సౌందర్యా రజనీకాంత్
రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ మరో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని సౌందర్యా రజనీకాంత్ స్వయంగా నిర్ధారించారు. ‘‘ఇంకోవారంలో పెళ్ళి కూతురిని కాబోతున్నాను’’ అంటూ పెళ్లి గెటప్‌లో ఉన్న ఫోటోను ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు తన కుమారుడి పేరు, కాబోయే భర్త పేరుతో తన పేరుని జతచేసి క్యాప్షన్‌గా పెట్టడం విశేషం. గతంలో పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌ను వివాహం చేసుకున్న సౌందర్య 2016లో విడాకులు తీసుకున్నారు. వాళ్లకు వేద్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం విశాగన్‌ను ఫిబ్రవరి 11న వివాహం చేసుకోనున్నారు. విశాగన్ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. 9 నుంచి 11 వరకూ పెళ్లి సంబరాలు జరుగుతాయట.
Comments
Please login to add a commentAdd a comment