
ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలొన్ మస్క్ ఇవాళ చేసిన ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు మస్క్ వార్నింగ్ ఇచ్చారు. ఓపెన్‌ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.
అయితే ఆ ట్వీట్‌లో ఓ సినిమా పోస్టర్‌ను మస్క్ పంచుకున్నారు. దీంతో అందరి దృష్టి ఆ ఫోటోపైనే పడింది. ఇంతకీ ఆ పోస్టర్ చూస్తే ఇండియన్ సినిమాకే చెందినదిగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం ఆ పోస్టర్ గురించే చర్చ మొదలెట్టారు.
అయితే ఆ పోస్టర్ కోలీవుడ్ సినిమాకు చెందినదిగా తెలుస్తోంది. తాజాగా మస్క్ షేర్ చేసిన ఫోటో.. తమ సినిమా తప్పట్టం లోనిది అంటూ తమిళ నిర్మాత ఆదం బవ రిప్లై ఇచ్చారు. నా చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసినందుకు మీకు ధన్యవాదాలు ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
My thanks to Elon Musk for making my movie thappattam poster world famous..😁🙏🏻@elonmusk https://t.co/LRQ7teFgzn pic.twitter.com/pg9DRMImFa
— Adham Bava (@adham_bava) June 11, 2024