Rajinikanth Daughter Soundarya Shares Pic With Her Newborn Son Veer- Sakshi
Sakshi News home page

Soundarya Rajinikanth: కొడుకు ఫొటో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ అయిన సౌందర్య రజనీకాంత్‌

Published Thu, Sep 22 2022 6:20 PM | Last Updated on Thu, Sep 22 2022 7:06 PM

Rajinikanth Daughter Soundarya Shares Pic With Her Newborn Son Veer - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. తాను తల్లైన విషయాన్ని పంచుకుంటూ చిన్నారికి వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడి అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. సెప్టెంబర్‌ 20న తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు. తనయుడు వీర్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఇందులో సౌందర్య మెడలో పూలదండ వేసుకుని ఉండగా ఆమె వెనకాలే రజనీ నిలుచుని కనిపించారు.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌పై బ్రిటిషర్ల విమర్శలు, రాజమౌళి స్ట్రాంగ్‌ కౌంటర్‌

ఇక తన పోస్ట్‌లో తండ్రిని ఉద్దేశిస్తూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ‘నిన్న నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సంవత్సరం దేవుడు నన్ను ఉత్తమమైన బహుమతితో దీవించాడు. అది నా పాప వీర్‌. అలాగే ఆ దేవుడు ఇచ్చిన మరో అద్భుతమైన వరం ఎప్పుడూ నా వెనకాల ఉంటుంది. ఆయనే నా ధైర్యం, బలం, ఆశీర్వాదం’ అంటూ సౌందర్య ఎమోషనల్‌ అయ్యారు. 

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌పై బ్రిటిషర్ల విమర్శలు, రాజమౌళి స్ట్రాంగ్‌ కౌంటర్‌

కాగా 2017లో మొదటి భర్త అశ్విన్‌ రామ్‌కుమార్‌ నుంచి విడాకులు తీసుకున్న సౌందర్య.. 2019లో నటుడు, వ్యాపారవేత్త విషగన్‌ వనంగమూడిని రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి తొలి సంతానంగా ఇటీవల వీర్‌ జన్మించాడు. అయితే గ్రాఫిక్‌ డిజైనర్‌, నిర్మాతగా సౌందర్య కోలీవుడ్‌లో రాణిస్తున్నారు. ఓచెర్‌ పిక్చర్స్‌ ప్రొడక్షన్‌ సంస్థ ద్వారా పలు సినిమాలను తెరకెక్కిస్తున్న ఆమె తన తండ్రి రజనీకాంత్‌ విక్రమసింహ సినిమాతో దర్శకురాలిగా మారారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement