డిజిటల్ షోలు, సిరీస్‌లకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. యాక్టర్స్ కూడా వెబ్ మీడియమ్‌లోకి రావడానికి వెనకాడటం లేదు. అనుష్కా శర్మ కూడా వెబ్ మీడియమ్‌లో స్పీడ్ పెంచారు. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌తో షోలు చేయడానికి అంగీకరించారు. అయితే యాక్టర్‌గా కాదు.. ప్రొడ్యూసర్‌గా. ‘ఎన్‌హెచ్ 10, ఫిలౌరి, పరీ’ సినిమాలను నటించి, నిర్మించారు అనుష్కా శర్మ. తనది బెస్ట్ టేస్ట్ అని ప్రశంసలు కూడా అందుకున్నారు.
కొన్ని రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్ కోసం ‘బుల్‌బుల్’ అనే సిరీస్ నిర్మిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం అమేజాన్ కోసం ‘జమున పార్’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రూపొందిస్తున్నారు. సుదీప్ శర్మ, హర్థిక్ మెహతా రచించిన ఈ సిరీస్‌ను ప్రోసిత్ రాయ్, అవినాష్ అరుణ్ డైరెక్ట్ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఈ ఏడాది చివర్లో ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ కానుంది. మరి నెట్టింట్లో నిర్మాతగా స్పీడ్‌గా ఉన్న అనుష్క యాక్టర్‌గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment