ఈసారి రొమాంటిక్ కామెడీ | romantic comedy movie Rajinikanth Ashwin | Sakshi

ఈసారి రొమాంటిక్ కామెడీ

Aug 30 2016 1:39 AM | Updated on Sep 12 2019 10:40 AM

ఈసారి రొమాంటిక్ కామెడీ - Sakshi

ఈసారి రొమాంటిక్ కామెడీ

సినిమాకు ఎవర్‌గ్రీన్ హిట్ ఫార్ములా అంటే రొమాంటిక్ కామెడీ కథలే. ఇవి మినిమమ్ గ్యారెంటీ చిత్రాలు కూడా.

సినిమాకు ఎవర్‌గ్రీన్ హిట్ ఫార్ములా అంటే రొమాంటిక్ కామెడీ కథలే. ఇవి మినిమమ్ గ్యారెంటీ చిత్రాలు కూడా. ఈసారి తనూ ఆ పంథాలోనే నటుస్తున్నానంటున్నారు మహిళా దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్. ఈమె సూపర్‌స్టార్ రజనీకాంత్ వారుసురాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి హీరోగా చిత్రం చేసిన అరుదైన దర్శకురాలీమె. సౌందర్య కోచ్చడైయాన్ చిత్రంతో మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే.
 
  భారతీయ సినీ చరిత్రలోనే క్యాప్చరింగ్ ఫార్మాట్‌లో తెరకెక్కిన తొలి యానిమేషన్ 3డీ చిత్రం ఇది. ఆ విధంగా సౌందర్య రజనీకాంత్ అశ్విన్ మొదటి చిత్రంతోనే గొప్ప ప్రయోగం చేశారని చెప్పవచ్చు. కాగా తన తండ్రి సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవిత చరిత్రను చిత్రంగా మలచనున్నారనే ప్రచారం ఇటీవల మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే అందులో నిజం లేదని సౌందర్య స్పష్టం చేశారు.
 
 మలి ప్రయత్నంగా ఒక రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలిపారు. కాగా ఇందులో నటుడు, ఆమె బావ ధనుష్ కథానాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అదీ అసత్య ప్రచారమేననీ, మరో యువ నటుడు నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయనీ, ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్లనుందని సౌందర్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement