Heropanti
-
టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్
Tiger Shroff Shares Heropanti 2 New Look: బాలీవుడ్ యాక్షన్ హీరోగా జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ పేరుపొందాడు. 'హీరోపంటి' సినిమాతో బాలీవుడ్లో తెరంగ్రేటం చేసిన ఈ యంగ్ యాక్షన్ హీరో బాఘీ, బాఘీ 2, బాఘీ 3, వార్ చిత్రాలతో అలరించాడు. మరోసారి తన యాక్షన్ విన్యాసాలతో అబ్బురపరిచేందుకు రెడీ అవుతున్నాడు. టైగర్ తొలి చిత్రమైన హీరోపంటి సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న హీరోపంటి 2 కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ అహ్మద్ ఖాన్ భారీ యాక్షన సీక్వెన్స్‌ను రూపొందించే పనిలో ఉన్నాడని సమాచారం. అయితే ఈ సినిమాలోని ఓ భారీ పోరాట సన్నివేశం కేసం అత్యంత విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈద్ కానుకగా ఈ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు టైగర్ ష్రాఫ్. 'హీరోపంటి స్థాయిని ఈ షెడ్యూల్ రెట్టింపు చేసింది. అత్యంత ఛాలెంజింగ్ సీక్వెన్స్‌లలో ఒకదాని కోసం షూటింగ్ చేస్తున్నాం. దాని గ్లింప్స్ షేర్ చేసుకునేందుకు వేచి ఉండలేను.' అని టైగర్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తుండగా తారా సుతారియా హీరోయిన్గా నటిస్తోంది. అయితే టైగర్ పోస్ట్‌కు 'వేచి ఉండలేను' అని కామెంట్ చేసింది బీటౌన్ ముద్దుగుమ్మ దిశా పటాని. టైగర్ ష్రాఫ్, దిశా రిలేషన్లో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) ఇదీ చదవండి: సినిమా షూటింగ్లో టైగర్ ష్రాఫ్‌కు గాయం.. ఫొటో షేర్ చేసిన నటుడు -
‘జేమ్స్ బాండ్’ కోసం లండన్ థియేటర్ మొత్తం బుక్ చేసిన బాలీవుడ్ నిర్మాత
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హీరోపంతి 2’. లండన్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ టీం గురువారం విడుదలై జేమ్స్ బాండ్ సిరీస్ ‘నో టైమ్ టు డై’ సినిమాను అక్కడ థియేటర్లో చూసి ఎంజాయ్ చేసింది. ఈ జేమ్స్ బాండ్ సిరీస్ చూసేందుకే నిర్మాత సాజిద్ నడియద్వాలా ‘హీరోపంత్ 2 మూవీ టీం, క్రూడ్ కోసం ఏకంగా లండన్‌లోని థియేటర్ మొత్తం బుక్ చేశాడట. లండన్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సెలబ్రెషన్స్‌లో భాగంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసి చిత్రం బృందంతో కలిసి ఆయన సినిమా చూశాడు. చదవండి: ప్రెగ్నెన్సీ వల్ల.. మూవీస్ నుంచి తొలగించారు నిర్మాతతో పాటు హీరో టైగర్ ష్రాఫ్, నటి తార సుతరియా, డైరెక్టర్ అహ్మద్ ఖాన్‌తో పాటు మిగతా తారగణం, క్రూడ్ ఉన్నారు. నెల రోజుల పాటు లండన్‌లో షూటింగ్‌ను జరుపుకున్న ‘హీరోపంత్ 2’ టీం ఈ నేపథ్యంలో ‘నో టైమ్ టూ డై’ సినిమాను చూసి సెలబ్రెట్ చేసుకున్నారు. కాగా ఆహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ హీరోపంత్ 2’ వచ్చే ఏడాది మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: జేమ్స్ బాండ్: ‘నో టైమ్ టు డై’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా! -
ఈసారి యాడ్ కోసం జత కట్టింది
వారణాసి: ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ మరోసారి టైగర్ ష్రాఫ్ సరసన నటించబోతుంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్ రాయ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 'టైగర్, ఆనంద్ సర్ తో నేను' అంటూ ఆమె ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపింది. దీనికి సంబంధించి టైగర్ ష్రాఫ్, ఆనంద్ రాయ్ తో బెనారస్ లో ఓ సెట్ లో ఉన్న ఫొటో ట్విటర్ లో పెట్టి 'సర్ప్రైజ్ సర్ప్రైజ్' అంటూ ట్యాగ్ లైన్ పెట్టింది. 2014లో వీరిద్దరు కలిసి 'హీరోపంతి' అనే చిత్రంతో రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఆ చిత్రం తర్వాత గత ఏడాది చివర్లో ఓ వీడియో సాంగ్ లో వీరిద్దరు నటించారు. ఆనంద్ రాయ్ తనువెడ్స్ మను, రాంజానా, తను వెడ్స్ మను: రిటర్న్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే, అంత సర్ ప్రైజ్ గా పేరు కూడా తెలియకుండా తీస్తున్న ఈ చిత్రం ఏమై ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటుండగా అది ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్ అట. -
మొదటి మెట్టుమీదే ఉన్నా..
ముంబై: ‘నేనింకా మొదటి మెట్టుమీదే ఉన్నా.. ఇప్పుడే శిఖరం అంచుపైన దృష్టిపెడితే కిందపడిపోయే ప్రమాదం ఉంది కదా.. అందుకే నిదానంగా పైకి వెళతా..’ అంటోంది బాలీవుడ్ నటి కృతిసనన్. తాను నటించిన హిందీ సినిమా ‘హీరోపంతి’ సూపర్‌హిట్ కావడంతో ఇప్పుడు ఆమె టాక్ ఆఫ్ ది బాలీవుడ్‌గా మారిపోయింది. తాను ఇప్పటివరకు రెండు సినిమాలే చేశానని, ఒకటి బాలీవుడ్లో ‘హీరోపంతి’ కాగా, రెండోది తెలుగు సినిమా అని చెప్పింది. ’హీరోపంతి’ తామనుకున్న దానికన్నా పెద్ద హిట్ అవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ‘దీంతోనే నేనేదో సాధించేశానని పొంగిపోలేను.. నేనింకా ఆరంభదశలోనే ఉన్నా.. సాధించాల్సింది చాలా ఉంది.ఇప్పుడే నేను ఏదో సాధించేశానని అనుకుంటే ఇక్కడితో నా కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసుకున్నట్లే..’ అని ఆమె స్పష్టం చేసింది. తన మీద అంచనాలనేవి ప్రజలు దృష్టిలో పెరగాలి తప్ప తనకు తానుగా పెంచుకోకూడదని తెలుసునంది. ‘ఇప్పుడిప్పుడే కెరీర్లో బిజీగా మారుతున్నా.. దానికనుగుణంగానే నా ఆలోచనాసరళి కూడా కొంచెం మార్చుకుంటున్నా. మొదటి అడుగులోనే విజయం సాధించినంతమాత్రాన తర్వాత అన్ని అంచనాలు ఒకేలా ఉంటాయనుకోవడం భ్రమే అవుతుంది. ‘మన హెయిర్‌స్టైల్ మార్చామనుకోండి.. మనలో భౌతికంగా కొంత మార్పు కనిపిస్తుంది కదా.. అంతమాత్రాన మనం మానసికంగా కూడా మారిపోయామనుకోవడం కరెక్ట్ కాదు..’ అని ఆమె స్పష్టం చేసింది. నేను ఈ సినిమా పరిశ్రమకు కొత్తదాన్ని. గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు.. అందుకే నేను వ్యక్తిగతంగా చాలామంది ప్రొడ్యూసర్లను కలిశా.. నా గురించి వివరించా.. అదృష్టవశాత్తు నా మొదటి నిర్మాత సాజిద్ నాదియావాలా నన్ను, టైగర్ షరాఫ్‌ను కన్నబిడ్డల్లా చూసుకున్నారు..’ అని చెప్పింది. సాజిద్‌తో మూడు సినిమాలకు చేసేందుకు కృతిసనన్ ఒప్పందం చేసుకుంది. అయితే నేను బయట సినిమాలకు కూడా చేసేందుకు సాజిద్ సార్ అంగీకరించారని ఆమె పేర్కొంది. తెలుగులో తాను సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో నటించిన మొదటి సినిమా ‘నేనొక్కడినే’ యావరేజ్‌గా నడిచింది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా రెండో సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. కాగా, ప్రస్తుతం ‘హీరోపంతి’ విజయం తర్వాత తన మొదటి ప్రాధాన్యత బాలీవుడ్‌కే ఇస్తానని ముక్తాయించింది ఈ అందాల సుందరి. -
మొదటి మెట్టుమీదే ఉన్నా
‘నేనింకా మొదటి మెట్టుమీదే ఉన్నా.. ఇప్పుడే శిఖరం అంచుపైన దృష్టిపెడితే కిందపడిపోయే ప్రమాదం ఉంది కదా.. అందుకే నిదానంగా పైకి వెళతా..’ అంటోంది బాలీవుడ్ నటి కృతిసనన్. తాను నటించిన హిందీ సినిమా ‘హీరోపంతి’ సూపర్‌హిట్ కావడంతో ఇప్పుడు ఆమె టాక్ ఆఫ్‌ది బాలీవుడ్ గా మారిపోయింది. తాను ఇప్పటివరకు రెండు సినిమాలే చేశానని, ఒకటి బాలీవుడ్లో ‘హీరోపంతి’ కాగా, రెండోది తెలుగు సినిమా అని చెప్పింది. ’హీరోపంతి’ తామనుకున్న దానికన్నా పెద్ద హిట్ అవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ‘దీంతోనే నేనేదో సాధించేశానని పొంగిపోలేను.. నేనింకా ఆరంభదశలోనే ఉన్నా.. సాధించాల్సింది చాలా ఉంది.ఇప్పుడే నేను ఏదో సాధించేశానని అనుకుంటే ఇక్కడితో నా కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసుకున్నట్లే..’ అని ఆమె స్పష్టం చేసింది. తన మీద అంచనాలనేవి ప్రజలు దృష్టిలో పెరగాలి తప్ప తనకు తానుగా పెంచుకోకూడదని తెలుసునంది. ‘ఇప్పుడిప్పుడే కెరీర్లో బిజీగా మారుతున్నా.. దానికనుగుణంగానే నా ఆలోచనాసరళి కూడా కొంచెం మార్చుకుంటున్నా. మొదటి అడుగులోనే విజయం సాధించినంతమాత్రాన తర్వాత అన్ని అంచనాలు ఒకేలా ఉంటాయనుకోవడం భ్రమే అవుతుంది. ‘మన హెయిర్‌స్టైల్ మార్చామనుకోండి.. మనలో భౌతికంగా కొంత మార్పు కనిపిస్తుంది కదా.. అంతమాత్రాన మనం మానసికంగా కూడా మారిపోయామనుకోవడం కరెక్ట్ కాదు..’ అని ఆమె స్పష్టం చేసింది. నేను ఈ సినిమా పరిశ్రమకు కొత్తదాన్ని. గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు.. అందుకే నేను వ్యక్తిగతంగా చాలామంది ప్రొడ్యూసర్లను కలిశా.. నా గురించి వివరించా.. అదృష్టవశాత్తు నా మొదటి నిర్మాత సాజిద్ నాదియావాలా నన్ను, టైగర్ షరాఫ్‌ను కన్నబిడ్డల్లా చూసుకున్నారు..’ అని చెప్పింది. సాజిద్‌తో మూడు సినిమాలకు చేసేందుకు కృతిసనన్ ఒప్పందం చేసుకుంది. -
‘హీరోపంటి’తో అదరగొడతా
‘హీరో పంటి’తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న టైగర్ ష్రాఫ్ తన ఆరంగేట్రం అదిరిపోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తాను చేసిన కఠోర సాధనే హీరోగా నిలబెడతుందన్న ధీమాతో ఉన్నాడు. ఈ నెల 23న సినిమా థియేటర్లలో విడుదల కానున్న ‘హీరో పంటి’ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుందన్నాడు. అదే రోజు తన తండ్రి జాకీ ష్రాఫ్ విలన్‌గా నటించిన కొచ్చడియాన్ సినిమా రిలీజ్ అవుతుండటం కూడా సంతోషంగా ఉందన్నాడు. ఇది తండ్రీకొడుకుల మధ్య పోటీ అని పేర్కొన్నాడు. ‘హీరో పంటి విజయవంతం కావడం కోసం హీరోగా చాలా శ్రమించా. ఈ మూవీని ప్రేక్షకులు స్వీకరిస్తారన్న నమ్మకం ఉంది’ అని చెబుతున్నాడు టైగర్ ష్రాఫ్. తొలిసారిగా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న ష్రాఫ్ ఈ సినిమా విజయవంతమైనా కాకపోయినా తనదైన ముద్ర వేయగలుగుతానని ధీమాగా చెప్పాడు. ‘ఒకరోజు టైగర్ ష్రాఫ్ గురించి ట్విట్టర్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేకమంది సామాజిక అనుసంధాన వేదికలో నా పేరుపై తమాషాగా కామెంట్లు రాయడం చూశా. వాటిని చదివి నవ్వుకున్నా’నని తెలిపాడు. ఇప్పుడే ఇలా చర్చల్లో ఉంటే ప్రేక్షకులపై కొంత ఇప్పటికే ప్రభావం చూపినట్టేనని అన్నాడు. పబ్లిసిటీ అనేది పబ్లిసిటీయే. అది చెడా, మంచా అన్నది పరిగణనలోకి తీసుకోవద్దు. మన గురించి ఎవరూ మాట్లాడకపోతేనే ఆందోళన చెందాలని అన్నాడు టైగర్ ష్రాఫ్. చూపుల కన్నా ప్రతిభ ముఖ్యమని తెలిపాడు. ‘నేనేమిటనేదిో ప్రేక్షకులకు చూపాలనుకుంటున్నా. వారికి నచ్చిన తరహాలోనే నా పాత్ర ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నటనను మార్చుకుంటా. నా ప్రతిభను నిరూపించుకుంటాన’ని తెలిపాడు. ‘హీరోపంటి’ సినిమా ప్రచారం కోసం వారణాసికి వచ్చిన టైగర్ ష్రాఫ్... ఢిల్లీ, పంజాబ్, నాగపూర్‌లకు కూడా వెళ్లనున్నాడు. -
మంచు కురిసే వేళలో రొమాన్స్!
మంచు కురిసే వేళలో టైగర్ ష్రాఫ్, కృతి సనాన్ ప్రేమ ఊసులు చెప్పుకోవడం మొదలుపెట్టారు. మైనస్ 9 డిగ్రీల చలిని కూడా ఈ ఇద్దరూ ఖాతరు చేయలేదు. బహుశా వాళ్లున్న పరిస్థితికి మంచు కూడా వేడిగా, హాయిగా అనిపించిందేమో! పైగా పదడుగుల ఎత్తున్న ఉయ్యాలలో ఊగుతూ తీయని కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. హఠాత్తుగా ఉయ్యాల జారింది. ప్రేమికులిద్దరూ మంచుగడ్డలపై కూలబడ్డారు. దాంతో గాయాలపాలయ్యారు. ఇదంతా జరిగింది... ‘హీరోపంటి’ చిత్రం షూటింగ్లో. జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్, కృతి సనాన్ జంటగా షబ్బీర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హీరో హీరోయిన్లపై కాశ్మీర్లో రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన జరిగింది. దీని గురించి షబ్బీర్ మాట్లాడుతూ - ‘‘కాశ్మీర్లో వాతావరణం తట్టుకోలేనంత చల్లగా ఉంది. మేమంతా వంటినిండా బట్టలేసుకుంటే, టైగర్, కృతి మాత్రం చిట్టి, పొట్టి దుస్తుల్లో షూటింగ్ చేయాల్సి వచ్చింది. అయినా ఇద్దరూ వెనకడుగు వేయలేదు. వెన్నులో వణుకుపుడుతున్నా బయటికి కనిపించనివ్వకుండా షూటింగ్లో లీనమయ్యారు. దురదృష్టం కొద్దీ ఉయ్యాల తెగిపోయింది. ఇద్దరికీ చాలా గాయాలయ్యాయి. కానీ, తమ కారణంగా షూటింగ్‌కి ఆటంకం ఏర్పడకూడదని, గాయాలను లెక్క చేయకుండా నటించారు. ఈ యువతారల కమిట్మెంట్ చూసి ఆశ్చర్యపోయాం’’ అని చెప్పారు.