Soundarya Rajinikanth registers a police complaint about missing of car key - Sakshi
Sakshi News home page

Soundarya Rajinikanth: రజనీకాంత్‌ కూతురి ఇంట్లో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు

Published Wed, May 10 2023 2:35 PM | Last Updated on Wed, May 10 2023 3:06 PM

Soundarya Rajinikanth Register Police Complaint About Missing CAR Key - Sakshi

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్య ఇంట్లో దొంగతనం జరిగిన విషయం మరువక ముందే రజనీ చిన్నకూతురు సౌందర్య ఇంట్లో చోరీ జరిగింది. తన ఎస్‌యూవీ కారు కీ కనిపించడం లేదంటూ సౌందర్య చెన్నైలోని తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ప్రైవేట్‌ కాలేజీలో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లివచ్చేలోపు తన ఎస్‌యూవీ కారు కీ కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొంది.

కాగా మార్చి నెలలో ఐశ్వర్య రజనీకాంత్‌ తన ఇంట్లో రూ.60 లక్షల విలువైన నగలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే! అవి తన పెళ్లి నగలని, వాటిని ఇంట్లోని లాకర్‌లో పెట్టినట్లు పేర్కొంది. ఫిబ్రవరి 10న లాకర్‌ తెరిచి చూస్తే ఆ నగలేవీ కనిపించలేదని తెలిపింది. తన ఇంట్లో పని చేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్‌ వెంకట్‌లపై అనుమానం ఉందని చెప్పింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఐశ్వర్య అనుమానమే నిజమైంది. ఆమె ఇంట్లో పని చేసిన ఆ ముగ్గురే ఈ దొంగతనానికి తెగబడ్డారు. దొంగిలించిన ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో చెన్నైలో ఓ ఇల్లుతో పాటు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా కొంతకాలంగా ఐశ్వర్య ఇంట్లోని విలువైన వస్తువులను సైతం దొంగిలిచినట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్‌ చేశారు.

చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన కృతీ సనన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement