ఐడియా యూజర్లకు రోజుకి 5జీబీ డేటా | Idea Launches Rs. 998 Pack With 5GB Data Per Day for 35 Days | Sakshi
Sakshi News home page

ఐడియా యూజర్లకు రోజుకి 5జీబీ డేటా

Published Fri, Mar 23 2018 2:42 PM | Last Updated on Fri, Mar 23 2018 2:42 PM

Idea Launches Rs. 998 Pack With 5GB Data Per Day for 35 Days - Sakshi

ఐడియా (ఫైల్‌ ఫోటో)

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు, రిలయన్స్‌ జియోకు ఐడియా సెల్యులార్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. 998 రూపాయలతో సరికొత్త ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్యాక్‌ కింద రోజుకు 5జీబీ 4జీ/2జీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 35 రోజుల పాటు అందిస్తోంది. ఇది ఐడియా మ్యాజిక్‌ ఆఫర్‌తో వచ్చింది. అంటే ఐడియా యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకునే తన ప్రీపెయిడ్‌ సబ్‌స్క్రైబర్లకు రూ.3,300 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్యాక్‌పై ఒక వారంలో 100 యూనిక్‌ నెంబర్లకు మాత్రమే కాల్‌ చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాక వారానికి 1000 నిమిషాలు, రోజుకు 250 నిమిషాలను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్యాక్‌ తొలుత ఒడిశా సర్కిల్‌కు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఐడియా మ్యాజిక్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ లేకుండా ఇదే రకమైన ప్రయోజనాలను కర్నాటక సర్కిల్‌ వారికి కూడా 28 రోజుల పాటు ఐడియా ఆఫర్‌ చేస్తోంది. 

అయితే ఐడియా రూ.998 ప్యాక్‌ మాదిరిగా కాకుండా... జియో తన సబ్‌స్క్రైబర్లకు రోజుకు 5జీబీ 4జీ డేటాను, అపరిమిత కాల్స్‌ను రూ.799కే 28 రోజుల పాటు అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ కూడా రూ.799 ప్లాన్‌పై రోజుకు 3.5జీబీ 4జీ డేటాను తన వినియోగదారులు కూడా వాడుకునేలా వీలు కల్పించింది. రూ.998 ప్యాక్‌తో పాటు ఎంపిక చేసిన సర్కిల్స్‌ వారికి ఐడియా రోజుకు 7జీబీ డేటా అందించే రూ.1,298 ప్యాక్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు టెలికాంటాక్‌ రిపోర్టు చేసింది. ఈ ప్యాక్‌ను కూడా 35 రోజుల పాటు అందుబాటులో ఉంచుతుందని తెలిపింది. రూ.1,298 ప్యాక్‌లో అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను ఐడియా ఆఫర్‌ చేస్తోంది. అంతేకాక రూ.3,300 రూపాయల విలువైన ప్రయోజనాలతో ఐడియా మ్యాజిక్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌  కూడా అందుబాటులో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement