
సాక్షి, చెన్నై: తన తండ్రి రజనీకాంత్‌కు తమిళంలో రాయడం రాదని సినీ దర్శకురాలు, రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ విశాఖన్ అన్నారు. ఈమె సొంతంగా హూట్ అనే సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించారు. సోమవారం చెన్నైలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో నటుడు రజనీకాంత్ ఆన్‌లైన్ ద్వారా దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సౌందర్య మాట్లా డుతూ.. తన తండ్రి ఓ సందర్భంలో ముఖ్యమైన విషయాన్ని వాయిస్ మెసేజ్ ద్వారా తనకు పంపించారన్నారు.
చదవండి: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో దివ్య భారతిని మైమరిపించారు
అప్పుడే హూట్ పేరుతో సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించాలన్న ఆలోచన వచ్చిందన్నారు. ఇది ట్విట్టర్, ఫేస్‌బుక్ తరహాలో మరింత ఉన్నతమైన సేవలను ప్రజలకు అందిస్తుందని చెప్పారు. 15 జాతీయ భాషలు, 10 అంతర్జాతీయ భాషల్లో ఈ వాయిస్ హూట్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తన తండ్రి తమిళం, తెలుగు, కన్నడం, హిందీ తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని, అయితే తమిళంలో రాయడం సరిగా రాదని తెలిపారు. ఈ నిజం చెప్పడం వల్ల ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానం ఏ మాత్రం తగ్గదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చదవండి: ‘హరిహర వీరమల్లు’లో అకీరా?, తండ్రితో కలిసి పలు సీన్స్‌లో సందడి..
Comments
Please login to add a commentAdd a comment