Karbonn
-
కార్బన్ స్మార్ట్‌ఫోన్: ట్విన్‌ఫై కెమెరా, బడ్జెట్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: కార్బన్ మొబైల్స్ బడ్జెట్ ధరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘ఫ్రేమ్స్ ఎస్ 9’ను దీన్ని విడుదల చేసింది. ‘ట్విన్‌ఫై కెమెరా’తో అనుసంధానించిన ఈ డివైస్ ధరను రూ. 6,790 గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు ఇతర మొబైల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఎయిర్టెల్ ద్వారా రూ.2వేల క్యాష్ బ్యాక్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకు ఎయిర్టెల్ కస్టమర్లు 18 నెలల్లో 3500 రూపాయల రీచార్జ్ చేసుకోవాల్సి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎయిర్టెల్ స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. 169 రూపాయల రీచార్జ్‌పై అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం. 28 రోజుల పాటు 1 జీబీ 3/4జీ డేటా ఉచితం. కార్బన్ ఫ్రేమ్స్ ఎస్ 9 ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1.25 గిగా హెడ్జ్ కార్డ్‌కోర్ ప్రాసెసర్ 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 2900(లి-పోలీ) ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆ ఫోన్లపై ఐడియా క్యాష్ బ్యాక్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజాలు భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ తరహాలో మరో దిగ్గజం ఐడియా సెల్యులర్ కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లపై ఈ ఆఫర్‌ను ప్రకటించింది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్‌లాంటి ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ తాజా ఆఫర్లను లాంచ్ చేసింది.ఈ ఆఫర్ ద్వారా సరసమైన ధరలో మంచి నాణ్యమైన 4జీ ఫోన్లను కస్టమర్లకు అందించాలనేది తమ ఉద్దేశమని ఐడియా ఎండీ శశి శంకర్ ప్రకటించారు. ఇండియాలో 4జీ నెట్వర్క్ విస్తరిస్తుందని భావిస్తున్నామన్నారు. ఇందుకు కార్బన్‌తో భాగస్వామ్యం సంతోషంగా ఉందన్నారు. కార్బన్ స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లపై అందిస్తున్న ఈ ఆఫర్ 2018 ఫిబ్రవరి 1 నుంచి అమలుకానుంది. ముఖ్యంగా కార్బన్ యువ 2 4జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2వేల దాకా క్యాష్‌బ్యాక్ ఆఫర్. స్మార్ట్ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ కార్బన్ ఎ 41 పవర్, ఎ9 ఇండియన్ (ధర రూ. 2,999, ఎ 9 ధర రూ. 3,699) ఈ రెండిటింపై రూ. 1,500 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే దీనికి ఐడియా మనీ వాలెట్ ద్వారా 169 రూపాయల ప్యాక్, (అన్లిమిటెడ్ కాల్స్, 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితం వాలిడిటీ 28రోజులు)18 నెలలపాటు రీచార్జ్ చేసుక్ను అనంతరం తొలివిడతగా రూ. 500 , 36నెలల రీచార్జ్ పూర్తయిన తరువాత మిగిలిన వెయ్యి రూపాయల క్యాష్‌బ్యాక్ అందుతుంది. ఫీచర్ ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ కార్బన్ కె310ఎన్, కె24ప్లస్, కె9 జంబో ఫీచర్ ఫోన్లను రూ.999, రూ.1,199 రూ. 1,399 ధరకే అందిస్తుంది. అంటే రూ 1,000 క్యాష్ బ్యాక్ తరువాత . ఐడియా వినియోగదారులకు కె310 ఫీచర్ ఫోన్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు లెక్క ( 36 నెలల రీచార్జ్‌ల తరువాత). గమనించాల్సిన అంశం ఏమిటంటే..టాక్ టైం రూపంలో ఈ క్యాష్ బ్యాక్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. -
షావోమికి ఝలక్.. టైటానియం జంబో స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ కార్బన్ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. టైటానియం సిరీస్ కొనసాగింపుగా ‘కార్బన్ టైటానియం జంబో’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ఎంఆర్పీ ధర రూ.7,490 కాగా, మార్కెట్ ఆపరేటింగ్ ధర కింద రూ.6,490కే అందించనున్నట్టు కార్బన్ ప్రకటించింది. అలాగే ఫోన్‌తో పాటు ప్యానల్ కవర్‌ను కూడా ఉచితంగా సంస్థ అందిస్తోంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి తమ తాజా ఫోన్ ప్రత్యేకత అనీ స్టాండ్‌బై మోడ్‌లో 400 గంటల టాక్‌టైమ్, 16గంటల పాటు బ్యాటరీ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. దీంతో స్పీడ్ , కెమెరా, ధరతో పోల్చుకుంటే.. ఈ డ్యుయల్ సిమ్ టైటానియం జంబో..షావోమి రెడ్మి 4 మొబైల్‌కు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. టైటానియం జంబో ఫీచర్లు 5 అంగుళాల స్క్రీన్ 1.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 2జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్...తక్కువ ధరలో
కార్బ్న్ బడ్జెట్ ధరలో మరోనూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ నెల ప్రారంభంలో ఆరా నోట్ ను గమనికను ప్రారంభించిన తర్వాత, కార్బన్ ఇప్పుడు ఇండియాలో ఎ 41 పవర్ ను ప్రారంభించింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారిత 4జీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వెబ్సైట్లో దర్శనమిచ్చింది. అయితే సంస్థ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ బ్లాక్-షాంపైన్, బ్లాక్-రెడ్, మరియు వైట్-షాంపన్ మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది. రూ.4,099కే ఈ ఫోన్ వినియోగదారులకు లభించనుంది. కార్బన్ ఎ41 పవర్ ఫీచర్లు 4 ఇంచ్ డిస్ప్లే 480 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ 1 జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజ్ 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 0.3మెగాపిక్సెల్ వీజీఏ సెల్ఫీ కెమెరా 4జీ వీవోఎల్టీఈ 2300 ఎంఏహెచ్ బ్యాటరీసామర్ధ్యం -
కార్బన్ ‘కే9 కవచ్ 4జీ’ @రూ.5,290
న్యూఢిల్లీ: కార్బన్ మొబైల్స్ తాజాగా ‘కే9 కవచ్ 4జీ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.5,290. భీమ్ డిజిటల్ పేమెంట్ యాప్ ఇన్ బిల్ట్‌గా వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫీచర్ కోసం కంపెనీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘కే9 కవచ్ 4జీ’ స్మార్ట్‌ఫోన్స్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ మొబైల్ హ్యాండ్‌సెట్‌లో 5 అంగుళాల డిస్ప్లే, 1.25 గిగాహెర్ట్›్జ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5 ఎంపీ రియర్ అండ్ ఫ్రంట్ కెమెరాలు, 2,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. -
కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్, రూ. 5,290లకే
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ తయారీదారు కార్బన్ కే 9 కవచ్ 4జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫింగర ప్రింట్ సెన్సర్‌తో వస్తున్న ఈ 4జీ మొబైల్ ధరనుకేవలం రూ.5290 కేఅందిస్తోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ యాప్‌ను ఈ డివైస్‌లో అందుబాటులో ఉంచింది. కార్బన్ కె9 కవచ్ 4జీ ఫీచర్లు 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 1 జీబీ ర్యామ్ 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 2300 ఎంఏహెచ్ బ్యాటరీ -
కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్..ధర ఎంత?
న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కార్బన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. తద్వారా తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించింది. గత వారం బడ్జెట్ ధరలో ఆరా పవర్ 3జీనులాంచ్ చేసిన కార్బన్ ఈ సిరీస్‌లో మరో కొత్త డివైస్‌ను తీసుకొచ్చింది. ఆరా పవర్ 4జీ ప్లస్ పేరుతో శుక్రవారం దీన్ని విడుదల చేసింది. దీని ధర రూ .5,790గా ప్రకటించింది. ఫ్రీ ప్రొటెక్టివ్ కవర్‌తోపాటు గ్రే అండ్ షాంపైన్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆరా పవర్ 4జీ ప్లస్ స్పెసిఫికేషన్స్ 720x1280 పిక్సెల్ రిసల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం 5 ఇంచెస్ హెచ్ డీ డిస్ప్లే క్వాడ్-కోర్ ప్రాసెసర్ 1జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ మొమరీ, 32జీబీ వరకు ఎక్స్ పాండబుల్ మొమరీ 5 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ -
మహిళా భద్రతకు శక్తివంతమైన సాధనం!
న్యూఢిల్లీః మహిళల భద్రతకు భరోసాను కల్పిస్తూ కార్పన్ మొబైల్ మరో అడుగు ముందుకేసింది. పూర్తి భద్రతా సామర్థ్యం కలిగిన పరికరాన్నిఅందించేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ దేశీయ మొబైల్ సంస్థ కార్బన్ ప్రకటించింది. మరో రెండు నెలల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పనిచేసే మొబైల్ ఎస్ ఓఎస్ అనువర్తనాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నపుడు, వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లకు అత్యవసర సందేశాలను పంపించేందుకు వీలుగా ఈ కొత్త సేఫ్టీ యాప్ పనిచేస్తుంది. మొబైల్ స్క్రీన్ పై ఒక్కసారి టాప్ చేస్తే చాలు.. కుటుంబ సభ్యులు, ఇతర అత్యవసర కాంటాక్ట్ నెంబర్లకు సమాచారం నిమిషాల్లో అందిపోతుంది. కాంటాక్ట్ నెంబర్ తో పాటుగా వారి లొకేషన్ ను కూడ ముందుగా షేర్ చేస్తే... అత్యవసర పరిస్థితుల్లో వారున్న ప్రదేశాన్ని సైతం గుర్తించేట్టుగా కార్బన్ మొబైల్ కొత్త ఫీచర్ ను అందిస్తోంది. తాజా సదుపాయంతో వినియోగదారులు అలర్ట్స్ మాత్రమే కాక అలారం మోగించే అవకాశాన్ని కూడ కల్పిస్తోంది. మొబైల్ స్క్నీన్ లాక్ ను అన్ లాక్ చేయకుండా మొబైల్ ను షేక్ చేస్తూ, పవర్ బటన్ ను నొక్కుతుంటే చాలు... అలర్ట్స్ తో పాటు, అలారం కూడ అందే సదుపాయం కార్బన్ కొత్త ఫీచర్ ద్వారా పరిచయం చేస్తోంది. 2017 జనవరి 1 నుంచి మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా పానిక్ బటన్ ఇన్ స్టాల్ చేయాలన్న ప్రభుత్వ సూచనను కార్బన్ అమల్లోకి తెచ్చింది. దీనితోపాటు అన్నిఫోన్లలో జనవరి 2018 నాటికి తప్పనిసరిగా ఇన్ బిల్ట్ జీపీఎస్ నేవిగేషన్ సిస్టమ్ ఉండాలని కూడ ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ సూచనలను హ్యండ్ సెట్ ఇండస్ట్రీ బాడీ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) కూడ స్వాగతించింది. -
కార్బన్ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ కార్బన్ తాజాగా ‘క్వాట్రో ఎల్52’, ‘టైటానియం మాక్ 6’ అనే రెండు వినూత్నమైన స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చే సింది. వీటి ధరలు వరుసగా రూ.8,790గా, రూ.7,490. కంపెనీ ఈ రెండు స్మార్ట్ఫోన్లకు వీఆర్ హెడ్‌సెట్స్ (వీఆర్ గ్లాసెస్)ను ఉచితంగా అందిస్తోంది. దీంతో కార్బన్ కూడా వీఆర్ విభాగంలోకి ప్రవేశించినట్లయ్యింది. కాగా, ఇతర మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలతో పోటీపడుతూ కార్బన్ కూడా ‘వర్చ్యువల్ రియాలిటీ’ హెడ్‌సెట్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. ♦ ‘క్వాట్రో ఎల్52’: ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల తెర, 4జీ, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,250 ఎంఏహెచ్ బ్యాటరీ, వీఆర్ యాప్స్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ♦ ‘టైటానియం మాక్ 6’: 5.1 లాలీపాప్ ఓఎస్, 6 అంగుళాల తెర, 2 జీబీ ర్యామ్, 3జీ, 16 జీబీ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 3 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి. -
కార్బన్ నుంచి మొబైల్ ఉపకరణాలు
రూ.100 కోట్ల ఆదాయంపై కన్ను హైదరాబాద్: ప్రముఖ దేశీ హ్యాండ్సెట్ తయారీ కంపెనీ కార్బన్, మొబైల్ ఉపకరణాల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 5,000 ఎంఏహెచ్, 7,000 ఎంఏహెచ్, 10,000 ఎంఏహెచ్ వేరియంట్లలో పవర్ బ్యాంక్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.999 నుంచి ప్రారంభ ధర కలిగిన ఇవి స్నాప్‌డీల్‌లో లభిస్తున్నాయి. కార్బన్ మొబైళ్ల కోసం ‘ఆల్ట్రా క్లియర్’ బ్రాండ్ పేరుతో స్క్రీన్ గార్డులను కూడా మార్కెట్లోకితెచ్చింది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొబైల్ పరికరాల విభాగంలో రూ.100 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుందని కార్బన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శశిన్ దేవ్సరి తెలిపారు. -
రజనీ ఫ్యాన్స్‌కు ‘కార్బన్’ కానుక
చెన్నై, సాక్షి ప్రతినిధి : సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులను అలరించేరీతిలో ప్రముఖ మొబైల్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ ‘కార్బన్’ కోచ్చడయాన్ సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్లను శుక్రవారం తమిళనాడు మార్కెట్లోకి విడుదల చేసింది. కార్బన్ ఏ 36, కార్బన్ ఏ 6 ప్లస్ అనే 2 ఆండ్రాయిడ్ ఫోన్లను రూపొందించింది. అదే విధంగా ద లెజెండ్ 2.4, ద లెజెండ్ 2.8 అనే మరో రెండు ఫీచర్ ఫోన్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లలో కోచ్చడయాన్ పాటలు, వీడియోలు, ట్రైలర్స్, వాల్ పేపర్లు ఉంటాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు, రజనీకాంత్ కుమార్తె సౌందర్య మీడియాతో మాట్లాడుతూ తన చిత్రంతో ఈ తరహా సిగ్నేచర్ స్మార్ట్ మొబైల్స్‌ను రూపొందించినందుకు కార్బన్ మొబైల్స్ సంస్థకు అభినందనలు తెలిపారు. సంస్థ చైర్మన్ హసీజ్ మాట్లాడుతూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం వారు ఆరునెలలు కష్టపడి ఈ యూప్స్‌ను రూపొందించారని అన్నారు. మొబైల్ రంగంలో ఈ యూప్స్ కొత్త ఒరవడిని సృష్టించగలవని వివరించారు. -
మూడు దేశీయ మొబైళ్లను ఆవిష్కరించిన సిబల్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు కార్బన్, లావా ఇంటర్నేషనల్, మ్యాక్స్ మొబైల్స్... తయారు చేసిన స్మార్ట్, ఫీచర్ ఫోన్లను టెలికం మంత్రి కపిల్ సిబల్ గురువారం ఇండియా టెలికం 2013 సదస్సు సందర్భంగా ఆవిష్కరించారు. కార్బన్ టైటానియం ఎక్స్ స్మార్ట్‌ఫోన్(ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, ధర రూ.18,490)ను అందుబాటులోకి తెచ్చింది. లావా రూ.5,499, రూ.9,999 రేంజ్‌ల్లో రెండు స్మార్ట్ఫోన్లను అందిస్తోంది. మ్యాక్స్ మొబైల్స్ అందిస్తున్న ఫీచర్ ఫోన్ ధర రూ.1,932. ఈ ఫోన్లో డ్యుయల్ సిమ్, కెమెరా, 16 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, జీపీఆర్ఎస్, ఎల్ఈడీ టార్చ్ వంటి ప్రత్యేకతలున్నాయి.