Jodha Akbar
-
క్వీన్ ఐశ్వర్య ‘ఐకానిక్ లెహంగా' ఆస్కార్ మ్యూజియానికి
అద్భుతమైన ఒక డిజైనర్ లెహంగా మరో అద్భుతాన్ని సాధించడం ఎక్కడైనా విన్నారా? నీతా లుల్లా రూపొందించిన లెహంగా అలాంటి ప్రత్యేకతను సంతరించుకుంది. బాలీవుడ్ జోధా అక్బర్ మూవీలో, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai) పాత్ర కోసం నీతా లుల్లా డిజైన్ చేశారు. దీన్ని ఇపుడు ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా చూడగలిగేలా ప్రతిష్టాత్మక ఆస్కార్ మ్యూజియంలో కొలువు దీరింది. ఈ విషయాన్ని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) అకాడమీ మ్యూజియం కలర్ ఇన్ మోషన్ ఎగ్జిబిషన్లో సినిమాలో క్వీన్ ఐశ్వర్య ధరించిన దుస్తులే కాకుండా ఆమె ఆభరణాలు కూడా బొమ్మపై రూపొందించారు. ఈ విషయాన్ని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది.దీంతో ఈ లెహెంగాను రూపొందించిన నీతా లుల్లా నైపుణ్యం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.A lehenga fit for a queen, designed for the silver screen.In JODHA AKBAR (2008), Aishwarya Rai Bachchan’s red wedding lehenga is a feast for the eyes: vibrant zardozi embroidery, centuries-old craftsmanship, and a hidden gem—quite literally. Look closely and you’ll spot a… pic.twitter.com/UfUYxTeP22— The Academy (@TheAcademy) December 24, 2024 > ఐకానిక్ రెడ్ లెహెంగా,నగల విశేషాలివేజర్దోజీ ఎంబ్రాయిడరీ , శతాబ్దాల నాటి హస్తకళా నైపుణ్యం ఈ లెహెంగాలో దాగి ఉంది. ఇదే విషయాన్ని అకాడమీ తన పోస్ట్‌లో పేర్కొంటూ, ప్రశంసింయింది. నటి ధరించిన ఆభరణాలు మరింత ఆకర్షణగా ఉన్నాయి. ఆమె ధరించిన నెక్లెస్ మధ్యలో నీలం రాళ్లతో భారతదేశ జాతీయ పక్షి నెమలి మరో ఎట్రాక్షన్.జోధా అక్బర్ (Jodha Akbar) "రాణికి సరిపోయే లెహంగా, వెండితెరపై ఎంతోమందిని ఆకర్షించింది ఇకపై ఆస్కార్ మ్యూజియంలో కొలువు దీరనుంది అని అకాడమీ తెలిపింది. కాగా 2008లో అశుతోష్ గోవార్కర్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘జోధా అక్బర్’. ఐశ్వర్య 'జోధా బాయి' పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీలో హీరోగా హృతిక్ రోషన్ నటించారు. వీరి రాయల్ లుక్‌కోసం రాజస్తానీ, మొఘల సంస్కృతుల మేళవింపుతో అసలు సిసలు బంగారం, విలువైన రాళ్లతో మొత్తం 400 కిలోల ఆభరణాలను తయారు చేయించారన. ఇందులో 200 కిలోల ఐశ్వర్య ప్రాతకోసం. ఈ మొత్తం ఆభరణాల తయారీకి 70 మంది కళాకారులు రెండేళ్ల పాటు శ్రమించారని చెబుతారు. -
ఆగంతకుడి దాడి, రక్తసిక్తమైన నటుడు.. వీడియో వైరల్
కాలిఫోర్నియా: జోధా అక్బర్సహా పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించిన యువ పంజాబీ నటుడు అమన్ ధలివాల్‌పై అమెరికాలో ఒక ఆగంతకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఛాతీ, మెడ, తల, భుజంపై పలు చోట్ల తీవ్రంగా గాయపరిచాడు. ఘటన తర్వాత అమన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం ఏమీలేదని వైద్యులు తెలిపినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. గురువారం ఉదయం కాలిఫోర్నియా నగరంలోని గ్రాండ్ ఓక్స్ ప్రాంతంలోని ఒక జిమ్‌లో కసరత్తు చేస్తున్న అమన్పైకి ఒక ఆగంతకుడు కత్తితో దాడి చేసి బందీగా పట్టుకున్నాడు. తాగడానికి నీళ్లు కావాలని అక్కడి వారిని ఆగంతకుడు బెదిరించిన సమయంలో ఒక్కసారిగా అమన్ ఎదురుతిరిగి అతడిని పట్టుకోబోయాడు. ఈ ఘర్షణలో అమన్ గాయాలపాలై రక్తసిక్తమయ్యాడు. వెంటనే అప్రమత్తమైన జిమ్‌లోని తోటివారు ఆ ఆగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అమన్‌పై ఆగంతకుడు దాడి దృశ్యం ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://twitter.com/ShekharPujari2/status/1636306115502931968 -
కుడి కాలు పోగొట్టుకున్న బుల్లితెర నటుడు
Lokendra Singh: అనారోగ్యంతో బాధపడుతున్న బుల్లితెర నటుడు లోకేంద్ర సింగ్ రాజవత్‌కు వైద్యులు ఒక కాలు తొలగించారు. రక్తపోటు, తీవ్ర ఒత్తిడి, డయాబెటిస్ వంటి సమస్యల కారణంగా మోకాలి వరకు కాలును తీసేయాల్సి వచ్చిందని అతడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. "నా కుడి పాదంలో చిన్న కణతి ఏర్పడింది. మొదట నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అది ఇన్ఫెక్షన్లా మారి ఎముక మజ్జలోకి వ్యాపించింది. తర్వాత కండరాల్లోని మాంసాన్ని తినేసే గాంగ్రేన్ ఎటాక్ అయింది. వీటి నుంచి నన్ను నేను రక్షించుకోవడానికి మోకాలి వరకు కాలును తీసేయక తప్పలేదు. నిజానికి పదేళ్ల క్రితం మధుమేహం బారిన పడినప్పుడే నా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుని ఉండుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదేమో" అని చెప్పుకొచ్చాడు. ఇక కరోనా తర్వాత అవకాశాలు తగ్గడంపై ఆయన మాట్లాడుతూ.. 'కోవిడ్‌కు ముందు చేతినిండా పనుండేది. కానీ రానురానూ అవి తగ్గుతూ వచ్చాయి. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కానీ సింటా(సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎంతో కొంత సాయం చేసింది. కొంతమంది నటీనటులు నాకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ మనోధైర్యాన్ని అందిస్తున్నారు' అని తెలిపాడు. ఇదిలా వుంటే లోకేంద్రసింగ్ ప్రముఖ ధారావాహిక 'జోధా అక్బర్'తో పాటు 'యే హై మొహబ్బతే', 'సీఐడీ', 'క్రైమ్ పెట్రోల్' వంటి సీరియళ్లలోనూ నటించాడు. సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన 'మలాల్' సినిమాలోనూ కనిపించాడు. -
ఆ సీన్లో ఆడ ఏనుగులనే ఎందుకు వాడారో తెలుసా?
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ల పీరియాడికల్ డ్రామా మూవీ ‘జోదా అక్బర్’ విడుదలై నిన్నటికి 13 ఏళ్లు. నిర్మాత అశుతోష్ గోవరికర్ నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. హృతిక్, ఐశ్వర్యరాయ్‌లకు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో హృతిక్, ఐశ్యర్యల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరల్లేదు. మొఘల్ కాలంలోని జోధా అక్భర్‌ల నిజమైన ప్రేమకథా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ చిత్రపరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలోని సన్నివేశంలో డైరక్టర్ భారీ సంఖ్యలో ఏనుగులను ఉపయోగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం నిర్మాత అశుతోష్ గోవరికర్ కేవలం వంద ఆడ ఏనుగులు మాత్రమే కావాలని చెప్పినట్లు ఈ సందర్భంగా సహా నిర్మాత సునీత గౌవరికర్ తెలిపారు. ఓ పాత వీడియోను ఆమె షేర్ చేస్తూ.. నిర్మాత అశుతోష్ ఈ మూవీలో ఉపయోగించే ఏనుగులు కేవలం ఆడవే అయ్యిండాలని చెప్పారు. ఇందుకు ఆయనకు వంద ఆడ ఏనుగులు కావాలని డిమాండ్ చేసినట్లు ఈ వీడియోలో ఆమె చెప్పుకొచ్చారు. అయితే అశుతోష్ నిర్ణయం విని ఆమె షాకయ్యానన్నారు. వెంటనే వంద ఆడ ఏనుగులే కావాలంటున్నారని ఆయను అడగడంతో ఆయన చెప్పిన సమాధానికి ఆశ్చర్యపోయానని చెప్పారు. దీనికి ఆయన మగ ఏనుగులు తొందరగా కోపానికి లోనవుతాయి. వాటివల్ల షూటింగ్‌లోని ప్రజలందరికి ప్రమాదం ఉండోచ్చని, అందుకే కేవలం 100 ఆడ ఏనుగులతోనే షూటింగ్ చేయాలనుకున్నట్లు ఆయన సమాధానం ఇచ్చారన్నారు. అంతేగాక ఆ ఏనుగులు అన్ని కూడా ఒకే పరిమాణంలో ఉండాలని తనతో చెప్పారన్నారు. షూటింగ్లో ఆయన వాటిని ఆ పేరు కూడా పెట్టారని వాటిన ఆ పేరుతోనే పిలిచేవారని పేర్కొన్నారు. అయితే ఆయన ప్రతి విషయంలో ఆశుతోష్ పర్‌ఫక్ట్‌గా ఉంటారడానికి ఈ సంఘటన మరోసారి రుజువు చెసిందని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే హీరో హృతిక్ రోషన్ కూడా మూవీ కొన్ని సన్నివేశాలను షేర్ చేస్తూ ఈ చిత్రం సమయంలోని జ్ఞపకాలను గుర్తు చేసుకున్నారు. ‘ఓ వ్యక్తి ఈ చిత్రం నటించడమంటే సాధారణ విషయం కాదు. మొదట ఆశుతోష్ నాతో ఈ మూవీ గురించి చెప్పినప్పడు బయపడ్డాను. నాతో పాటు ఓ వెయ్యి మంది సైనికులను ఆయన ఎలా నడిపించగలడు అనుకున్న. చివరికి ఆయన చేశారు’ అంటూ హృతిక్ రాసుకొచ్చారు. -
నేడు 'పద్మావతి' నాడు ఎన్నో....
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్‌లీలా బన్సాలీ తీసిన బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' విడుదలను నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ, దానికి వ్యతిరేకంగా దేశంలో ఏదో చోట గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ సినిమాకు వ్యతిరేకంగా ఇలా గొడవలు జరగడం దేశంలో ఇదే మొదటి సారి కాదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా తమ మనోభాలకు విరుద్ధంగా ఉందంటూ ఏదో సినిమాకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఆందోళనలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఓసారి హిందూ కమ్యూనిటీ వారు గొడవలు చేస్తే మరోసారి ముస్లిం కమ్యూనిటీ వారు, మరోసారి మరో కమ్యూనిటీ వారు గొడవలు చేయడం మామూలయింది. భావ ప్రకటనా స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన చలనచిత్ర సర్టిఫికేట్ బోర్డు కలిగి ఉన్నా, సినిమాలపై గొడవలు చేయడం కొన్ని వర్గాలకు రివాజుగా మారిపోయింది. ఇప్పుడు పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్న రాజస్థాన్‌లోని రాజ్‌పుత్ కర్ణిసేన ఇంతకుముందు 2008లో అశుతోష్ గోవారీకర్ తీసిన బాలీవుడ్ చిత్రం జోధా అక్బర్ చిత్రాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సినిమాలో హృతిక్ రోషన్ ముఘల్ చక్రవర్తి అక్బర్గాను, ఐశ్వర్యరాయ్ ఆయన భార్య జోధాగాను నటించారు. తమ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ వారు గొడవ చేయడంతో అప్పడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజస్థాన్‌లో సినిమా విడుదలను నిషేధించింది. అప్పుడు బహుజన సమాజ్‌వాది అధికారంలో ఉన్న యూపీలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హర్యానాలో, బీజీపీ ఆధీనంలోని ఉత్తరాఖండ్‌లో కూడా ఈ సినిమా విడుదలను నిషేధించారు. 1975లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంపై అమృత్ నహతా నిర్మించిన వ్యంగ్య చిత్రం 'కిస్సా కుర్సీ కా' పై కాంగ్రెస్ యువజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి కాంగ్రెస్ యువజన నాయకుడు సంజయ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ సినిమా ప్రింట్లనే కాకుండా ఒరిజనల్ నెగెటివ్ ప్రింట్‌ను కూడా దగ్ధం చేశారు. ఆ తర్వాత 1978లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నహతా ఆ సినిమాను పునర్మించి విడుదల చేశారు. గొడవ, రాజకీయ జోక్యం వల్ల మణిరత్నం తీసిన 'బాంబే' సినిమా కూడా ఆలస్యంగా విడుదలయింది. అందులో హిందూ హీరోకు ముస్లిం భార్యకు మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించడాన్ని ముస్లిం వర్గాలు వ్యతిరేకించాయి. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం చెలరేగిన ముంబై అల్లర్ల నేపథ్యంలో సినిమా తీయడం, అప్పటి శివసేన చీఫ్ బాల్‌ఠాక్రేను పోలిన పాత్రలో టూ ఆనంద్‌ను చూపించడం వివాదాస్పదమైంది. ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించాకనే ఆ సినిమా విడుదలను హిందూ సంఘాలు అనుమతించాయి. దాంతో 1995, మార్చి 10వ తేదీన ఆ సినిమా విడుదలయింది. ఆ సినిమా అప్పుడు సూపర్ హిట్టయింది. 1998లో విడుదలయిన దీపా మెహతా తీసిన చిత్రం 'ఫైర్' కూడా ప్రకంపనలు సృష్టించింది. ఇద్దరు మహిళల మధ్య స్వలింగ సంపర్కాన్ని చూపించడం పట్ల కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అది మన సంస్కృతి కానందున ఆ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశాయి. ఆ సినిమాకు వ్యతిరేకంగా ముంబై, ఢిల్లీ, సూరత్, పుణెలలో శివసేన, భజరంగ్ దళ్లు ఆందోళన చేశాయి. సినిమా థియేటర్లను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాను పునస్సమీక్షకు సెన్సార్ బోర్డుకు ప్రభుత్వం మళ్లీ పంపించిగా, రెండోసారి కూడా ఎలాంటి కత్తిరింపులు లేకుండా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించింది. అయినప్పటికీ వారు దీపా మెహతను మరచిపోలేదు. ఆమె షబానా ఆజ్మీ, నందితా దాస్, అక్షయ్ కుమార్‌తో కలసి తన 'వాటర్' చిత్ర నిర్మాణం కోసం 2000 సంవత్సరంలో వారణాసికి వెళ్లారు. అక్కడ ఆమె సిట్టింగ్‌లనూ హిందూ మూకలు దగ్ధం చేయడమే కాకుండా ఆమె దిష్టిబొమ్మలను తగులబెట్టి నదిలో పడేశారు. అక్కడ ఒక్క షాట్‌ను మాత్రమే తీయగలిగినా దీపా మెహతా తన పూర్తి చిత్రాన్ని ఇతర నటీ నటులతో శ్రీలంకలో పూర్తి చేశారు. ఇక అనిల్ శర్మ తీసిన 'గదర్-ఏక్ ప్రేమ్ కహాని' కమల్‌హాసన్ నటించిన 'విశ్వరూపం' బన్సాలీ తీసిన 'బాజీరావ్ మస్తానీ' సినిమాలన్నీ వివాదాస్పదమయ్యాయి. వాటన్నింటికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనలన్నీ కూడా సినిమాలు బాగా ఆడేందుకే ఉపయోగపడ్డాయి. -
ఒళ్లంతా బంగారమే!
‘రుద్రమదేవి’ చిత్రంలో ఓ ఎపిసోడ్లో అనుష్క గెటప్ ఇది. ఇందులో ఆమె ఒళ్లంతా బంగారమే. అదీ... మేలిమి బంగారం. ఆ నగల విలువే 5 కోట్ల రూపాయలు. ‘జోథా అక్బర్’ అనే హిందీ సినిమా తర్వాత నిజమైన బంగారు ఆభరణాలు వాడిన చారిత్రక చిత్రం ఇదే. స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.