lovestory
-
‘కలిసి ఉండలేరు..తోడులేక బతకలేరు’ : సింగర్ అల్కా ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ
ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ బాలీవుడ్లో 90లలో ఒక సెన్సేషన్. అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రసిద్ధ గాయకులలో ఒకరిగా మెలోడీ క్వీన్‌గా సత్తా చాటుకున్నారు. మెలోడీ, పాప్ ఇలా వివిధ రకాల పాటల్లో రాణించి అభిమానుల మనసు దోచుకున్న సీనియర్-మోస్ట్ గాయని. అల్కా యాగ్నిక్ 14 ఏళ్ల వయస్సులో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. 90ల నాటి ఆ మెలోడీ క్వీన్ 16కు పైగా భాషల్లో వేల పాటలను రికార్డ్ పాడింది.ఏడు సార్లు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. చోళీ కే పీచే, ఏక్ దో తీన్, మేరీ మెహబూబా, తాల్ సే తాల్, దిల్ నే యే కహా హై దిల్ సే, ఓ రే చోరీ, హమ్ తుమ్, ఘూంగట్ కి ఆద్ సే, కుచ్ కుచ్ లాంటి సూపర్ డూపర్ సాంగ్స ఆమె ఖాతలో ఉన్నాయి. హోతా హై, కహో నా... ప్యార్ హై, సాన్ సాన్ సనా, కభీ అల్విదా నా కెహనా, అగర్ తుమ్ సాథ్ హో ఇలా చెప్పుకుంటూ పోతే...ఈ లిస్ట్ చాలా పెద్దది. ఇంకా టెలివిజన్ రియాలిటీ షోలు, స రే గ మ పా లిటిల్ చాంప్స్, ఇండియన్ ఐడల్, సూపర్ స్టార్ సింగర్, అనేక ఇతర వాటితో పాటు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. బాల్యం, ప్రేమ పెళ్లి1966 మార్చి 20, న కోల్‌కతాలో గుజరాతీ కుటుంబంలో ధర్మేంద్ర శంకర్ శుభ దంపతులకు జన్మించింది అల్కా యాగ్నిక్. తల్లి, భారతీయ శాస్త్రీయ గాయకురాలు శుభా నుంచే అల్కాకు సంగీతం అబ్బింది. ఆల్కాఆరేళ్ల వయసునుంచే ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)లో భక్తి పాటలు, భజనలు పాడటం ప్రారంభించింది. కేవలం 14 సంవత్సరాల వయస్సులో, అల్కా యాగ్నిక్ ‘పాయల్ కి ఝంకార్’ చిత్రంలో తిర్కత్ అంగ్ పాటతో ప్రొఫెషనల్ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.రైలు ప్రయాణంలో షిల్లాంగ్‌కు చెందిన నీరజ్ కపూర్‌ని 1986లో తొలిసారి కలిసింది. ఢిల్లీలోని అల్కాను, ఆమెతల్లిని స్టేషన్లో వారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. (నీరజ్ అల్కా తల్లి స్నేహితురాలి మేనల్లుడు) తొలిచూపులోనే ఇద్దరిలోనూ ప్రేమ పుట్టేసింది. ఆరేళ్లకు మాట కలిసింది. మొదట వీరి పెళ్లికి అల్కా ఇంట్లో ఒప్పుకోకపోయినప్పటికీ, రెండేళ్ల డేటింగ్ చేసిన తర్వాత 1989లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె సాయేషా కపూర్. ఈమె అమిత్ దేశాయ్‌ని వివాహం చేసుకుంది.అటు బాధ్యతల రీత్యా ఈ జంట ఒకరికొరు దూరంగా ఉండాల్సింది వచ్చింది.. కలిసి ఉండేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. నీరజ్ నిర్ణీత వ్యవధిలో ముంబైకి వెళ్లేవాడు, అల్కా కుటుంబంతో ప్రతీ ఏడాది షిల్లాంగ్‌లో ఒక నెల గడిపేది. అయితే, దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. అల్కా యాగ్నిక్ కెరీర్ కారణంగా, ఆమె ముంబైలోనే ఉండిపోవాల్సి వచ్చేది. నీరజ్ షిల్లాంగ్‌లో వ్యాపారంలో రాణిస్తాడని అల్కా ఆశపడింది. కానీ దురదృష్టవశాత్తూ అతను వ్యాపారంలో మోసపోయాడు. నష్టాలెదుర్కొన్నాడు. మరోవైపు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కూతురి బాధ్యతలనుఒంటరిగానే స్వీకరించింది. దాదాపు అయిదారేళ్లు అస్సలు మాటలు కూడా లేవు. వీరు విడిపోతారని కూడా అందరూ అనుకున్నారు. కానీ మూడు దశాబ్దాలుగా వీరి ప్రేమ ప్రయాణం అసామాన్యంగా కొనసాగుతోంది.ఇద్దరి మధ్య దూరం ఎంతున్నా, ఒకరికొకరు లేకుండా జీవించలేరని ఇద్దరి మధ్య వచ్చిన ఎడబాటు ద్వారా గ్రహించారు. ఒకరి పట్ల ఒకరికి స్వచ్ఛమైన ప్రేమ, గౌరవం అలాగే ఉన్నాయని అర్థమైంది. తమది అంత ఈజీగా ఓడిపోయే ప్రేమ కాదని నిర్ధారించేసుకున్నారు. అల్కా ముంబైలో, నీరజ్ షిల్లాంగ్‌లో నివసిస్తూనే ఒకరి కలల్ని ఒకరు గౌరవించుకుంటూ, కష్టాలు, కన్నీళ్లలో ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ గత 28 ఏళ్లుగా తమ జీవితాన్ని కొనసాగించారు. ఈ దంపతులే స్వయంగా చెప్పినట్టు, వీళ్లది విచిత్రమైన దాంపత్యం ‘కలిసి ఉండలేరు.. ఒకరికొకరు తోడు లేకుండా బతకలేరు’ -
అనుకున్నామనీ జరగవు అన్నీ...కన్నీళ్లు పెట్టించే లవ్ స్టోరీ!
కొన్ని ప్రేమ కథలు హృద్యంగా ఉంటాయి. మరికొన్ని ప్రేమ కథలు కన్నీరు పెట్టిస్తాయి. అలాంటి వాటిల్లో ఒక జంట ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరి ప్రేమికుల్లాగానే ఎన్నో కబుర్లు చెప్పుకుంది ఈ జంట. అందమైన జీవితాన్ని కలగంది. నిశ్చితార్థాన్ని కూడా చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బావుండేది... కానీ విధి మరోలా ఉంది. మాయదారి మహమ్మారి వారి ప్రేమ కథను విషాదాంతం చేసింది. హీథర్, డేవిడ్ మోషెర్ 2015లో స్వింగ్ డ్యాన్స్ క్లాస్‌లో కలుసుకున్నారు. తొలుత చూపులు, ఆ తర్వాత మాటలు కలిసాయి. కొన్ని నెలల డేటింగ్ తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. బంధువులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థ వేడుకను నిర్వహించుకున్నారు. 2017, డిసెంబర్ 30 తమ పెళ్లి ముహూర్తంగా ఖాయం చేసుకున్నారు. అయితే ఇక్కడే వారి జీవితాల్లో పెద్ద అలజడి రేగింది. హీథర్‌కు చాలా ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ రొమ్ము కేన్సర్ నిర్ధారణ అయింది. అంతే..అంతా తారుమారు. టెస్ట్‌లు, కీమోథెరపీలతో ఆసుపత్రులు చుట్టూ తిరగడమే సరిపోయింది. కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్లో తన ప్రియురాలు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. మరోవైపు ఉబికి వస్తున్న కన్నీళ్లను అదుముకుంటూ ఆసుపత్రి బెడ్ పైనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె కోరిక మేరకు ఆసుపత్రి బెడ్ పెళ్లి వేదికగా మారింది. ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న సరిగ్గా ఏడాదికి ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. పంటి బిగువున శారీరక బాధను భరిస్తూ భర్తగా మారిన ప్రియుడిని ప్రేమతో ఆలింగనం చేసుకున్న ఆ చేతులు 18 గంటల తరువాత అచేతనంగా మిగిలి పోయాయి. భర్తను చూస్తూ శాశ్వత నిద్రలోకి జారిపోయింది హీథర్. మరో విషాదం ఏమిటంటే పెళ్లి చేసుకోవాలనుకున్న డిసెంబరు 30నే ప్లాంట్స్విల్లే కాంగ్రెగేషనల్ చర్చిలో హీథర్ మోషర్ అంత్యక్రియలు ముగిసాయి. 2018లో అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నాన్ ఈస్తటిక్ థింక్స్ అనే ట్విటర్ హ్యాండిల్ ఈ స్టోరీని ట్విటర్లో మళ్లీ షేర్ చేసింది. కేవలం 14 గంటల్లోనే 17 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. This woman got married in a hospital hours before she died of cancer 😢 pic.twitter.com/vKcVQPKaaK — non aesthetic things (@PicturesFoIder) January 29, 2024 -
హీరోయిన్ సాయిపల్లవి బ్యూటిఫుల్ ఫొటోలు
-
ఆమె అందంగా ఉంటుంది... 25 ఏళ్లకే చనిపోయింది..
వెంకటేష్ ప్రభు కస్తూరిరాజా ఎవరు? అంటే ‘ఏమో’ అనేవాళ్లే ఎక్కువ. ‘అదేనండీ ధనుష్’ అంటే మాత్రం తెలియదనే వాళ్లు తక్కువ. అది ఆయన స్క్రీన్‌నేమ్. పదాలు అల్లడం, పాటకు గొంతు సవరించడంతో పాటు పుస్తకాలు చదవడం అనేది కూడా ఆయన అభిరుచుల్లో ఒకటి. ధనుష్‌కు నచ్చిన పుస్తకాల్లో ఒకటి లవ్‌స్టోరీ.. ప్రేమికుల దినోత్సవం, 1970లో విడుదలైన ఈ నవల సంచలనం సృష్టించింది. అమెరికన్ రచయిత ఎరిక్ సెగల్ రాసిన ఈ రొమాన్స్ నవల ‘ది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్’ జాబితాలో అనేక వారాల పాటు అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో భాషలలోకి అనువాదం అయింది. సినిమాకు స్క్రీన్‌ప్లేగా రాసుకున్న ఈ కథను నవలగా రాశాడు సెగల్. ‘ఆమె అందంగా ఉంటుంది. తెలివైనది. పాతికేళ్ల వయసులోనే ఆమె చనిపోయింది...’ అంటూ నవల మొదలవుతుంది. విషాదాంత కథలకు నిర్దిష్టమైన కాలపరిధి అంటూ ఉండదు. అవి కాలతీతమైనవి అని చెప్పడానికి ఈ నవల మరో బలమైన ఉదాహరణ. స్థూలంగా చెప్పాలంటే ఇది పెద్దింటి అబ్బాయి, పేదింటి అమ్మాయి ప్రేమకథ.(ఒక అమెరికన్ ప్రముఖుడి యవ్వనపు రోజుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ నవల రాశాడు అనే గుసగుసలు కూడా ఉన్నాయి. ఆలివర్, జెన్నిఫర్లు హార్వర్డ్ యూనివర్శిటీ క్యాంపస్‌లో పరిచయం అవుతారు. ఆ పరిచయం గాఢమైన స్నేహంగా మారడానికి ఎంతో కాలం పట్టదు. క్లాసిక్ మ్యూజిక్ స్టూడెంట్ అయిన జెన్నీ(జెన్నిఫర్) పై చదువుల కోసం ఫ్రాన్స్‌కు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నానని ఆలివర్‌కు చెబుతుంది. ఆ మాట ఆలివర్ను పిడుగుపాటులా తాకుతుంది. ఆమె ఫ్రాన్స్‌కు వెళితే తనకేమిటి బాధ? తను ప్రేమలో పడ్డాడా? ఎస్...తన మనసులో మాటను ఆమెతో చెబుతాడు,....‘ఐ లవ్ యూ’ అని. ఆమె కూడా ‘లవ్ యూ’ అంటుంది.అంతమాత్రాన కథ సుఖాంతం అవుతుందా? అందం, ఆలోచనల విషయంలో ఇద్దరూ ఒకటే. ఆస్తుల విషయంలో మాత్రం హస్తిమశకాంతరం తేడా ఉంది. ఆలివర్ సంపన్నుడి వారసుడు. విలువైన వ్యాపార సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తి. జెన్నీని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళతాడు. వారికి ఆమె నచ్చదు. కారణం ఏమిటో తెలిసిందే.‘నువ్వు ఆ అమ్మాయిని మరిచిపో. నా మాట కాదని పెళ్లి చేసుకుంటే ఆస్తి నుంచి చిల్లిగవ్వ కూడా ఇవ్వను’ అని హెచ్చరిస్తాడు తండ్రి. అయితే తండ్రి మాటని కాదని జెన్నీని పెళ్లి చేసుకుంటాడు ఆలివర్. ఊహించినట్లుగానే ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. అంతమాత్రాన వారు వెనక్కి తగ్గరు. జెన్నీ ఒక స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంది. ఈలోపు చదువు పూర్తి కావడంతో న్యూయార్క్ సిటీలో లా ఫర్మ్‌లో చేరుతాడు ఆలివర్. ఇక ఆర్థిక కష్టాలు పోయినట్లే, సంసారం గాడిన పడినట్లే అనుకుంటున్న ఆనంద సమయంలో ఆలివర్ను నిలువెల్లా దహించివేసే వార్త....జెన్నీకి క్యాన్సర్! ఇక ఎన్నో రోజులు బతకకపోవచ్చు!! మొదట ఈ దుర్వార్త ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. కాని ఎన్ని రోజులు? ఆమెను బతికించుకోవడానికి ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి తండ్రి దగ్గర చేయి చాస్తాడు ఆలివర్. అయినా ఫలితం ఉండదు. ఆమె తనకు దక్కదు. ఎటు చూసినా దుఃఖమే...ఏం మాట్లాడినా దుఃఖమే...ప్రపంచమంతా చీకటే! ఆరోజు కొడుకు వైపు చూస్తు...‘ఐయామ్ సారీ’ అంటాడు తండ్రి. ‘లవ్ మీన్స్...నెవర్ హావింగ్ టూ సే యూ ఆర్ సారీ’ అని బదులిస్తాడు కొడుకు. ఒకరోజు ఏదో సందర్భంలో ‘సారీ’ అని చెబితే జెన్నీ తనతో చెప్పిన మాట ఇది. ఈ నవల ఒక ఎత్తయితే ‘లవ్ మీన్స్...’ అనే డైలాగ్ ఒక ఎత్తు. బాగా పాప్లర్ అయింది. ప్రేక్షక ఆదరణ పొందిన సినిమా డైలాగుల జాబితాలో చోటుచేసుకుంది. -
లవర్‌బాయ్‌గా చైతన్య అదుర్స్ : ఫిదా చేస్తున్న పల్లవి
సాక్షి, హైదరాబాద్ : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంట నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రానికి సంబంధించి మరో సాంగ్ గురువారం విడులైంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ అందమైన ప్రేమ కథ చిత్రం లోని ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ‘ఏవో ఏవో కలలే’ పాటను ప్రిన్స్ మహేష్‌బాబు లాంచ్ చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్న ఈ మూవీ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా, పాటలు కూడా దుమ్ము రేపుతున్నాయి.. తాజాగా రెయిన్ సాంగ్‌తో దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన స్టైల్‌ను చూపించాడు. భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యానికి, పవన్ సిహెచ్ స్వరాలు కూర్చగా జోనితా గాంధీ, నకుల్ అభ్యాంకర్ ఆలపించిన ఈ గీతం టాక్ ఆఫ్‌ది లవర్స్‌గా నిలుస్తోంది. దీనికి తోడు నా ఫ్యావరేట్ సాంగ్ వచ్చేసిందోచ్ అంటూ సమంతా అక్కినేని ట్వీట్ చేయడం విశేషం. తాజా పాటలో మలయాళ బ్యూటీ సాయి పల్లవి తన డ్యాన్స్ మ్యాజిక్‌తో ఆకట్టుకోవడం ఖాయం. ఇప్పటికే దీనికి సంబంధించిన లుక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, సాయిపల్లవి వర్షంలో లుక్స్‌కి ఫ్యాన్స్‌ను ఫిదా అవుతున్నారు. అటు మహేష్ చేతులమీదుగా నాగచైతన్య లవ్ స్టోరీ సాంగ్ రిలీజ్ కావడం అభిమానుల్లో మరింత జోష్ ను నింపింది. దీనికి తోడుఇటీవల విడుదలైన సెన్సేషనల్ ‘సారంగ దరియా’ సాంగ్ సృష్టించిన సంచలనంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.. ఏప్రిల్ 16న థియేటర్లను పలకరించేందుకు రడీ అవుతోంది. Yayyyyyyy ❤️❤️❤️.. My favourite song is out 💃💃💃 #EvoEvoKalale #LoveStory @chay_akkineni https://t.co/EsaXxbkxsG@pawanch19 @bhaskarabhatla@NakulAbhyankar @jonitamusic @sekharkammula @SVCLLP @sai_pallavi92 #AmigosCreations @adityamusic @niharikagajula — Samantha Akkineni (@Samanthaprabhu2) March 25, 2021 -
నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా: సాయి పల్లవి
‘‘నువ్వు చేసిన త్యాగాలు.. రాజీపడ్డ అంశాలను రహస్యంగా ఉంచిన తీరు.. నీ ప్రేమ.. నా జీవితానికి నువ్విచ్చిన అర్థం.. నాలో నువ్వు నింపిన సంతోషం.. ఎల్లవేళలా చిరునవ్వు చిందించే నువ్వు.. నీ ఉనికి నా ప్రపంచాన్ని గొప్పగా మార్చింది. 100 ఏళ్లు వచ్చినా నువ్వు నా బేబీవే. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియాలంటే నువ్వు నాలా మారిపోవాల్సిందే. నా జీవితంలో నువ్వు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. హ్యాపీ బర్త్ డే మంకీ’’ అంటూ హీరోయిన్ సాయిపల్లవి తన సోదరి పూజా కన్నన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పూజా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో చిన్ననాటి ఫొటో షేర్ చేసి తన ప్రేమను చాటుకున్నారు. కాగా ఫిదాతో కుర్రకారు మనసు దోచిన సాయి పల్లవి ప్రస్తుతం.. ‘లవ్‌స్టోరీ’అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడింది. ఇక ఈ చిత్రంతో పాటు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో రూపొందిన ‘విరాటపర్వం’లోనూ సాయి పల్లవి నటిస్తున్నారు. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. View this post on Instagram The love, The sacrifices you’ve made, The compromises you conceal, The meaning you add to my life, The happiness you bring to my system, The smile that you ensure on days of all kinds, The very existence of YOU in my world is a blessing. You are my baby n you’ll be that even when you are a 100 years old. You have to be me, to know how much I love you! Today is a reminder, of how lucky I’m to have you in my life. Happy birthday monkey😘❤️ A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on Apr 21, 2020 at 4:12am PDT -
ముగిసిన హేమావతి, కేశవ ప్రేమకథ
సాక్షి, పలమనేరు: దొమ్మరపాపమ్మ తల్లి సాక్షిగా చిన్ననాటి నుంచి వారిరువురూ ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని కష్టాలను ఎదుర్కొన్నారు. చివరికి అదే ఆలయం వద్ద వారి బంధానికి తెరపడింది. మండలంలోని ఊసరపెంటకు చెందిన కేశవ, హేమావతిల ప్రేమ, పెళ్లి సినిమా కథను పోలినట్టు సాగింది. ఈ గ్రామం విసిరేసినట్టు అడవిలో ఉంటుంది. చుట్టూ చెట్లుచేమలు తప్ప, జనసంచారం పెద్దగా కనిపించదు. మొన్నటి దాకా ఆ గ్రామానికి అధ్వాన మట్టిరోడ్డు మాత్రమే దిక్కు. దీంతో వాహన సౌకర్యం లేదు. గ్రామస్తులు దొమ్మరపాపమ్మ గుడిదాకా నడిచివెళ్లి, ఆపై అటు పలమనేరు.. ఇటు గుడియాత్తం పట్టణాలకు వెళ్లేవారు. ఈ ప్రాంతం తమిళనాడుకు ఆనుకునే ఉంటుంది. ప్రజల ఆచార వ్యవహారాలు, భాషలో కూడా తమిళమే ఎక్కువ. 40 దాకా ఉన్న ఎస్సీ కుంటుంబాలకు కూలినాలే దిక్కు. పిల్లలను చదివించాలన్నా కష్టమే. ఈ పరిస్థితుల్లో కేశవ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ దాకా చదివాడు. హేమావతి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పది వరకు చదివింది. వీరు దొమ్మరపాపమ్మ గుడిదాకా రోజూ కలసిమెలసి నడిచి వెళ్లి, ఆపై సైకిళ్లపై వెళ్లేవారు. హేమావతి కుటుంబీకులు, వారి బంధువుల వ్యవసాయ పనులకు కేశవ కుటుంబీకులు వెళ్లేవారు. దీంతో చనువుగా ఉండే వీరి మధ్య అప్పటికే ప్రేమ వికసించి పెళ్లిదాకా వెళ్లింది. ఈ విషయం హేమావతి కుటుంబానికి తెలియడంతో పలుమార్లు గొడవలు, పంచాయతీలు జరిగాయి. హేమావతిని కుటుంబీకులు తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో చేర్చారు. విషయం తెలుసుకున్న కేశవ సైతం తిరుపతికెళ్లి అక్కడ పనిచేసుకుంటూ వారి ప్రేమను కొనసాగించాడు. ఆపై కులాంతర వివాహానికి ఆటంకాలు రావడంతో.. పరారై, కుప్పంలో పెళ్లి చేసుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత హేమావతి గర్భిణి కావడంతో కాన్పుకోసం ఇక్కడికి వచ్చారు. ఆస్పత్రి నుంచి బస్సు దిగగానే అదే దొమ్మరిపాపమ్మ గుడివద్ద బాలింత హేమావతిని తల్లిదండ్రులు బంవంతంగా లాక్కెళ్లి ఉరివేసి చంపి, బావిలో పడేశారు. ఇన్ని కష్టాలు పడ్డ తనకు హేమావతి దక్కకుండా పోయిందని భర్త కేశవ రోదించాడు. పలమనేరు ఆస్పత్రి మార్చురీలో శనివారం తన భార్య మృతదేహాన్ని తీసుకుని.. విలపిస్తూనే ఆటోలో ఎక్కించడం అక్కడున్న వారిని కలచివేసింది. -
వదంతుల వలలోనయనతార
కొందర్ని చూస్తే మెచ్చబుద్ధి.. మరొకర్ని చూస్తే మొత్తబుద్ధి వేస్తుందనే సామెత ఉంది. అలానే నయనతారను చూస్తే ఏవేవో రాయాలనిపిస్తుందేమో. ప్రేమ వ్యవహారాల్లో ఇంతకు ముందు సంచలనాలు సృష్టించిన ఈ బ్యూటీపై ఇటీవల మళ్లీ వదంతుల పరంపర మొదలైం ది. శింబుతో ప్రేమాయణం, ఆ తర్వాత ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్లి కథ కంచెకు చేరిన విధంగా మారిన లవ్‌స్టోరీ ఆ మధ్యలో చాలా కలకలాన్ని సృష్టించాయి. కొంత కాలంగా వీటికి దూరంగా ఉన్న నాయనపై మళ్లీ వదంతుల ప్రవాహాని కి తెరలేసింది. అందుకు కారణం ఆమె మళ్లీ తన మాజీ ప్రియుడు శింబుతో జత కట్టడమే కారణం కావచ్చు. ఈ మధ్య ఆర్య సరసన రాజారాణి చిత్రం లో నటించినప్పుడు వీరిద్దరి గురించి కథలు కథలుగా ప్రచారం జరిగింది. ఆర్య నయనకు బిర్యాని విందునిచ్చారని, ఇద్దరూ నక్షత్ర హోటళ్లలో ఏకాం తంగా కలుసుకుంటున్నారని రకరకాల వదంతులు ప్రచారమయ్యాయి. అవ న్నీ వదంతులే అంటూ నయనతార ఖండించారు. తాజాగా శింబుతో సాన్నిహిత్యం గురించి మరోసారి గాసిప్సు గుప్పుమన్నాయి. వీటిపై నయనతార స్పందిస్తూ తన గురించి చాలా వదంతులు ప్రచారమవుతున్నాయన్నారు. ఆర్యను ప్రేమిస్తున్నట్లు, శింబుతో షికార్లు అంటూ ఇష్టమొచ్చినట్లు రాసేస్తున్నారన్నారు. వీటిలో ఏదీ నిజం కాదని చెప్పారు. తాము నటులమ ని, వృత్తిపై అంకితభావం చూపిస్తున్నామని అన్నారు. ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతామన్నారు. అంతేకానీ తమ మధ్య ఎలాంటి సం బంధం లేదని స్పష్టం చేశారు. అయి తే ఇలాంటి వదంతులకు కొందరు న టీనటులు ఇష్టపడతారనే అభిప్రాయా న్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా బా లీవుడ్ తారలు ఇలాంటి గ్యాసిప్స్‌ను ప్రచారం చేస్తారని, తద్వారా వారు ఫలం పొందుతున్నట్లు చెబుతారని అన్నారు. అందువల్లే తమ గురిం చి వదంతులు ప్రచారం అయినప్పటికీ ఆనందిస్తారన్నారు. ఆ సంస్కృతి ఇప్పుడు కోలీవుడ్ లో మొదలయ్యిందని అన్నా రు. తెలుగులో ఇలాంటి పరిస్థితి లేదని నయనతార తెలిపారు. -
ప్రేమ.. ప్యార్... లవ్...!
కథ ‘‘ఏం చెయ్యాలి. ఏం చెయ్యాలి. అయ్యో! నేనేం చెయ్యాలి. ఎలా ఇప్పుడెలా?’’ ‘‘ఏంటయ్యా అలా తల బాదుకుంటున్నావు. తలకు దెబ్బ తగిలి కోమాలోకి వెళ్లిపోతావు.’’ ‘‘ఏం చెయ్యమంటారు. నా సమస్య అలాంటిది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.’’ ‘‘అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ అలా తల బాదుకుంటే ఎలా?’’ ‘‘ఏం చెయ్యలేకే సార్ తల బాదుకుంటున్నా.’’ ‘‘ప్రతి సమస్యకొక పరిష్కారం ఉంటుందయ్యా. నీ సమస్య చెప్పు ఏం చెయ్యాలో నేను చెబుతా.’’ ‘‘ఎందుకులేండి మీ పని మీరు చూసుకోండి.’’ ‘‘పనేమీ లేకనేనయ్యా చెప్పమంటున్నాను. నువ్వా కుర్రాడివి, నేనా రిటైర్ అయినవాణ్ని. నీ కంటే అనుభవజ్ఞుణ్ని, జీవితం చూసినవాణ్ని. చెప్పు పరిష్కారం చెబుతా!’’ ‘‘నా పేరు భీమేష్ అండి, బర్కత్‌పురాలో ఉంటాం.’’ ‘‘భీమేష్ బర్కత్‌పురా బావుంది, ప్రాస కుదిరింది.’’ ‘‘అబ్బా! వినండి సార్, వంట చేయడమంటే చిన్నప్పటినుంచీ ఇంట్రస్ట్.’’ ‘‘వంటను ఒంటపట్టించుకున్నావన్నమాట.’’ ‘‘అవును. వంట చెయ్యటాన్ని ప్రేయసిని ప్రేమించినట్టు ప్రేమించాను.’’ ‘‘బావుంది పోలిక.’’ ‘‘అందులో నైపుణ్యం సంపాదించాను. బిర్యానీ వాసనను బట్టి ఎంత దూరం నుంచైనా అందులో వాడిన మసాలా దినుసుల పర్సంటేజీ ఎంతో కచ్చితంగా చెబుతాను.’’ ‘‘అబ్బో!’’ ‘‘చికెన్ మటన్ బిర్యానీలు ఎన్ని రకాలుగా చెయ్యొచ్చో అద్భుతంగా చేస్తా.’’ ‘‘నోరూరుతోందయ్యా.’’ ‘‘వంటలు తయారుచేయటం గురించి సమస్త సమాచారం సేకరించాను. వంటల పుస్తకాలు కొని లైబ్రెరీ తయారుచేశాను. ఇంటర్నెట్లో కూడా కేవలం వంటలు తయారుచేసే సైట్లే చూస్తాను.’’ ‘‘అబ్బబ్బ!’’ ‘‘ఒక రకంగా వంటలు వండటమే ప్రపంచంలాగా బతుకుతున్నాను.’’ ‘‘భారతంలో భీముడిలాగా పాకశాస్త్ర ప్రియుడివన్నమాట.’’ ‘‘అలాగే అనుకోండి.’’ ‘‘మీ అమ్మా నాన్నా నీకు భీమేష్ అని పేరు కూడా కరెక్ట్‌గానే పెట్టారయ్యా.’’ ‘‘మా అమ్మ అంటే గుర్తొచ్చింది. అసలు నాకీ వంటల మీద ఆసక్తి చిన్నప్పుడే చిత్రంగా గమ్మత్తుగా కలిగింది.’’ ‘‘అబ్బ అబ్బ చెప్పు ఇంట్రెస్టింగ్గా ఉంది.’’ ‘‘మా అమ్మ చిన్నప్పుడు చపాతీలు చేసేటప్పుడు పక్కనున్న పిండిలో చిన్నచిన్నగా చపాతీలు చేసేవాణ్ని. నన్ను సంతోష పెట్టడానికి అమ్మ వాటిని కూడా కాల్చి ఇచ్చేది. అందరికీ గొప్పగా చెప్పుకునేవాణ్ని. అప్పటినుంచీ అమ్మ వంట చేస్తుంటే కూరలు కోసేవాణ్ని. గరిట తిప్పేవాణ్ని. అలా అలా కొద్ది రోజుల తర్వాత ఇంట్లో వంటపని నేనే చేయడం మొదలుపెట్టాను. వంట రుచిగా ఉంటుండటంతో మా నాన్న నన్నే వండమనేవాడు. అలా అన్ని రకాల వంటలు నేర్చుకున్నాను.’’ ‘‘వంటింటి భాగోతం బాగుంది చెప్పు.’’ ‘‘కాలేజీలో డిగ్రీ చదివిన తర్వాత ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాను.’’ ‘‘హోటల్ వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతావయ్యా.’’ ‘‘సలహాలు ఇవ్వకండి. చెప్పేది వినండి.’’ ‘‘సారీ సారీ చెప్పు.’’ ‘‘అప్పటికే నా ఫ్రెండ్స్ అందరూ హోటల్ పెట్టమని బలవంతపెట్టసాగారు. ఆలోచిస్తే నాకు అదే కరెక్ట్ అనిపించింది.’’ ‘‘ఆ మరేం చేశావు?’’ ‘‘ఈ విషయం మా నాన్నతో చెప్పాను. మా నాన్న కూడా సరే మంచి ఆలోచనే అన్నాడు. హోటల్ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే...’’ ‘‘ఏమైంది?’’ ‘‘వారం తర్వాత మా నాన్నకు ఎవరో సలహా ఇచ్చారట.’’ ‘‘ఏంటి?’’ ‘‘వంట తయారు చేయడం వేరు, అమ్మడం వేరు. ఇది వ్యాపారం. ముందు వ్యాపార కిటుకులు తెలుసుకోమను. ఏదైనా హోటల్లో అన్ని పనులు చేస్తూ అనుభవం సంపాదించమను అని ఒక పనికిమాలిన అభిప్రాయం వ్యక్తం చేశారట.’’ ‘‘పనికిమాలినది ఎందుకవుతుంది, పనికొచ్చేదే.’’ ‘‘పనికొచ్చేదేనని మా నాన్న మాట విని ఒక పెద్ద హోటల్లో చేరాను.’’ ‘‘మంచి నిర్ణయం.’’ ‘‘సరే అక్కడ అన్ని రకాల పనులు చేస్తుంటే...’’ ‘‘ఆ.. చేస్తుంటే...’’ ‘‘ఒకరోజు ఒక అమ్మాయి పొద్దున్నే టిఫిన్ తినడానికి హోటల్‌కు వచ్చింది.’’ ‘‘అమ్మాయి బావుంటుందా?’’ ‘‘చక్కని చుక్క.’’ ‘‘ఓహో! అయితే లవ్వా?’’ ‘‘వినండి, ఆ అమ్మాయిని చూడగానే గుండె గడబిడ చేసినట్టనిపించింది.’’ ‘‘ఒళ్లు పులకరించడం, షాక్ కొట్టినట్టనిపించడం, బుర్ర గిర్రున తిరిగినట్టనిపించడం..!’’ ‘‘నిజమే అలాగే అనిపించింది. మీకెలా తెలుసు?’’ ‘‘ఎన్ని సినిమాల్లో చూళ్లేదయ్యా. తర్వాత ఏమైంది?’’ ‘‘ఆ అమ్మాయి ప్లేట్ చపాతీ ఆర్డర్ ఇచ్చింది.’’ ‘‘ఇక్కడా మళ్లీ చపాతీనా?’’ ‘‘అమ్మాయి కోసం చపాతీని నెయ్యితో స్పెషల్‌గా తయారుచేసి, ఆలూ కుర్మానూ, వేడివేడి సాంబార్నూ వడ్డించాను.’’ ‘‘చపాతీ నీ లైఫ్‌ను ఏమో చెయ్యబోతోంది అన్నమాట.’’ ‘‘అమ్మాయి తింటుంటే చూశాను, ఆవిడ మొహంలో ఒక రకమైన మార్పు కనబడింది. నాకు అర్థమైంది.. అమ్మాయి ఇంతవరకూ ఇంత రుచికరమైనది తినలేదని!’’ ‘‘ఫేస్ రీడింగ్ కూడా వచ్చా నీకు!’’ ‘‘ఆ మాత్రం అర్థం చేసుకోవడానికి ఫేస్ రీడింగ్ ఎందుకండి?’’ ‘‘సరే సరే తర్వాత ఏమైందో చెప్పు.’’ ‘‘అలా... అలా... రోజూ సరిగ్గా పొద్దున్నే వచ్చేది. నేను ఆవిడ ఇచ్చిన ఆర్డర్‌ను సర్వ్ చేసేవాడిని, ఆవిడ లొట్టలు వేసుకుంటూ తినేది.’’ ‘‘ఓహో!’’ ‘‘ఒకరోజు సినిమాకెళ్లాను. అక్కడ అమ్మాయి టికెట్టు దొరకకుండా నిరాశగా ఎదురుచూడసాగింది.’’ ‘‘నువ్వెళ్లి హీరోలాగా నీ టికెట్టు ఇచ్చావా?’’ ‘‘నా టికెట్టు ఎందుకిస్తానండి! బ్లాకులో కొని అమ్మాయికిచ్చాను. ఆవిడ ఆశ్చర్యంగా హోటల్లో సర్వర్‌గా పనిచేసే నువ్వు ఇంత పెద్ద థియేటర్‌కు ఎలా వచ్చావు అని అడిగింది.’’ ‘‘నీ బ్యాక్‌గ్రౌండ్ తెలియదు కదా! అందుకే అడిగింది.’’ ‘‘నేను నా విషయాలన్నీ చెప్పాను. తర్వాత పెద్ద హోటల్ పెట్టబోతున్నాను. ట్రైనింగ్ కోసం పనిచేస్తున్నానని చెబితే చాలా సంతోషపడింది.’’ ‘‘నీ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది.’’ ‘‘నా మీదే కాదు, ఆవిడ మీద నాక్కూడా పెద్ద అభిప్రాయం ఏర్పడింది. ఆ అమ్మాయి విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీరట. నెలకు డెబ్భై అయిదు వేలట.’’ ‘‘అబ్బో!’’ ‘‘అయినా మా మధ్య పరిచయం అలా అలా పెరిగింది. ఆవిడ నా చేతి వంట తినకుండా ఉండలేనట్టుగా తయారైంది. నేను కూడా ఎప్పుడు తెల్లవారుతుందా, ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేటట్టు తయారయ్యాను.’’ ‘‘ప్రేమ మహత్యం.’’ ‘‘ఇద్దరి మధ్య ప్రేమ ముదిరి పాకాన పడింది. పెళ్లికి ఎవరూ అడ్డు చెప్పడం లేదు.’’ ‘‘పెళ్లి చేసుకున్నారా?’’ ‘‘ఎక్కడ చేసుకున్నామండి! ఇక్కడే ఆవిడ పెట్టిన షరతుతో ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతూ తల బాదుకుంటున్నాను.’’ ‘‘షరత్తా. ఏంటది?’’ ‘‘పెళ్లి చేసుకోవాలంటే హోటల్ పెట్టకూడదట. నేను కేవలం ఆవిడ కోసం తప్ప వేరేవారికి వంట చేయకూడదట. నా వంట ఆవిడ ఒక్కదానికే సొంతం కావాలట.’’ ‘‘‘నా మొగుడి వంట నాకొక్కదానికే సొంతంలా అన్నమాట.’’ ‘‘ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.’’ ‘‘ఇంత చిన్న విషయానికి ఇంత నసనా? చక్కగా పెళ్లి చేసుకోవయ్యా.’’ ‘‘ఎట్లా చేసుకోవాలండి! మగాడు ఇంట్లో వంట చేస్తుంటే జనం ఏమంటారండి? చూసి నవ్వరా?’’ ‘‘నవ్వితే నవ్వనీ! వాళ్లు నవ్వుతున్నారని నీ ప్రేమని కాదంటావా? అమ్మాయిని చేసుకోవా?’’ ‘‘అమ్మాయిని చేసుకోవడం గ్యారెంటీ అనుకోండి. కాని ఏం చెయ్యాలి, ఎలా అని?’’ ‘‘ఏమీ ఆలోచించకు, ముందు పెళ్లి చేసుకో. అమ్మాయికి చక్కగా వండిపెట్టు. వడ్డించు, కాలు మీద కాలు వేసుకొని కాలం గడిపేయి.’’ ‘‘అంతేనా?’’ ‘‘దీనికి ఇంత ఆలోచిస్తావేంటయ్యా. వెళ్లు. పెళ్లి చేసుకో. ఇంకేం ఆలోచించకు. ఇలాంటి అదృష్టం అందరికీ రాదు. అందరు ఆడవాళ్లూ వంటింట్లో వంట చేస్తుంటే ఎలా, నీలాంటి వాడు కూడా ఒకరుండాలి!’’ ‘‘చేసుకుంటే ఎలా ఉంటుందా అని!’’ ‘‘చేసుకో, బాగానే ఉంటుంది. వెళ్లు.’’ ‘‘సరే మీరు చెప్పారు. తప్పకుండా పెళ్లి చేసుకుంటా.’’ ‘‘అదీ... అలా డేర్ చెయ్యి. ఇంతకీ అమ్మాయి పేరు?’’ ‘‘సత్యభామ.’’ ‘పెళ్లి చేసుకున్నారా?’’ ‘‘ఎక్కడ చేసుకున్నామండి! ఇక్కడే ఆవిడ పెట్టిన షరతుతో ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతూ తల బాదుకుంటున్నాను.’’ ‘అమ్మాయి తింటుంటే చూశాను, ఆవిడ మొహంలో ఒక రకమైన మార్పు కనబడింది. రుచిని ఆస్వాదించసాగింది నాకు అర్థమైంది. అమ్మాయి ఇంతవరకూ ఇంత రుచికరమైనది తినలేదని!’’ -అల్లం శశిధర్