ఈసారి యాడ్ కోసం జత కట్టింది | Kriti Sanon teams up with Tiger Shroff again | Sakshi
Sakshi News home page

ఈసారి యాడ్ కోసం జత కట్టింది

Published Sun, Sep 18 2016 6:47 PM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

ఈసారి యాడ్ కోసం జత కట్టింది - Sakshi

ఈసారి యాడ్ కోసం జత కట్టింది

వారణాసి: ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ మరోసారి టైగర్ ష్రాఫ్ సరసన నటించబోతుంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్ రాయ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 'టైగర్, ఆనంద్ సర్ తో నేను' అంటూ ఆమె ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపింది. దీనికి సంబంధించి టైగర్ ష్రాఫ్, ఆనంద్ రాయ్ తో బెనారస్ లో ఓ సెట్ లో ఉన్న ఫొటో ట్విటర్ లో పెట్టి 'సర్ప్రైజ్ సర్ప్రైజ్' అంటూ ట్యాగ్ లైన్ పెట్టింది. 2014లో వీరిద్దరు కలిసి 'హీరోపంతి' అనే చిత్రంతో రంగ ప్రవేశం చేశారు.

అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఆ చిత్రం తర్వాత గత ఏడాది చివర్లో ఓ వీడియో సాంగ్ లో వీరిద్దరు నటించారు. ఆనంద్ రాయ్ తనువెడ్స్ మను, రాంజానా, తను వెడ్స్ మను: రిటర్న్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే, అంత సర్ ప్రైజ్ గా పేరు కూడా తెలియకుండా తీస్తున్న ఈ చిత్రం ఏమై ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటుండగా అది ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్ అట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement