వదంతుల వలలోనయనతార | nayanatara facing problems | Sakshi
Sakshi News home page

వదంతుల వలలోనయనతార

Published Fri, Aug 8 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

వదంతుల వలలోనయనతార

వదంతుల వలలోనయనతార

కొందర్ని చూస్తే మెచ్చబుద్ధి.. మరొకర్ని చూస్తే మొత్తబుద్ధి వేస్తుందనే సామెత ఉంది. అలానే నయనతారను చూస్తే ఏవేవో రాయాలనిపిస్తుందేమో. ప్రేమ వ్యవహారాల్లో ఇంతకు ముందు సంచలనాలు సృష్టించిన ఈ బ్యూటీపై ఇటీవల మళ్లీ వదంతుల పరంపర మొదలైం ది. శింబుతో ప్రేమాయణం, ఆ తర్వాత ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్లి కథ కంచెకు చేరిన విధంగా మారిన లవ్‌స్టోరీ ఆ మధ్యలో చాలా కలకలాన్ని సృష్టించాయి. కొంత కాలంగా వీటికి దూరంగా ఉన్న నాయనపై మళ్లీ వదంతుల ప్రవాహాని కి తెరలేసింది. అందుకు కారణం ఆమె మళ్లీ తన మాజీ ప్రియుడు శింబుతో జత కట్టడమే కారణం కావచ్చు.
 
ఈ మధ్య ఆర్య సరసన రాజారాణి చిత్రం లో నటించినప్పుడు వీరిద్దరి గురించి కథలు కథలుగా ప్రచారం జరిగింది. ఆర్య నయనకు బిర్యాని విందునిచ్చారని, ఇద్దరూ నక్షత్ర హోటళ్లలో ఏకాం తంగా కలుసుకుంటున్నారని రకరకాల వదంతులు ప్రచారమయ్యాయి. అవ న్నీ వదంతులే అంటూ నయనతార ఖండించారు. తాజాగా శింబుతో సాన్నిహిత్యం గురించి మరోసారి గాసిప్సు గుప్పుమన్నాయి. వీటిపై నయనతార స్పందిస్తూ తన గురించి చాలా వదంతులు ప్రచారమవుతున్నాయన్నారు. ఆర్యను ప్రేమిస్తున్నట్లు, శింబుతో షికార్లు అంటూ ఇష్టమొచ్చినట్లు రాసేస్తున్నారన్నారు. వీటిలో ఏదీ నిజం కాదని చెప్పారు. తాము నటులమ ని, వృత్తిపై అంకితభావం చూపిస్తున్నామని అన్నారు.
 
ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతామన్నారు. అంతేకానీ తమ మధ్య  ఎలాంటి సం బంధం లేదని స్పష్టం చేశారు. అయి తే ఇలాంటి వదంతులకు కొందరు న టీనటులు ఇష్టపడతారనే అభిప్రాయా న్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా బా లీవుడ్ తారలు ఇలాంటి గ్యాసిప్స్‌ను ప్రచారం చేస్తారని, తద్వారా వారు ఫలం పొందుతున్నట్లు చెబుతారని అన్నారు. అందువల్లే తమ గురిం చి వదంతులు ప్రచారం అయినప్పటికీ ఆనందిస్తారన్నారు. ఆ సంస్కృతి ఇప్పుడు కోలీవుడ్ లో మొదలయ్యిందని అన్నా రు. తెలుగులో ఇలాంటి పరిస్థితి లేదని నయనతార తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement