
సాక్షి, హైదరాబాద్ : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంట నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రానికి సంబంధించి మరో సాంగ్ గురువారం విడులైంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ అందమైన ప్రేమ కథ చిత్రం లోని ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ‘ఏవో ఏవో కలలే’ పాటను ప్రిన్స్ మహేష్‌బాబు లాంచ్ చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్న ఈ మూవీ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా, పాటలు కూడా దుమ్ము రేపుతున్నాయి.. తాజాగా రెయిన్ సాంగ్‌తో దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన స్టైల్‌ను చూపించాడు. భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యానికి, పవన్ సిహెచ్ స్వరాలు కూర్చగా జోనితా గాంధీ, నకుల్ అభ్యాంకర్ ఆలపించిన ఈ గీతం టాక్ ఆఫ్‌ది లవర్స్‌గా నిలుస్తోంది. దీనికి తోడు నా ఫ్యావరేట్ సాంగ్ వచ్చేసిందోచ్ అంటూ సమంతా అక్కినేని ట్వీట్ చేయడం విశేషం.
తాజా పాటలో మలయాళ బ్యూటీ సాయి పల్లవి తన డ్యాన్స్ మ్యాజిక్‌తో ఆకట్టుకోవడం ఖాయం. ఇప్పటికే దీనికి సంబంధించిన లుక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, సాయిపల్లవి వర్షంలో లుక్స్‌కి ఫ్యాన్స్‌ను ఫిదా అవుతున్నారు. అటు మహేష్ చేతులమీదుగా నాగచైతన్య లవ్ స్టోరీ సాంగ్ రిలీజ్ కావడం అభిమానుల్లో మరింత జోష్ ను నింపింది. దీనికి తోడుఇటీవల విడుదలైన సెన్సేషనల్ ‘సారంగ దరియా’ సాంగ్ సృష్టించిన సంచలనంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.. ఏప్రిల్ 16న థియేటర్లను పలకరించేందుకు రడీ అవుతోంది.
Yayyyyyyy ❤️❤️❤️.. My favourite song is out 💃💃💃 #EvoEvoKalale #LoveStory @chay_akkineni https://t.co/EsaXxbkxsG@pawanch19 @bhaskarabhatla@NakulAbhyankar @jonitamusic @sekharkammula @SVCLLP @sai_pallavi92 #AmigosCreations @adityamusic @niharikagajula
— Samantha Akkineni (@Samanthaprabhu2) March 25, 2021
Comments
Please login to add a commentAdd a comment