
రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ వివాహ విందు శుక్రవారం ఘనంగా జరిగింది.
చెన్నై: రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ వివాహ విందు శుక్రవారం ఘనంగా జరిగింది. విశాగన్‌ను ఫిబ్రవరి 11న సౌందర్య వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో రజనీకాంత్ దంపతులు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులు కనబడలేదు.
సౌందర్య, విశాగన్.. ఇద్దరికీ ఇది రెండో వివాహం. గతంలో పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌ను వివాహం చేసుకున్న సౌందర్య 2016లో విడాకులు తీసుకున్నారు. వాళ్లకు వేద్ అనే కుమారుడు ఉన్నాడు. విశాగన్ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు.