుంచి నేను ధైర్యం చిక్కబట్టుకోవడానికి కొన్నివారాల సమయం పట్టింది. ఇన్నాళ్లుగా నేను ఎందుకు కనపడటం లేదని అడుగుతున్న అభిమానులకు, మిత్రులకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను ‘సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’ అనే అరుదైన జబ్బుతో బాధ పడుతున్నట్టు డాక్టర్లు తేల్చారు. ఇది వైరల్ అటాక్ అని చెప్పారు. ఈ స్థితి నుంచి కోలుకొని నేను తిరిగి వస్తానని భావిస్తున్నాను. దయచేసి అందరూ పెద్ద శబ్దాలకు, హెడ్ఫోన్ల విపరీత వాడకానికి దూరంగా ఉండండి’ అని తన ఇన్‌స్టా అకౌంట్లో రాసిందామె.‘సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’ అంటే?ఇది హఠాత్తుగా వచ్చే చెవుడు. చెవిలోని హియరింగ్ నర్వ్ మీద వైరస్ దాడి చేయడంతో ఆ నర్వ్ ఉబ్బుతుంది. అయితే ఆ నర్వ్ ఒక ఇరుకైన అస్థిక ద్వారా ప్రయాణిస్తుంది కనుక ఎప్పుడైతే ఉబ్బుతుందో అప్పుడు ఒత్తిడికి లోనవుతుంది. దాంతో పనిచేసే గుణం కోల్పోతుంది. దీనివల్ల శబ్దాలు మెదడుకు చేరే వ్యవస్థ దెబ్బ తింటుంది. హఠాత్తుగా చెవుడు వస్తుంది.⇒ ఈ స్థితికి ముందు ఎటువంటి లక్షణాలూ కనిపించవు.⇒ ఒక చెవితో మొదలై రెండోచెవికి వ్యాధి రావచ్చు. ఒకోసారి రెండు చెవులకు ఒకేసారి రావచ్చు.⇒ వార్థక్యం వల్ల, అనువంశికంగా ఈ వ్యాధి రావచ్చు.⇒ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు.⇒ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల రావచ్చు.⇒ కొన్ని రకాల మందుల వాడకం వల్ల రావచ్చు.⇒ పెద్ద పెద్ద శబ్దాలు వినడం, పెద్ద శబ్దంతో హెడ్‌ఫోన్ ఎక్కువ సేపు వాడటం వల్ల రావచ్చు.అల్కా కోలుకోవాలిఅల్కా తన పరిస్థితిని ప్రకటించిన వెంటనే ఆమె సహ గాయకులు సోను నిగమ్, ఇలా అరుణ్, శంకర్ మహదేవన్, కుమార్ సాను స్పందించారు. ‘మళ్లీ నిన్ను యథావిధిగా చూస్తాం. మా ప్రేమ నీతో ఉంది’ అని వారు కామెంట్లు చేశారు. ధైర్యం చెప్పారు. గాయనిగా ఉంటూనే అల్కా వివిధ రియాల్టీ షోలలో హోస్ట్‌గా పాల్గొంటూ ఉంటుంది. ఆమె మన బాలూతో పాడిన ‘దేఖా హై పెహెలీ బార్’ (సాజన్) వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.అలాగే ప్రపంచవ్యాప్తంగా స్టేజ్షోలు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కొన్నాళ్ల పాటు వాటన్నింటికి ఆమె దూరంగా ఉండాల్సిందే. అన్నింటికంటే పెద్ద ఇబ్బంది ఏమిటంటే హఠాత్తుగా వచ్చిన చెవుడు వల్ల తిరిగి సహజంగా/ కృత్రిమంగా వినికిడి వ్యవస్థ పునరుద్ధరింపబడే వరకూ అసలేమీ వినిపించకపోవడంతో అయోమయం ఏర్పడుతుంది. డిప్రెషన్ రావచ్చు. జీవితేచ్ఛ నశించవచ్చు. బంధుమిత్రుల గట్టి సపోర్ట్ ఉంటే, ఆత్మవిశ్వాసం నిలుపుకుంటే తప్ప ఈ పరిస్థితి దాటటం కష్టం. ‘మీ ప్రార్థనల్లో నన్ను ప్రస్తావించండి’ అని కోరిన అల్కాకు అభిమానుల ప్రార్థనలు సమృద్ధిగా ఉన్నాయి. ఆమె తప్పక కోలుకుంటుందని ఆశిద్దాం. చికిత్స⇒ ఈ స్థితి కనిపించిన వెంటనే చికిత్సకు వెళితే కొన్ని రకాల హైడోస్ స్టెరాయిడ్స్ వల్ల పరిస్థితిని మెరుగు పరిచే వీలు ఉంటుంది.⇒ కొంతమంది ఏ చికిత్సా చేయించుకోకపోయినా కొన్నాళ్లకు యాభై శాతం వినికిడి రావచ్చు.⇒ కొందరి విషయంలో కాక్లియర్ ఇం΄్లాంట్స్ పని చేయవచ్చు.⇒ ఎక్కువమంది విషయంలో చికిత్స ఉండదనే చెప్పాలి.⇒ వినికిడి సాధనాలతో వీరు జీవితం గడపాల్సి వస్తుంది. -
ప్రముఖ లేడీ సింగర్‌కి అరుదైన వ్యాధి.. ఫలితంగా చెవుడు!
ప్రముఖ లేడీ సింగర్ అరుదైన వ్యాధి బారిన పడింది. దీని వల్ల ఆమెకు చెవుడు వచ్చింది. అసలేం జరిగిందో.. ఈ వ్యాధి వచ్చిన విషయాన్ని ఎలా కనుగొందో వివరంగా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇన్ స్టా పోస్ట్ పెట్టి వివరించింది. 1990ల టైంలో బాలీవుడ్లో టాప్ సింగర్స్‌లో ఒకరైన అల్కా యాగ్నిక్.. ఇప్పుడు సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్‌తో బాధపడుతోంది. అనుకోని వైరల్ ఎటాక్ కారణంగానే దీని బారిన పడ్డానని, సోకే వరకు దీని గురించే తెలియదని ఎమోషనల్ అయిపోయింది.(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే ప్రభాస్ 'కల్కి' మరో రికార్డ్.. ఈసారి ఏకంగా!)'నా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫాలోవర్స్.. కొన్ని వారాల క్రితం నేను విమానం దిగి వస్తుంటే.. నాకేం వినబడలేదు. గత కొన్నిరోజుల నుంచి నేను ఎందుకు కనిపించట్లేదు అని అడిగిన వాళ్ల కోసం ఇప్పుడు చెబుతున్నా. నేను ఓ అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ సమస్యతో బాధపడుతున్నా. ఈ విషయాన్ని డాక్టర్లు చెప్పారు. వైరల్ ఎటాక్ వల్ల ఇలా జరిగింది. దీన్ని నేను అస్సలు ఊహించలేదు. ఒక్కటే చెబుతున్నా. పెద్ద సౌండ్‌తో పాటలు వినడం, హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించండి. త్వరలోనే నేను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను' అని అల్కా యాగ్నిక్ చెప్పుకొచ్చింది.90ల్లో హిందీలో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన అల్కా యాగ్నిక్.. పలు రియాలిటీ షోల్లో జడ్జిగా వ్యవహరించింది. ఇప్పటివరకు 25 భాషల్లో 21 వేలకు పైగా పాటలు ఈమె పాడటం విశేషం. అలానే 2022లో మోస్ట్ స్ట్రీమ్డ్ ఆర్టిస్టుగా గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఆ ఏడాది 15.3 బిలియన్ వ్యూస్‌ని ఆల్కా పాటలు సాధించడం విశేషం.(ఇదీ చదవండి: ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?) View this post on Instagram A post shared by Alka Yagnik (@therealalkayagnik)