సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజాలు భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ తరహాలో మరో దిగ్గజం ఐడియా సెల్యులర్ కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లపై ఈ ఆఫర్‌ను ప్రకటించింది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లాంటి ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ తాజా ఆఫర్లను లాంచ్ చేసింది.ఈ ఆఫర్ ద్వారా సరసమైన ధరలో మంచి నాణ్యమైన 4జీ ఫోన్లను కస్టమర్లకు అందించాలనేది తమ ఉద్దేశమని ఐడియా ఎండీ శశి శంకర్ ప్రకటించారు. ఇండియాలో 4జీ నెట్‌వర్క్ విస్తరిస్తుందని భావిస్తున్నామన్నారు. ఇందుకు కార్బన్‌తో భాగస్వామ్యం సంతోషంగా ఉందన్నారు. కార్బన్ స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లపై అందిస్తున్న ఈ ఆఫర్ 2018 ఫిబ్రవరి 1 నుంచి అమలుకానుంది. ముఖ్యంగా కార్బన్ యువ 2 4జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2వేల దాకా క్యాష్‌బ్యాక్ ఆఫర్.
స్మార్ట్‌ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్
కార్బన్ ఎ 41 పవర్, ఎ9 ఇండియన్ (ధర రూ. 2,999, ఎ 9 ధర రూ. 3,699) ఈ రెండిటింపై రూ. 1,500 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే దీనికి ఐడియా మనీ వాలెట్ ద్వారా 169 రూపాయల ప్యాక్, (అన్‌లిమిటెడ్ కాల్స్, 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం వాలిడిటీ 28రోజులు)18 నెలలపాటు రీచార్జ్ చేసుక్ను అనంతరం తొలివిడతగా రూ. 500 , 36నెలల రీచార్జ్ పూర్తయిన తరువాత మిగిలిన వెయ్యి రూపాయల క్యాష్‌బ్యాక్ అందుతుంది.
ఫీచర్ ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్
కార్బన్ కె310ఎన్, కె24ప‍్లస్, కె9 జంబో ఫీచర్ ఫోన్లను రూ.999, రూ.1,199 రూ. 1,399 ధరకే అందిస్తుంది. అంటే రూ 1,000 క్యాష్ బ్యాక్ తరువాత . ఐడియా వినియోగదారులకు కె310 ఫీచర్ ఫోన్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు లెక్క ( 36 నెలల రీచార్జ్‌ల తరువాత). గమనించాల్సిన అంశం ఏమిటంటే..టాక్ టైం రూపంలో ఈ క్యాష్ బ్యాక్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment