
నటిగా కీర్తీ సురేశ్ ఫుల్ బిజీ. చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. అయితే మరో కొత్త పాత్రలోకి వెళ్లనున్నారని టాక్. కీర్తీ సురేశ్ నిర్మాతగా మారాలనుకుంటున్నారట. దానికి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయని సమాచారం. ఓ తమిళ వెబ్ సిరీస్ కథ కీర్తీని బాగా ఆకట్టుకుందట. ఆ కథను ప్రేక్షకులకు చెప్పాలని సిరీస్‌ను నిర్మించాలని ఫిక్సయ్యారట. నటిగా అద్భుతమైన కథలను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లి శభాష్ అనిపించుకున్నారు కీర్తి. నిర్మాతగా కూడా అలాంటి కథలే చూపిస్తారని ఊహించవచ్చు. మరో విషయం ఏంటంటే కీర్తీ సురేశ్ తండ్రి సురేశ్ కుమార్ మలయాళంలో పాపులర్ ప్రొడ్యూసర్. మరి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటారా? చూడాలి.