K9 Kavach 4G
-
కార్బన్ ‘కే9 కవచ్ 4జీ’ @రూ.5,290
న్యూఢిల్లీ: కార్బన్ మొబైల్స్ తాజాగా ‘కే9 కవచ్ 4జీ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.5,290. భీమ్ డిజిటల్ పేమెంట్ యాప్ ఇన్ బిల్ట్‌గా వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫీచర్ కోసం కంపెనీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘కే9 కవచ్ 4జీ’ స్మార్ట్‌ఫోన్స్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ మొబైల్ హ్యాండ్‌సెట్‌లో 5 అంగుళాల డిస్ప్లే, 1.25 గిగాహెర్ట్›్జ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5 ఎంపీ రియర్ అండ్ ఫ్రంట్ కెమెరాలు, 2,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. -
కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్, రూ. 5,290లకే
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ తయారీదారు కార్బన్ కే 9 కవచ్ 4జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫింగర ప్రింట్ సెన్సర్‌తో వస్తున్న ఈ 4జీ మొబైల్ ధరనుకేవలం రూ.5290 కేఅందిస్తోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ యాప్‌ను ఈ డివైస్‌లో అందుబాటులో ఉంచింది. కార్బన్ కె9 కవచ్ 4జీ ఫీచర్లు 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 1 జీబీ ర్యామ్ 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 2300 ఎంఏహెచ్ బ్యాటరీ