సౌందర్యా రజనీకాంత్
కల్కి కృష్ణమూర్తి రచించిన తమిళ చారిత్రాత్మక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలని చాలామంది దర్శక–నిర్మాతలు కలలు కంటుంటారు. వారిలో దర్శకుడు మణిరత్నం పేరు కూడా వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఈ సినిమా తీసే పనిలోనే ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ‘కొచ్చాడియన్’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ఎస్. సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తారు. ‘‘ఈ నవలకు దృశ్యరూపం ఇవ్వాలని చదివినప్పుడే అనిపించింది’’ అని పేర్కొన్నారు సౌందర్య.
Comments
Please login to add a commentAdd a comment