ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ డైలాగ్‌లకు, స్టైల్‌కు, స్టెప్పులకు ఎంత ఫేమస్సో తెలిసిందే. తెరపై తలైవా స్టెప్పులేసినా, డైలాగ్‌లు చెప్పినా.. టాప్ లేచి పోవాల్సిందే. రజినీ బయట ఫంక్షన్లో డ్యాన్సులు వేయడం చాలా అరుదు. అలాంటిది రజనీ డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పెళ్లికి వచ్చిన అతిథులకు సీడ్ బాల్స్‌ను రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచారు. సౌందర్య పెళ్లి వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం రజనీ పోయస్ గార్డెన్‌లోని ఇంట్లో మెహిందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో బంధుమిత్రులు ఆడి పాడి ఎంజాయ్ చేశారు. వారితో పాటు రజనీకాంత్ ఒకరిగా స్టెప్స్ వేశారు. ముత్తు చిత్రంలోని ఒరువన్ ఒరువన్ మొదలాలీ అనే పాటకు రజనీకాంత్ చిందులతో సందడి చేస్తుంటే అక్కడున్నవారంతా చూస్తూ ఉండిపోయారు. దటీజ్ రజనీకాంత్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. రజనీ ప్రస్తుతం మురుగుదాస్‌తో ఓ చిత్రం చేసేందుకు రెడీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment