ప్రస్తుతమున్న రోజుల్లో అందరూ అధిక ఆదాయాన్ని సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. ఇందుకు తగిన ప్రయాత్నాలు కూడా చేస్తుంటారు. దీనిలో కొందరు సఫలమవుతుంటారు. మరికొందరు విఫలమవుతుంటారు. అయితే ప్రస్తుత శీతాకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయమిచ్చే వ్యాపారం గురించి తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో చదువుకున్న వారు కూడా వ్యవసాయం చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. దీనికి ప్రభుత్వసాయం కూడా అందుతుంది. అందుకే అధిక లాభాలనిచ్చే అల్లంసాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం అనేది టీలో వినియోగించడం మొదలుకొని కూరలలో వేసేవరకూ అన్నింటా ఉపయుక్తమవుతుంది. అందునా చలికాలంలో అల్లాన్ని విరివిగా వినియోగిస్తుంటారు. పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో కూరలు వండేటప్పుడు అల్లాన్ని తప్పనిసరిగా వినియోగిస్తారు.
అల్లాన్ని నీటి ఆధారితంగా సాగు చేస్తుంటారు. హెక్టారు భూమిలో అల్లం సాగుచేయాలనుకుంటే రెండు క్వింటాళ్ల నుండి మూడు క్వింటాళ్ల వరకూ విత్తనాలు అవసరమవుతాయి. సాగు సమయంలో సరైన గట్లను సిద్ధం చేసుకోవాలి. సరైన కాలువలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా అల్లం సాగుకు నీరు సక్రమంగా అందుతుంది. నీరు నిలిచిపోయే పొలాల్లో అల్లం సాగు చేయకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అల్లం సాగుకు పీహెచ్(పొండస్ హైడ్రోజెని) 6 నుండి పీహెచ్ 7 వరకు ఉన్న భూమి మెరుగైనదిగా పరిగణిస్తారు.
అల్లం మొక్కల మధ్య దూరం 25 నుండి 25 సెం.మీ మధ్య ఉండాలి. విత్తనాల మధ్య దూరం 30 నుండి 40 సెం.మీ మధ్య ఉండాలి. సమయానుసారంగా ఆవు పేడను ఎరువు మాదిరిగా వేయాలి. అల్లం పంట చేతికి వచ్చేందుకు 8 నుంచి 9 నెలల సమయం పట్టవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో అల్లం మంచి ధరలకు అమ్ముడవుతోంది. ఒక హెక్టారుకు అల్లం దిగుబడి సుమారు 150 నుంచి 200 క్వింటాళ్ల వరకు ఉంటుంది. దీనిని విక్రయించడం ద్వారా లక్షల రూపాయాల్లో ఆదాయాన్ని సంపాదించవచ్చు.
ఇది కూడా చదవండి: 10 లక్షల పూలతో ఫ్లవర్ షో.. చూసి తీరాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment