‘హీరో పంటి’తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న టైగర్ ష్రాఫ్ తన ఆరంగేట్రం అదిరిపోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తాను చేసిన కఠోర సాధనే హీరోగా నిలబెడతుందన్న ధీమాతో ఉన్నాడు. ఈ నెల 23న సినిమా థియేటర్లలో విడుదల కానున్న ‘హీరో పంటి’ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుందన్నాడు. అదే రోజు తన తండ్రి జాకీ ష్రాఫ్ విలన్‌గా నటించిన కొచ్చడియాన్ సినిమా రిలీజ్ అవుతుండటం కూడా సంతోషంగా ఉందన్నాడు. ఇది తండ్రీకొడుకుల మధ్య పోటీ అని పేర్కొన్నాడు. ‘హీరో పంటి విజయవంతం కావడం కోసం హీరోగా చాలా శ్రమించా. ఈ మూవీని ప్రేక్షకులు స్వీకరిస్తారన్న నమ్మకం ఉంది’ అని చెబుతున్నాడు టైగర్ ష్రాఫ్.
తొలిసారిగా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న ష్రాఫ్ ఈ సినిమా విజయవంతమైనా కాకపోయినా తనదైన ముద్ర వేయగలుగుతానని ధీమాగా చెప్పాడు. ‘ఒకరోజు టైగర్ ష్రాఫ్ గురించి ట్విట్టర్‌లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేకమంది సామాజిక అనుసంధాన వేదికలో నా పేరుపై తమాషాగా కామెంట్లు రాయడం చూశా. వాటిని చదివి నవ్వుకున్నా’నని తెలిపాడు. ఇప్పుడే ఇలా చర్చల్లో ఉంటే ప్రేక్షకులపై కొంత ఇప్పటికే ప్రభావం చూపినట్టేనని అన్నాడు.
పబ్లిసిటీ అనేది పబ్లిసిటీయే. అది చెడా, మంచా అన్నది పరిగణనలోకి తీసుకోవద్దు. మన గురించి ఎవరూ మాట్లాడకపోతేనే ఆందోళన చెందాలని అన్నాడు టైగర్ ష్రాఫ్. చూపుల కన్నా ప్రతిభ ముఖ్యమని తెలిపాడు. ‘నేనేమిటనేదిో ప్రేక్షకులకు చూపాలనుకుంటున్నా. వారికి నచ్చిన తరహాలోనే నా పాత్ర ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నటనను మార్చుకుంటా. నా ప్రతిభను నిరూపించుకుంటాన’ని తెలిపాడు. ‘హీరోపంటి’ సినిమా ప్రచారం కోసం వారణాసికి వచ్చిన టైగర్ ష్రాఫ్... ఢిల్లీ, పంజాబ్, నాగపూర్‌లకు కూడా వెళ్లనున్నాడు.
‘హీరోపంటి’తో అదరగొడతా
Published Sun, May 11 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM
Advertisement