రజనీ ఫ్యాన్స్‌కు ‘కార్బన్’ కానుక | Karbonn Kochadaiiyaan signature phone series: The Rajinikanth overdose | Sakshi
Sakshi News home page

రజనీ ఫ్యాన్స్‌కు ‘కార్బన్’ కానుక

Published Sat, Mar 1 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

Karbonn Kochadaiiyaan signature phone series: The Rajinikanth overdose

చెన్నై, సాక్షి ప్రతినిధి : సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులను అలరించేరీతిలో ప్రముఖ మొబైల్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ ‘కార్బన్’ కోచ్చడయాన్ సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్లను శుక్రవారం తమిళనాడు మార్కెట్‌లోకి విడుదల చేసింది. కార్బన్ ఏ 36, కార్బన్ ఏ 6 ప్లస్ అనే 2 ఆండ్రాయిడ్ ఫోన్లను రూపొందించింది. అదే విధంగా ద లెజెండ్ 2.4, ద లెజెండ్ 2.8 అనే మరో రెండు ఫీచర్ ఫోన్లను కూడా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లలో కోచ్చడయాన్ పాటలు, వీడియోలు, ట్రైలర్స్, వాల్ పేపర్లు ఉంటాయి.  ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు, రజనీకాంత్ కుమార్తె సౌందర్య మీడియాతో మాట్లాడుతూ తన చిత్రంతో ఈ తరహా సిగ్నేచర్ స్మార్ట్ మొబైల్స్‌ను రూపొందించినందుకు కార్బన్ మొబైల్స్ సంస్థకు అభినందనలు తెలిపారు. సంస్థ చైర్మన్ హసీజ్  మాట్లాడుతూ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం వారు ఆరునెలలు కష్టపడి ఈ యూప్స్‌ను రూపొందించారని అన్నారు. మొబైల్ రంగంలో ఈ యూప్స్ కొత్త ఒరవడిని సృష్టించగలవని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement