కార్బన్‌ ‘కే9 కవచ్‌ 4జీ’ @రూ.5,290 | Karbonn K9 Kavach 4G: An entry level smartphone | Sakshi
Sakshi News home page

కార్బన్‌ ‘కే9 కవచ్‌ 4జీ’ @రూ.5,290

Published Wed, Jul 5 2017 1:16 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

కార్బన్‌ ‘కే9 కవచ్‌ 4జీ’  @రూ.5,290 - Sakshi

కార్బన్‌ ‘కే9 కవచ్‌ 4జీ’ @రూ.5,290

న్యూఢిల్లీ:  కార్బన్‌ మొబైల్స్‌ తాజాగా ‘కే9 కవచ్‌ 4జీ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.5,290. భీమ్‌ డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ ఇన్‌ బిల్ట్‌గా వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇది. ఈ ఫీచర్‌ కోసం కంపెనీ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

‘కే9 కవచ్‌ 4జీ’ స్మార్ట్‌ఫోన్స్‌ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మార్గాల్లో కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. నుగోట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌లో 5 అంగుళాల డిస్‌ప్లే, 1.25 గిగాహెర్ట్‌›్జ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 5 ఎంపీ రియర్‌ అండ్‌ ఫ్రంట్‌ కెమెరాలు, 2,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement