కొత్త కొత్త ప్లాన్లతో ఇన్ని రోజులు తీవ్ర ధరల యుద్ధానికి తెరలేపిన టెలికాం కంపెనీలు, ప్రస్తుతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. రిలయన్స్ జియోకి కౌంటర్ ఐడియా సెల్యులార్ 'మ్యాజిక్ క్యాష్‌బ్యాక్' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 3,300 రూపాయల విలువైన క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, పలు ఆన్లైన్ ఛానళ్లను వాడుతూ 398 రూపాయలు, ఆపై మొత్తాలతో కూడిన అపరిమిత ప్లాన్లను రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ఈ క్యాష్‌బ్యాక్ లభిస్తుందని ఐడియా పేర్కొంది. క్యాష్‌బ్యాక్ కింద 50 రూపాయలతో కూడిన ఎనిమిది డిస్కౌంట్ ఓచర్లను అందించనున్నట్టు తెలిపింది. ఈ డిస్కౌంట్ ఓచర్లను కస్టమర్లు తర్వాత రీఛార్జ్ చేయించుకునే 300 రూపాయలు, ఆపై మొత్తాలపై ఏడాదిపాటు రిడీమ్ చేసుకోవచ్చు.
అంతేకాక 2,700 రూపాయల విలువైన ఐదు షాపింగ్ కూపన్లను కూడా అందించనున్నట్టు తెలిపింది. వీటిని తమ పార్టనర్ స్లోర్లు లేదా వెబ్సైట్లలో వినియోగించుకోవచ్చని కుమార్‌మంగళం బిర్లా చెప్పారు. మై ఐడియా యాప్ లేదా కంపెనీ వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేయించుకున్న కస్టమర్లకు, 200 రూపాయల వరకు వాలెట్ క్యాష్‌బ్యాక్ లభించనుంది. 398 రూపాయల ప్లాన్ కింద ఐడియా అపరిమిత వాయిస్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్)ను, రోజుకు 1జీబీ డేటాను, 100 ఎస్ఎంఎస్లను 70 రోజుల పాటు అందించనుంది. ఈ మ్యాజిక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లందరికీ 2018 ఫిబ్రవరి 10 వరకు అందుబాటులో ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment