కార్బన్ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ కార్బన్ తాజాగా ‘క్వాట్రో ఎల్52’, ‘టైటానియం మాక్ 6’ అనే రెండు వినూత్నమైన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చే సింది. వీటి ధరలు వరుసగా రూ.8,790గా, రూ.7,490. కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్లకు వీఆర్ హెడ్‌సెట్స్ (వీఆర్ గ్లాసెస్)ను ఉచితంగా అందిస్తోంది. దీంతో కార్బన్ కూడా వీఆర్ విభాగంలోకి ప్రవేశించినట్లయ్యింది. కాగా, ఇతర మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలతో పోటీపడుతూ కార్బన్ కూడా ‘వర్చ్యువల్ రియాలిటీ’ హెడ్‌సెట్స్ విభాగంలోకి అడుగుపెట్టింది.
♦ ‘క్వాట్రో ఎల్52’: ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల తెర, 4జీ, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,250 ఎంఏహెచ్ బ్యాటరీ, వీఆర్ యాప్స్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది.
♦ ‘టైటానియం మాక్ 6’: 5.1 లాలీపాప్ ఓఎస్, 6 అంగుళాల తెర, 2 జీబీ ర్యామ్, 3జీ, 16 జీబీ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 3 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి.