ప్రముఖ లేడీ సింగర్ అరుదైన వ్యాధి బారిన పడింది. దీని వల్ల ఆమెకు చెవుడు వచ్చింది. అసలేం జరిగిందో.. ఈ వ్యాధి వచ్చిన విషయాన్ని ఎలా కనుగొందో వివరంగా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇన్ స్టా పోస్ట్ పెట్టి వివరించింది. 1990ల టైంలో బాలీవుడ్‌లో టాప్ సింగర్స్‌లో ఒకరైన అల్కా యాగ్నిక్.. ఇప్పుడు సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్‌తో బాధపడుతోంది. అనుకోని వైరల్ ఎటాక్ కారణంగానే దీని బారిన పడ్డానని, సోకే వరకు దీని గురించే తెలియదని ఎమోషనల్ అయిపోయింది.
(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే ప్రభాస్ 'కల్కి' మరో రికార్డ్.. ఈసారి ఏకంగా!)
'నా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫాలోవర్స్.. కొన్ని వారాల క్రితం నేను విమానం దిగి వస్తుంటే.. నాకేం వినబడలేదు. గత కొన్నిరోజుల నుంచి నేను ఎందుకు కనిపించట్లేదు అని అడిగిన వాళ్ల కోసం ఇప్పుడు చెబుతున్నా. నేను ఓ అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ సమస్యతో బాధపడుతున్నా. ఈ విషయాన్ని డాక్టర్లు చెప్పారు. వైరల్ ఎటాక్ వల్ల ఇలా జరిగింది. దీన్ని నేను అస్సలు ఊహించలేదు. ఒక్కటే చెబుతున్నా. పెద్ద సౌండ్‌తో పాటలు వినడం, హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించండి. త్వరలోనే నేను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను' అని అల్కా యాగ్నిక్ చెప్పుకొచ్చింది.
90ల్లో హిందీలో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన అల్కా యాగ్నిక్.. పలు రియాలిటీ షోల్లో జడ్జిగా వ్యవహరించింది. ఇప్పటివరకు 25 భాషల్లో 21 వేలకు పైగా పాటలు ఈమె పాడటం విశేషం. అలానే 2022లో మోస్ట్ స్ట్రీమ్డ్ ఆర్టిస్టుగా గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఆ ఏడాది 15.3 బిలియన్ వ్యూస్‌ని ఆల్కా పాటలు సాధించడం విశేషం.
(ఇదీ చదవండి: ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment