Rajinikanth, Kamal Haasan and Vishal Tweets about Vijay's Sarkar Movie Issue - Sakshi
Sakshi News home page

Published Fri, Nov 9 2018 10:45 AM | Last Updated on Fri, Nov 9 2018 11:59 AM

Rajinikanth And Kamal Haasan And Vishal About Sarkar Issue - Sakshi

విజయ్‌, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సర్కార్ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం విజయ్‌ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కావటంతో సినిమా రిలీజ్‌ అయిన దగ్గర నుంచి వివాదాలు చుట్టుముట్టాయి.

తమిళనాట అధికార పార్టీ వ్యతిరేకంగా సన్నివేశాలున్నాయంటూ విమర్శలు వినిపించాయి. అదే సమయంలో దివంగత నేత జయలలిత ను కించపరిచే విధంగా సన్నివేశాలున్నాయంటూ ఆందోళనలు చేపట్టారు. ఈ వివాదంలో సర్కార్‌ సినిమాకుకు అండగా స్టార్‌ హీరోలు మద్ధుతు తెలుపుతున్నారు.

సూపర్‌ రజనీకాంత్‌ సినిమాపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. సెన్సార్ బోర్డ్‌ అన్ని రకాల క్లియరెన్స్‌ ఇచ్చిన తరువాతే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా కొన్ని సీన్స్‌ తొలగించాలంటూ రాద్ధాంతం చేయటం, ప్రదర్శనలు అడ్డుకోవటం చట్ట వ్యతికేరం అన్నారు. మరో టాప్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ‘తమిళనాట ఇలాంటి పరిస్థితి కొత్తేం కాదు. రాజకీయ క్రీడలో ఇది ఆనవాయితీగా వస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు.

మరో స్టార్ విశాల్‌ కూడా విజయ్‌ సినిమా మద్దతు పలికారు. ‘దర్శకుడు మురుగదాస్‌ ఇంట్లో పోలీసులు..? ఎందుకోసం..? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవనే ఆశిస్తున్నా. సినిమాకు సెన్సార్‌ క్లియరెన్స్ వచ్చింది. ఇప్పటికే చాలా మంది ప్రజలు సినిమా చూశారు. అయినా ఈ గొడవ, ఏడుపు ఎందుకు’ అంటూ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement