టాలీవుడ్ హీరో నాగచైతన్య ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మోడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరయ్యారు.
తాజాగా వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి జంటగా కనిపించారు చైతూ- శోభిత. ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురి వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో జంటగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
#SobhitaDhulipala and #NagaChaitanya, who recently tied the knot, attend #AaliyahKashyap and #ShaneGregoire’s reception as newlyweds. ✨#FilmfareLens pic.twitter.com/P5Dw8fmqA4
— Filmfare (@filmfare) December 11, 2024
Comments
Please login to add a commentAdd a comment