చలో హైదరాబాద్ | nayanatara life employ a variety of interesting items | Sakshi
Sakshi News home page

చలో హైదరాబాద్

Published Fri, Apr 11 2014 1:17 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

చలో హైదరాబాద్ - Sakshi

చలో హైదరాబాద్

 సంచలనాలకు కేంద్ర బిందువు నయనతార. నటిగానే కాదు, వ్యక్తిగతంగాను ఈమె జీవితం పలు ఆసక్తికర అంశాలకు కొలువు. మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు, ఆ తరువాత టాలీవుడ్‌కు మళ్లీ కోలీవుడ్‌కు అంటూ నటిగా పల్టీలు కొడుతున్న నయనతార తాజాగా తన నివాసాన్ని హైదరాబాదుకు మార్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శింబు, ప్రభుదేవాతో ప్రేమ బెడిసికొట్టడంతో నయనతార నటనకు కొంతకాలం దూరంగా ఉన్నారు.
 
తరువాత కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చి ఆరంభం, రాజారాణి, ఇదు కదిర్‌వేలన్ కాదల్ అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామకు మళ్టీ టాలీవుడ్‌లో పలు అవకాశాలు వస్తున్నాయట. ప్రస్తుతం అనామిక (తమిళంలో ఎంగే నీ ఎన్ అన్భే) చిత్రంలో నటిస్తున్న నయనతారకు వెంకటేష్, నాగార్జున, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయట.
 
అదే విధంగా తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నన్భేండా చిత్రంలో నటిస్తున్నారు. శింబుతో ఇదు నమ్మా ఆళు, జయంరవి సరసన ఒక చిత్రం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో నయన హైదరాబాద్ మకాం మార్చనుందనే ప్రచారం జోరందుకుంది.
 
 కాంగ్రెస్ గాలం : నయనతారను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే తమిళనాడు, ఢిల్లీ కాంగ్రెస్ ముఖ్య నేతలు నయనతారతో రహస్య చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. నయనతార  క్రేజ్‌ను వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.
 
అయితే ఇందుకు నయనతార సుముఖంగా లేదు. సినిమాలతో బిజీగా ఉన్న ఈమె రాజకీయ ప్రచారాలకు సమయం కేటాయించలేని పరిస్థితి.  ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న నయనతార ఇప్పుడు ఒక పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తే మరోపార్టీ వాళ్లు దుమ్మెత్తి పోస్తారని భయపడుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement